భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం. ఇక్కడి ప్రతి ప్రాంతాల్లో ఒక్కో పండుగ, విశేషతలు ఉంటాయి. ఎన్నో మతాలు, ఎన్నో కులాలతో పాటు విభిన్నమైన పండుగలు కూడా మనదేశంలో ప్రసిద్ధిచెందినవి. ఒక్కో ప్రాంతానికి ఒక్కో పండుగ పేరుగాంచింది. ఏపీలోని వివిధ ప్రాంతాల్లో ఎన్నో గిరిజనుల పండుగలు, అమ్మవార్ల ఉత్సవాలు ఉన్నాయి. ఇక, ఉత్తరాంధ్ర విషయానికొస్తే..
ఇక్కడివారు పెద్ద పండుగగ చెప్పుకునేది పైడితల్లి అమ్మవారి సిరిమాను పండుగ.. ఈ పండుగ ఇక్కడివారికి ఎంతో ప్రత్యేకం.. తాజాగా ఈ అమ్మవారి సిరిమాను పండుగకు ముహూర్తం ఖరారు చేశారు ఆలయ అర్చకులు. ఈ జాతర ఉత్తరాంధ్రవాసులకు ఎంతో ప్రీతీప్రదాయం... పైడితల్లి అమ్మవారి సిరిమాను జాతరంటే ఒక సంబరమనే చెప్పుకోవాలి. చాలామంది జీవితంలో ఒక్కసారయినా ఆ జాతరను చూసి తరించాలని అనుకుంటూ ఉంటారు. రండి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.
రాష్ట్ర పండుగగా...
విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమాను పండుగ జాతర కోసం ఇప్పటికే అధికారులు వారి పనులను మొదలుపెట్టేశారు. ఏపీ రాష్ట్ర పండుగగా జరిపే ఈ పండుగకు ఒక్క విజయనగర వాసులే కాకుండా విశాఖపట్నం, శ్రీకాకుళం, తెలంగాణ, ఒడిస్సా, ఛత్తీస్ఘడ్ రాష్ట్రాల నుండి కూడా భారీసంఖ్యలో మంది భక్తులు తరలివస్తుంటారు. పైడితల్లి అమ్మవారిని దర్శించుకుని భక్తిపారవశ్యంలో ఉంటారు. ఈ పండుగ మొత్తం నలభై రోజుల పాటు సాగుతుంది. పైడితల్లి అమ్మవారి సిరిమాను పండుగకు రాష్ట్ర ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తుంది.

సెప్టెంబర్ 20 నుంచి ఉత్సవాలు.
అంతటి ప్రాముఖ్యత కలిగిన ఉన్న ఉన్న అమ్మవారి పండగకు ఆలయ అధికారులు ముహూర్తం ఖరారు చేశారు. వచ్చే నెల (సెప్టెంబర్) 20 నుంచి భాద్రపద బహుళ తదియ రోజున మండల దీక్షతో ఈ పండుగ ప్రారంభవుతుంది. పైడితల్లి అమ్మవారి సిరిమాను పండుగ రోజు ఉదయం 11 గంటలకు అమ్మవారికి పండుగ రాట వేసి ఉత్సవాలను మొదలుపెడతారు.
ఈ ఉత్సవాల్లో భాగంగా అక్టోబర్ 14వ తేదిన అమ్మవారి తొల్లెళ్ల ఉత్సవం ఉంటుంది. ఆ తర్వాత ప్రధాన ఘట్టమైన సిరిమాను ఉత్సవం అక్టోబర్ 15న నిర్వహిస్తారు. అక్టోబర్ 22వ తేదీ మంగళవారం పెద్దచెరువులో అమ్మవారి తెప్పోత్సవ కార్యక్రమం ఉంటుంది. అక్టోబర్ 27వ తేది సాయంత్రం కలశ జ్యోతుల ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది. అక్టోబర్ 29వ తేదిన మంగళవారం చదురుగుడి వద్ద ఉయ్యాల కంబాల మహోత్సవం నిర్వహిస్తారు. దీంతోపాటు అక్టోబర్ 30 వ తేదిన బుధవారం వనం గుడి ఆవరణలో చండీహోమం జరిపిస్తారు. ఆ తర్వాత పూర్ణాహుతి, దీక్షా విరమణ ఉదయం ఎనిమిది గంటల నుండి కొనసాగిస్తారు.
8వ సారి సిరిమాను అధిరోహణ...
పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవంలో భాగంగా ఆలయ అలయ అధికారులు అమ్మవారికి సంప్రదాయబద్దంగా పట్టు వస్త్రాలు సమర్పొస్దిరు. ఈ పండుగలో ప్రధాన ఘట్టం ఒకటుంది. అదే అమ్మవారి సిరిమానును ఆలయ ప్రధాన పూజారి బంటుపల్లి వెంకట్రావు ఎనిమిదవ సారి సిరిమానును అధిరోహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ సిరిమానును భక్తులకు అమ్మవారి ప్రతిరూపంగా దర్శనం ఇవ్వనున్నారు. అమ్మవారి సిరిమాను జాతర అనేది ఇక్కడి ఆలయ సంస్కృతి, సంప్రదాయాలతో సాగనుంది.



Click it and Unblock the Notifications













