Search
  • Follow NativePlanet
Share
» »అదిరిపోయే ఫీచ‌ర్స్‌తో.. సెప్టెంబ‌ర్ 16న‌ మొద‌టి వందేభార‌త్ మెట్రో రైలు వ‌చ్చేస్తోంది!

అదిరిపోయే ఫీచ‌ర్స్‌తో.. సెప్టెంబ‌ర్ 16న‌ మొద‌టి వందేభార‌త్ మెట్రో రైలు వ‌చ్చేస్తోంది!

మ‌న‌దేశంలో రైల్వే వ్య‌వ‌స్థ ప్రాముఖ్య‌త‌ను గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. స్వాతంత్య్ర‌నికి ముందు నుంచీ భారతీయ రైల్వే త‌న సేవ‌ల‌ను నిర్విరామంగా కొన‌సాగిస్తూనే ఉంది. మ‌రీ ముఖ్యంగా ప్ర‌యాణికుల‌ను గ‌మ్య‌స్థానాల‌కు చేర్చేందుకు రైల్వే చేస్తోన్న కృషిని అభినందించ‌కుండా ఉండ‌లేం. మారుతోన్న టెక్నాల‌జీకి అనుగుణంగా రూపాంత‌రం చెందుతూ వ‌స్తోన్న రైల్వే ప్ర‌యాణికుల భ‌ద్ర‌తకు ప్రాధాన్య‌త ఇస్తూ వ‌స్తోంది. అదే స‌మ‌యంలో రైళ్ల వేగాన్ని పెంచుతూ..

ప్ర‌యాణికుల‌ను త్వ‌రిత‌గ‌తిన గ‌మ్య‌స్థానాల‌కు చేర్చేందుకు హై స్పీడ్ రైళ్లను ప‌ట్టాలెక్కిస్తోంది. అందులో భాగంగా వందేభార‌త్ రైళ్ల‌ను ప‌రిచ‌యం చేసి, ప్ర‌జ‌ల మ‌న్న‌న‌ల‌ను పొందిన విష‌యం తెలిసిందే. తాజాగా కేంద్ర రైల్వే మ‌రో అడుగు ముందుకు వేసింది. భారతీయ రైల్వే నెట్‌వర్క్‌లో మొద‌టి మెట్రో రైల‌ను అందుబాటులోకి తీసుకురానుంది. ఆ విశేషాలేంటో చూసేద్దామా?!

భార‌తీయ రైల్వే నెట్‌వ‌ర్క్‌లో ఈ సెప్టెంబ‌ర్ 16 ఓ మైలురాయిగా నిలిచిపోనుంది. ఎందుకంటే, దేశంలోనే మొద‌టి వందేభార‌త్ మెట్రో రైలు ఆ రోజున‌ ప్ర‌ధాని మోఢీ చేతుల మీదుగా ప్రారంభం కానుంది. అందుకు అవ‌స‌ర‌మైన అన్ని ఏర్పాట్లూ ఇప్ప‌టికే రైల్వేశాఖ అధికారులు పూర్తి చేశారు. ఈ సంద‌ర్భంగా వందే భార‌త్ మెట్రో రైలుకు సంబంధించిన ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను వారు వెల్ల‌డించారు.

Vandebharat Metro train is coming on September 16

వారంలో ఆరు రోజులు ప‌రుగులు

మొట్ట‌మొద‌టి వందేభార‌త్ మెట్రో రైలు గుజ‌రాత్‌లో ప్ర‌ధాని చేతుల మీదుగా సెప్టెంబ‌ర్ 16న‌ లాంచ్ కానుంది. ఈ రైలు గుజరాత్‌లోని భుజ్- అహ్మదాబాద్ మార్గంలో వారంలో ఆరు రోజులు ప‌రుగులు తీయ‌నుంది. రోజూ భుజ్ నుండి ఉదయం 5:50 బయలుదేరి..

10:50 గంటలకు అహ్మదాబాద్‌కు చేరుకుంటుంది. మ‌ళ్లీ సాయంత్రం 5:30 గంటలకు అహ్మదాబాద్‌లో బయలుదేరి 11:10 గంటలకు భుజ్ స్టేష‌న్‌కు చేరుతుంది. అలా ఈ రైలు మొత్తం ఒక ట్రిప్‌కు 5 గంటల 45 నిమిషాలు జ‌ర్నీ చేస్తూ.. మొత్తం 9 స్టేషన్లలో 2 నిమిషాల చొప్పున‌ హాల్టింగ్ చేస్తుంది.

మెట్రో డిజైన్ అండ్ ఫీచర్స్

ఈ స‌రికొత్త రైలు కూడా వందే భారత్ ట్రైన్‌ మాదిరిగానే పూర్తిగా ఎయిర్ కండిషన్‌తో వ‌స్తుంది. మొద‌ట 12 కోచ్‎లతో ప్రారంభించి త‌ర్వాత రద్దీని బ‌ట్టీ 16 కోచ్‌ల‌కు పెంచే యోచ‌న‌లో రైల్వేశాఖ ఉంది. అలాగే, ఈ రైళ్లకు ప్రత్యేకమైన కోచ్ కాన్ఫిగరేషన్‌ను అందించారు. మొత్తం నాలుగు కోచ్‌లు క‌లిపి ఒక యూనిట్‌గా రూపొందించారు. వందేభార‌త్ మాదిరిగానే ఆటోమేటిక్ డోర్ల‌ను అందిస్తున్నారు. రైలులో ప్రయాణికులు అత్యవసర పరిస్థితుల్లో నేరుగా లోకోపైల‌ట్‌తో కమ్యూనికేట్ అయ్యేందుకు వీలుగా కమ్యూనికేష‌న్ వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేశారు.

అలాగే, ప్రతి కోచ్‌లో మంటలు, పొగ వంటి ప్రమాదాన్ని త్వ‌రిత‌గ‌తిన గుర్తించేందుకు మొత్తంగా 14 సెన్సార్‌ల‌తో కూడిన సెన్సార్ సిస్టమ్‌ను అమ‌ర్చారు. ప్ర‌త్యేకంగా.. కోచ్‌లలో దివ్యాంగుల కోసం వీల్‌చైర్ యాక్సెస్ కలిగిన టాయిలెట్లను కూడా ఏర్పాటు చేశారు. అలాగే, 100 కి.మీ నుండి 250 కి.మీల మధ్య పరిధిలో ఈ వందేభార‌త్ మెట్రో రైలు పరుగులు పెట్ట‌గ‌లిగేలా డిజైన్ చేశారు. మ‌రి ఇన్ని ప్ర‌త్యేక‌త‌లు క‌లిగిన ఈ హైస్పీడ్ మెట్రో మ‌న తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు ప‌రుగులు పెడుతుందో చూడాలి.

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+