వేసవికాలంలో అందమైన పర్యటన ప్లాన్ చేసుకునేవారు తప్పకుండా ఉత్తరాఖండ్‌లోని ఈ ప్రాంతానికి వెళ్లాల్సిందే. రాష్ట్రంలోని రిషికేశ్ సమ్మర్‌లో పర్యటనకు ఎంతో అనువైన ప్రదేశం. ఇది ప్రకృతి అందాలతో నిండి ఉండే అద్భుతమైన ప్రదేశంగా ప్రసిద్ధిచెందింది. అంతేకాదు, ఈ ప్రదేశం ఎంతో మంది ఇష్టపడే గమ్యస్థానంగానూ పేరు సాధించింది. రిషికేశ్ ప్రధానంగా ఆధ్యాత్మికత పరంగా, యోగా కేంద్రంగా, సాహస ప్రియుల గమ్యస్థానంగా మంచి గుర్తింపు పొందిన ప్రదేశం. ఇక్కడ అనేక ప్రాంతాలు ఉన్నాయి. అవి పర్యాటకులను మైమరిపిస్తాయి. ఇక్కడ అనేక బీచ్‌లు కూడా ఉన్నాయి. ఈ సమ్మర్‌లో ఆ బీచ్‌లను సందర్శించడం ఓ గొప్ప అనుభూతనే చెప్పుకోవాలి. ఇక్కడ పింక్ బీచ్ అనే ఓ రహస్య బీచ్ కూడా ఉంది. ఈ బీచ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
రిషికేశ్‌లో పింక్ బీచ్ అనే రహస్య బీచ్ ఉంది. ఇక్కడ ఇసుక పర్యాటకులు గులాబీ రంగులో కనిపిస్తుంది. ఈ ప్రదేశంలో రద్దీ తక్కువగా ఉండటం వలన ఇది చాలా ప్రశాంతంగా కనిపిస్తోంది.

రిషికేశ్‌లోని రహస్య బీచ్..
రిషికేశ్‌లోని ఈ బీచ్‌ను పింక్ సాండ్ బీచ్ లేదా పింక్ బీచ్ అని పిలుస్తారు. ఇది నగరం నుండి కేవలం 35 కిలోమీటర్ల దూరంలో ప్రకృతి అందాలతో నిండిన మాలకుంటిలో ఉంది. ఈ బీచ్‌ను సీక్రెట్ బీచ్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇది రిషికేశ్ నగర రణగొణ ధ్వనుల నుంచి దూరంగా ఓ నిశ్శబ్ద ప్రదేశంలో ఉంది. ఈ ప్రదేశంలో రద్దీ ఎక్కువగా ఉండదు. అందుకే ఈ స్థలం చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. ఈ బీచ్ సమీపంలో కూర్చుని నీటి నుండి వచ్చే శబ్దాన్ని సులభంగా వినవచ్చు. ఈ బీచ్‌లోని మరో ప్రత్యేకత ఏంటటే, ఇక్కడ పింక్ కలర్ ఇసుక ఉంటుంది.

పింక్ ఇసుక..
కొన్ని చోట్ల ఇసుక ముదురు గులాబీ రంగులో కూడా కనిపిస్తుంది. కానీ, ఈ బీచ్ దగ్గర ఇసుక తెల్లగా కాకుండా గులాబీ రంగులో కనిపిస్తోంది. ఇక్కడ నీటి చుట్టూ ఉన్న ఇసుక ప్రకాశవంతమైన మరియు లేత గులాబీ రంగులో కనిపిస్తుంది. అందుకే దీనిని పింక్ సాండ్ బీచ్ అని కూడా అంటారు. రిషికేశ్‌లో సమీపంలో ఉన్నవారు తప్పకుండా ఈ బీచ్‌ను సందర్శించండి. ఈ బీచ్ ఖచ్చితంగా పర్యాటకుల యాత్రను సరదాగా చేస్తుంది.

అనేక పర్యాటక ప్రదేశాలు..
ఇక్కడ వీటితోపాటు పర్యాటకులు సందర్శించేందుకు అనేక ప్రదేశాలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం లక్షలాది మంది ప్రజలు ఇక్కడ సందర్శించేందుకు వస్తుంటారు. రిషికేశ్‌లోని అందమైన పర్యాటక ప్రదేశాలు మరియు పురాతన దేవాలయాలు ప్రధాన ఆకర్షణ. ఇక్కడికి వచ్చే ప్రతి వ్యక్తి ఘాట్, దేవాలయాలు, రామ్ ఝులాను సందర్శించడానికి ఇష్టపడతారు. లక్ష్మణ్ జూలా కూడా ఒకప్పుడు చాలా ఫేమస్. కానీ చాలా కాలంగా ఈ ప్రదేశం మూసి ఉండడం వల్ల ఇప్పుడు పర్యాటకులు ఇక్కడికి వెళ్లలేకపోతున్నారు. ఇంకా వీటితో పాటు ఇక్కడ పర్యాటకులు వీక్షించేందుకు అనేక ప్రదేశాలు ఉన్నాయి. మరెందుకాలస్యం ఈ సమ్మర్‌లో మీరుకూడా కుటుంబంతో కలసి ఇక్కడికి వచ్చేసేయండి..
పింక్ సాండ్ బీచ్‌కి ఎలా వెళ్లాలి..
రిషికేశ్‌ని సందర్శనకు వచ్చినట్లయితే లేదా ప్లాన్ చేస్తున్నట్లయితే తప్పకుండా ఈ పింక్ సాండ్ బీచ్‌ను మీ జాబితాలో చేర్చవచ్చు. ఈ బీచ్ రిషికేశ్ నుండి సుమారు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న మాలకుంటి అనే గ్రామానికి సమీపంలో ఉంది. రిషికేష్ నుంచి రిక్షా, ఆటో మొదలైన వాటితో అక్కడికి వెళ్లొచ్చు. సొంత కారులో కూడా ఇక్కడికి చేరుకోవచ్చు.



Click it and Unblock the Notifications













