Search
  • Follow NativePlanet
Share
» »సెప్టెంబ‌ర్‌లో విహారామా..? అయితే, ఐఆర్‌సిటిసి అందిస్తోన్నస్పెష‌ల్ ప్యాకేజీలివే..!

సెప్టెంబ‌ర్‌లో విహారామా..? అయితే, ఐఆర్‌సిటిసి అందిస్తోన్నస్పెష‌ల్ ప్యాకేజీలివే..!

ఐఆర్‌సిటిసి టూరిస్టుల‌కు దేశంలోని ప్రాంతాల‌ను చూపించేందుకు అతి త‌క్కువ బ‌డ్జెట్‌తో టూర్‌ప్యాకేజీల‌ను ప్ర‌క‌టిస్తోంది. అయితే, ప్ర‌తినెలా ఐఆర్‌సిటి అందిస్తోన్న టూర్ ప్యాకేజీల గురించి తెలుసుకుంటారు. సెప్టెంబ‌ర్‌లో విహ‌ర‌యాత్ర‌లు ప్లాన్ చేసేవారికి ఐఆర్‌సిటిసి కొన్ని బెస్ట్ టూర్ ప్యాకేజీల‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్యాకేజీలో టిక్కెట్లు బుక్ చేసేవారు ఎలాంటి ఎక్స్‌ట్రా ఛార్జీలు లేకుండా టూర్‌ను ఎంజాయ్ చేయొచ్చు. ఈ నెల‌లో వినాయ‌క చ‌వితి వంటి పండుగ‌లు వ‌చ్చాయి. ఆ సెల‌వుల్లో లాంగ్ వీకెండ్ ప్లాన్ చేయాల‌నుకునుకునేవారు త‌ప్ప‌కుండా ఈ ప్యాకేజీల గురించి తెలుసుకోవాల్సిందే. రండి ఆ వివ‌రాలేంటో చూసేద్దాం..

సెప్టెంబర్‌లో ఐఆర్‌సిటిసి అందిస్తోన్న టూర్ ప్యాకేజీలు..

లక్నో నుంచి సిమ్లాకు ఐఆర్‌సిటిసి ఉచిత టూర్ ప్యాకేజీనీ అందిస్తోంది. ఈ టూర్ ప్యాకేజీ సెప్టెంబర్ 6 నుంచి ప్రారంభమవుతుంది.

చండీగఢ్ నుంచి గుల్మార్గ్, పహల్గామ్, సోన్‌మార్గ్, శ్రీనగర్ టూర్ ప్యాకేజీ సెప్టెంబర్ 7 వ తేది నుంచి ప్రారంభ‌మ‌వుతుంది.

జైపూర్ నుంచి మధురై, రామేశ్వరం, కన్యాకుమారి, త్రివేండ్రం, కుమరకోమ్, మున్నార్, కొచ్చి టూర్ ప్యాకేజీ సెప్టెంబర్ 9వ తేది నుంచి ప్రారంభ‌మ‌వుతుంది.

shirdi1

ఇక‌, ఢిల్లీ నుంచి లడఖ్-లేహ్ టూర్ ప్యాకేజీ సెప్టెంబర్ 14 వ తేది నుంచి ప్రారంభ‌మ‌వుతుంది.

చెన్నై, ఢిల్లీ నుంచి బద్రీనాథ్, గంగోత్రి, కేదార్‌నాథ్, యమునోత్రి టూర్ ప్యాకేజీ సెప్టెంబర్ 15వ తేది నుంచి ప్రారంభ‌మ‌వుతుంది.

హైదరాబాద్ నుంచి వారణాసి- ప్రయాగ్‌రాజ్ టూర్ ప్యాకేజీ సెప్టెంబర్ 22వ తేది నుంచి ప్రారంభ‌మవుతుంది.
హైదరాబాద్ నుంచి జైపూర్/జోద్ పూర్/పుష్కర్/ఉదయ్ పూర్ సెప్టెంబర్ 23వ తేది నుంచి ప్రారంభ‌మ‌వుతుంది.

చెన్నై టు షిరిడీ స్పెష‌ల్ ప్యాకేజీ..

చెన్నై టు షిరిడీ స్పెష‌ల్ ప్యాకేజీని ఐఆర్‌సిటిసి అందిస్తోంది. ఈ టూర్ ప్యాకేజీ సెప్టెంబర్ 4వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఈ టూర్‌ మొత్తం నాలుగు రోజుల పాటు ఉంటుంది. అందులో మూడు రాత్రులు, నాలుగు ప‌గ‌ళ్లు ఉంటాయి. ఈ టూర్ ట్రైన్, క్యాబ్‌లలో ఉంటుంది. ఈ టూర్ ఫ్యాకేజీ టికెట్ ధర ఇద్దరికయితే రూ.3,600 ఉంటుంది. అదే ఒక్కరికే అయితే రూ.5,500 వరకు ఖర్చవుతుంది. ఈ టూర్ ప్యాకేజీ బుక్ చేసుకోవాల‌నుకునేవారు భారతీయ రైల్వే అధికారిక వెబ్‌సైట్, ఐఆర్‌సిటిసి సంప్ర‌దించొచ్చు. నేరుగా రైల్వేస్టేషన్‌లో బుక్ చేసుకునే అవ‌కాశం కూడా ఉంటుంది.

ayodhya irctc

ముంబై టు అహ్మదాబాద్ స్పెష‌ల్ టూర్ ప్యాకేజీ..

ముంబై టు అహ్మదాబాద్ స్పెష‌ల్ టూర్ ప్యాకేజీని ఐఆర్‌సిటిసి అందిస్తోంది. ఈ టూర్‌లో భాగంగా నాలుగు రాత్రులు, 5 రోజులు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా ఆధ్యాత్మిక, పర్యాటక ప్రదేశాలను సందర్శించొచ్చు. ఈ ట్రిప్‌న్ బుక్ చేసుకోవాల‌నుకునేవారు ఐఆర్‌సిటిసి వెబ్‌సైట్ లేదా యాప్ నుంచి బుక్ చేసుకోవచ్చు. ఈ టూరిజం ప్యాకేజీ ఇద్దరు వ్యక్తులైతే ఒక్కొక్కరికి రూ.25,235 చెల్లించాల్సి ఉంటుంది. సోలోగా ప్ర‌యాణం చేయాలున‌కునేవారికి రూ.45,810 చెల్లించాల్సి ఉంటుంది.

సెప్టెంబర్ 6వ తేదీ నుంచి మ‌రో టూర్ ప్యాకేజీ ప్రారంభ‌మ‌వుతుంది. ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా డెహ్రాడూన్, హరిద్వార్, ముస్సోరి, రిషికేశ్‌లను వీక్షించొచ్చు. ఈ ప్యాకేజీలో భాగంగా ట్రైన్ జ‌ర్నీ ఉంటుంది. ఒక్కొక్కరకీ రూ.22,615 చెల్లించాల్సి ఉంటుంది. సోలో ట్రావెలర్స్‌క‌యితే రూ.38,975 చెల్లించాలి. ఐఆర్‌సిటిసి టూరిజం టికెట్స్ బుక్ చేసుకున్న వారికి ఫ్రీ వ‌స‌తి, ఆహారం ల‌భిస్తుంది. అంతేకాదండోయ్‌.. వీరికి గైడ్ స‌దుపాయం కూడా ఉంటుంది. సెక్యూరిటీ సౌకర్యాలు కూడా లభించనున్నాయి. ఇత‌ర పూర్తి స‌మ‌చారం కోసం భారతీయ రైల్వే అధికారిక వెబ్‌సైట్ లేదా ఐఆర్‌సిటిసి యాప్ ను సంప్ర‌దించ‌గ‌ల‌రు.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+