నేడు వైకుంఠ ఏకాదశి పర్వదినం. భక్తులు తెల్లవారు జామునే తలస్నానాలు ఆచరించి, వైష్ణవ ఆలయాలను దర్శిస్తూ ఎంతో బిజీగా ఉంటారు. ఈ వైకుంఠ ఏకాదశి ని ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తారు. దీనికి ఆ పేరు రావటానికి గల కారణం, ఆ రోజున విష్ణుమూర్తి గరుడ వాహనారూఢుడై మూడు కోట్ల మంది దేవతలతో భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనం ఇస్తాడు కనుకనే ముక్కోటి ఏకాదశి అని పేరువచ్చింది.
వైకుంఠ ఏకాదశి నాడు అన్ని వైష్ణవ ఆలయాలు ప్రత్యేక పూజలు, హోమాలు, ప్రవచనాలు మరియు ప్రసంగాలు నిర్వహిస్తుంటారు. ఈ రోజున భక్తులందరూ ఉపవాసం, జాగరణ చేస్తుంటారు. ఇవి చేసేటప్పుడే దేవుని జపం, దేవుని గురించి ధ్యానం ఆచరిస్తారు.
ఇది కూడా చదవండి : భారత దేశంలో ప్రసిద్ధ ఇస్కాన్ ఆలయాలు !!
ప్రముఖ దేవాలయాలలో (తిరుపతి, భద్రాచలం, శ్రీరంగం మరియు బెజ్జూర్) పుణ్యక్షేత్రాలలో మామూలు రోజులలో అయితే, ఉత్తర ద్వారాలను మూసి ఉంచుతారు. ఈ "ముక్కోటి ఏకాదశి" రోజున మాత్రం వాటిని తెరచి ఉంచుతారు. ఆ రోజు భక్తులు సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానాలు ముగించుకొని అట్టి ప్రముఖ ఆలయాలలో ఉత్తరం వైపు ఉన్న ద్వారం ద్వారా ప్రవేశించి, ప్రదక్షిణలు ముగించుకుని దైవదర్శనం చేసుకుంటూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్ లో వైకుంఠ ఏకాదశి నాడు సందర్శించే ఆలయాలు గనక చూస్తే ...

వెంకటేశ్వర స్వామి సన్నిధి, తిరుపతి
సాధారణంగా, తిరుమల లో ఏడాదికి 4 సార్లు మాత్రమే చక్ర స్నానం జరుగుతుంది. అందులో వైకుంఠ ఏకాదశి నాడు జరిగే చక్ర స్నానంలో ముల్లోకాల్లో ఉన్న పుణ్య తీర్థాలు సూక్ష్మ రూపంలో స్వామి పుష్కరిణిలో దర్శనం ఇస్తాయి.
చిత్ర కృప : tirumala.org

వెంకటేశ్వర స్వామి సన్నిధి, తిరుపతి
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బంగారు వాకిలి జేగంటలున్న ప్రదేశానికి ఎడమ పక్కన ముక్కోటి ప్రదక్షిణం అని వ్రాసి ఉంటుంది.
చిత్ర కృప : Raghunathan Krishnarao

వెంకటేశ్వర స్వామి సన్నిధి, తిరుపతి
దేవాలయంలో మూల విరాట్టుకి చుట్టురాఉన్న నాలుగు వైపులా ఉన్న గోడకీ సమాంతరంగా మరో ప్రాకారం ఉంటుంది. చూట్టూ ఉన్న నాలుగు గోడలకి, ఈ నాలుగు గోడలకి మధ్యలో ప్రదక్షిణలు చేసే దారి ఉంటుంది. దీనినే ముక్కోటి ప్రదక్షిణం అంటారు.
చిత్ర కృప : remanasa

వెంకటేశ్వర స్వామి సన్నిధి, తిరుపతి
వైకుంఠ ఏకాదశికి ముందురోజు రాత్రి ఏకాంత సేవ అనంతరం బంగారు వాకిలి మూసివేస్తారు. తెల్లవారు జామున వైకుంఠ ఏకాదశినాడు సుప్రభాతంతో మొదలుకొని మర్నాడు అనగా ద్వాదశినాటి రాత్రి ఏకాంతసేవ వరకూ శ్రీవారి గర్భాలయానికి ఆనుకొని ఉన్న వైకుంఠద్వారాన్ని తెరచి వుంచుతారు. ఈ రెండు రోజులూ భక్తులు శ్రీవారి దర్శనం తర్వాత ముక్కోటి ప్రదక్షిణ మార్గంలో వెళ్తారు.
చిత్ర కృప : Anudinam.org

వెంకటేశ్వర స్వామి సన్నిధి, తిరుపతి
వైకుంఠ ఏకాదశి పర్వదినంనాడు ముక్కోటి ప్రదక్షిణ మార్గం రంగురంగుల విద్ద్యుద్దీపాలతో, పూలమాలలతో మనోహారంగ తీర్చిదిద్దబడి ఉంటుంది. శ్రీ స్వామి వారికి అత్యంత సమీపంలో ఉన్నఈ ప్రదక్షిణ మార్గంలో దర్శనం కొరకు వెళ్లే భక్తులు ఒక ఆశ్చర్య దివ్యానుభూతిని అనుభవిస్తారు.
చిత్ర కృప : Raghu Aravind

వెంకటేశ్వర స్వామి సన్నిధి, తిరుపతి
వైకుంఠ ఏకాదశి మరునాడు అనగా ద్వాదశి రోజు సూర్యోదయంవేళ శ్రీ స్వామి పుష్కరిణి జరుగుతుంది. వైకుంఠ ఏకాదశి నాడు ముల్లోకాల్లో ఉన్న పుణ్య తీర్ధాలు , పుష్కరిణలు తిరుమలలోని " స్వామి పుష్కరిణి " లో దివ్య సుక్ష్మ రూపంతో లీనమై వుంటాయి.
చిత్ర కృప : venky@777

వెంకటేశ్వర స్వామి సన్నిధి, తిరుపతి
వైకుంఠ పర్వదినంలో శ్రీవారి ఆలయంలో శ్రీవారికి సుప్రభాతం, తోమాల సేవ, అర్చనలు యధాప్రకారం జరుగుతాయి. తర్వాత ఆనంద నిలయంలో ఉన్న "సుదర్శన చక్రత్తళ్వార్" పల్లకిని అధిరోహించి ఉరేగింపుగా తిరుమల తిరువీధుల్లో మహా ప్రదక్షిణంగా వచ్చి శ్రీ వరాహస్వామి ఆలయ ప్రాంగణం చేరుకొంటారు.
చిత్ర కృప : Raghu Aravind

వెంకటేశ్వర స్వామి సన్నిధి, తిరుపతి
శ్రీ వరాహస్వామి ఆలయ ప్రాంగణం లో చక్రత్తళ్వార్ కు అభిషేకం జరిగిన తర్వాత పుష్కరిణిలో పవిత్ర స్నానం చేయిస్తారు. ఇలా చక్ర స్నానం జరిగే సమయంలో భక్తులు కూడా పుష్కరిణి లో మునిగి పవిత్ర స్నానం చేస్తారు. పిదప చక్రత్తళ్వార్ కు వస్రాలంకారం , నివేదన హారతులు ఘనంగా నిర్వహిస్తారు. అటు నుండి చక్రత్తళ్వార్ వారు (సుదర్శన భగవానులు) బయలు దేరి , ప్రదక్షిణంగా వేంచేసి, శ్రీవారి ఆలయాన్ని ప్రవేశిస్తారు.
చిత్ర కృప : Sundaram + Annam

రంగనాథ స్వామి దేవాలయం, శ్రీరంగం
శ్రీరంగం లోని శ్రీ రంగనాథ స్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు 21 దినాలు కన్నుల పండుగగా జరుగుతుంటాయి. ఈ ఉత్సవాలలో ప్రధానమైనవి రెండు భాగాలు. మొదటి భాగం ఉదయం పూజ దీనిని పాగల్ పట్టు అని సంబోధిస్తారు. రెండవ భాగం రాత్రి పూజ దీనిని ఇర పట్టు అని పిలుస్తారు.
చిత్ర కృప : Prabhu B Doss

రంగనాథ స్వామి దేవాలయం, శ్రీరంగం
శ్రీరంగంలో విష్ణువు అవతారమైన రంగనాథ స్వామికి వైకుంఠ ఏకాదశి నాడు వజ్రాలతో చేసిన వస్త్రాల్ని అలంకరించి వెయ్యి స్తంభాల ప్రాంగణంలోకి వైకుంఠ వాకిలి గుండా తీసుకొని వచ్చి అక్కడ భక్తులకు దర్శనమిస్తారు. ఈ వాకిలి గుండా వెళ్ళిన భక్తులు వైకుంఠం చేరుకుంటారని భక్తుల నమ్మకం.
చిత్ర కృప : Manfred Sommer

శ్రీ రంగనాయక స్వామి, అదిలాబాద్
తెలంగాణ లోని ఆదిలాబాద్ జిల్లా గల బెజ్జూర్ మండలంలో ఉన్న శ్రీరంగనాయక స్వామి వారి క్షేత్రం విశిష్టతను కలిగి ఉన్నది. ఇక్కడ స్వామివారు శేషతల్పముపైన శేయనించి, నాభిమద్యమున బ్రహ్మని కలిగి, అనంత దేవతాముర్తులతో కనిపిస్తాడు. ఇటువంటి విగ్రహం దేశంలో మరెక్కడా కనిపించదు.
చిత్ర కృప : Gajanan Balasubramaniam

శ్రీ రంగనాయక స్వామి, అదిలాబాద్
బెజ్జూర్ మండలంలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్నిమూడు రోజుల పాటు నిర్వహిస్తారు. ఇక్కడ ఉత్సవాలతో పాటుగా జాతర ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఈ ఆలయం ఉత్తర ద్వారాన్ని కలిగి ఉంటుంది. భక్తులు ఉత్తర ద్వారం గుండా వెళ్ళి దేవుణ్ణి దర్శించుకుంటారు. అలా ఆ ద్వారం గుండా వెళ్ళిన భక్తులు వైకుంఠం చేరుకుంటారని నమ్మకం.
చిత్ర కృప : naresh ramachandran

భద్రాచలం, ఖమ్మం
భద్రాచలం దివ్య క్షేత్రంలో ముక్కోటి ఏకాదశి నాడు భక్తులు అధిక సంఖ్యలో హాజరవుతుంటారు. ఆనాడు స్వామి వారు భక్తులకి ఉత్తర ద్వారం గుండా దర్శనం ఇస్తారు. ఈ ఉత్సవాల సందర్భంగా రాముని తండ్రికి వివిధ అలంకారాలు చేస్తారు. ఆ సమయంలో రామాలయాన్ని విద్యుద్దీప కాంతులతో ముస్తాబుచేస్తారు.
చిత్ర కృప : kalyan atmakuri

వైకుంఠ ఏకాదశి మరిన్ని ఫొటోలతో ..
విద్యుద్దీప కాంతుల్లో మెరిసి పోతున్న తిరుపతి దేవస్థానం
చిత్ర కృప : wikicommons

వైకుంఠ ఏకాదశి మరిన్ని ఫొటోలతో ..
పూలతో అలంకరించబడ్డ ఆలయ ప్రదక్షిణ మార్గం
చిత్ర కృప : wikicommons

వైకుంఠ ఏకాదశి మరిన్ని ఫొటోలతో ..
రాత్రి పూట దేదివ్య మానంగా వెలిగిపోతున్న ఆలయ ప్రాంగణం
చిత్ర కృప : wikicommons

వైకుంఠ ఏకాదశి మరిన్ని ఫొటోలతో ..
రాత్రిపూట ఆలయ బయటి భాగ దృశ్యం
చిత్ర కృప : wikicommons

వైకుంఠ ఏకాదశి మరిన్ని ఫొటోలతో ..
శ్రీవారి దర్శనం కొరకు వచ్చిన భక్తులు
చిత్ర కృప : wikicommons



Click it and Unblock the Notifications













