Search
  • Follow NativePlanet
Share
» »ఆగస్టు 15న ఢిల్లీలోని ఈ మాల్స్‌ను సంద‌ర్శించండి..!

ఆగస్టు 15న ఢిల్లీలోని ఈ మాల్స్‌ను సంద‌ర్శించండి..!

ఆగస్టు 15న ఢిల్లీలోని ఈ మాల్స్‌ను సంద‌ర్శించండి..!

పంద్రాగ‌స్టు పండుగ రాగానే, భారతదేశమంతటా దేశభక్తితో నిండిన అందమైన వేడుకను చూస్తాం. రోడ్డు పక్కన జెండాలు అమ్మే వ్యక్తులు, ప్రతి దుకాణం వద్ద మూడు రంగులు చుట్టిన బెలూన్లు, ప్రతిచోటా మాల్స్ కూడా స్వాతంత్ర్య దినోత్సవ సంద‌ర్భంగా అలంకరించబడతాయి. ఈ పంద్రాగ‌స్టుకు ఢిల్లీ-ఎన్‌సిఆర్‌ని సందర్శించాలని ప్లాన్ చేస్తుంటే మాత్రం త‌ప్ప‌కుండా స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో క‌లిసి ఢిల్లీలోని ఈ మాల్స్‌ను ప్ర‌ణాళికలో చేర్చండి. డెకర్ నుండి షాపింగ్ వరకు, వినోదం నుండి ఇష్ట‌మైన ఫుడ్‌ వరకు, ఈ మాల్స్‌లో ప్రతిదీ అందుబాటులో ఉంటుంది.

1

సిటీ వాక్ ఢిల్లీని ఎంచుకోండి

ఈ మాల్ ఢిల్లీలోని విలాసవంతమైన, అతిపెద్ద మాల్స్‌లో ఒక‌టిగా ప్ర‌సిద్ధిచెందింది. ఆకర్షణీయమైన షాపింగ్ స్టోర్‌ల నుండి ఫైన్ డైనింగ్ రెస్టారెంట్‌ల వరకు ఇక్క‌డ ప్ర‌తిదీ అందుబాటులో ఉంటుంది. సెలెక్ట్ సిటీ వాక్ మాల్ ఆగస్టు 15 సంద‌ర్భంగా అందంగా అలంకరించబడి ఉంటుంది. అతి త‌క్కువ బడ్జెట్‌లోనే ఫుడ్ కోర్ట్‌లో ఆహారం, పానీయాలను కూడా తీసుకోవచ్చు.

2

వెగాస్ మాల్ ద్వారకా

దాదాపు 28,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ద్వారకలోని ఈ మాల్ విదేశీ మాల్‌ కంటే తక్కువేవీ కాదు. ఇక్కడ వినోదం నుండి ఖరీదైన బ్రాండ్‌లతో కూడిన స్టోర్‌ల వరకు అన్నింటినీ ఒకే చోట చూడొచ్చు. ఆహార ప్రియుల కోసం ఇక్కడొక‌ పెద్ద ఫుడ్ కోర్ట్ కూడా ఉంది. కొత్తగా విడుదలైన సినిమాలను చూడగలిగేలా సినిమా థియేట‌ర్లు కూడా ఈ మాల్‌లో ఉన్నాయి. ఈ మాల్‌ను చంద్రయాన్ థీమ్‌తో అలంకరించ‌డం ఇక్క‌డి మ‌రొక ప్ర‌త్యేక‌త‌.

3

DLF ఎంపోరియో మాల్ వసంత్ కుంజ్

దేశంలోని అత్యంత ఖరీదైన మాల్స్‌లో ఒకటిగా పరిగణించ‌బడిన‌ DLF ఎంపోరియో విదేశాల నుండి వచ్చిన బ్రాండ్‌లతో నిండిపోయింది. డియోర్, కెన్నెత్ కోల్, బర్బెర్రీ, DKNY, కార్టియర్, లూయిస్ విట్టన్, జార్జియో అర్మానీ, వెర్సేస్ వంటి 50 అంతర్జాతీయ బ్రాండ్‌లతో సహా దాదాపు 130 బ్రాండ్‌లు ఇక్కడ ఉన్నాయి. అంతేకాదు, చాలా మంది భారతీయ డిజైనర్ల దుకాణాలను కూడా ఇక్కడ చూడొచ్చు. ఈ మాల్‌లో అనేక రెస్టారెంట్లు, పెద్ద ఫుడ్ కోర్టులు కూడా ఉన్నాయి.

సిగ్నేచర్ గ్లోబల్ ఫుడ్ మాల్, సెక్టార్ 3 వైశాలి

సిగ్నేచర్ గ్లోబల్ ఫుడ్ మాల్ సెక్టార్ 3 వైశాలిలో ఆగస్టు 5వ తేదీ నుండి స్వాతంత్ర్య దినోత్సవ అలంకరణలు, కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఇవి ఆగస్టు 27 వరకు కొనసాగుతాయి. మాల్ మొత్తం త్రివర్ణ పతాకంతో అలంకరించబడి ఉంటుంది. అంతేకాకుండా పిల్లల కోసం బెలూన్ మోడలింగ్, మ్యాజిక్ షో, టాటూ ఆర్ట్, క్యారికేచర్‌తో సహా ప్రత్యేక కార్యకలాపాలు కూడా నిర్వహించబడ్డాయి. ఇక్కడ స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో క‌లిసి సంద‌ర్శించేందుకు ఆగ‌స్టు 15 ఉత్త‌మం స‌మ‌యం అని చెప్పుకోవ‌చ్చు.

స్పెక్ట్రమ్ మెట్రో, నోయిడా

ఈ మాల్ నోయిడాలోని సెక్టార్ 75లో ఉంది. స్వాతంత్ర్య దినోత్స‌వ సంద‌ర్భంగా ఈ మాల్‌ను ప్ర‌త్యేకంగా ఆలంక‌రించారు. ఇక్కడ షాపింగ్ దుకాణాలు, రిటైల్ దుకాణాలు, ఆహార దుకాణాలను చూడొచ్చు.

DLF మాల్ నోయిడా 18

నోయిడా నివాసి అయితే త‌ప్ప‌కుండా ఈ మాల్ గురించి తెలుసుకోవాలి. ఇక్క‌డ అంతర్జాతీయ బ్రాండ్‌ల అవుట్‌లెట్‌లు, మేకప్ బ్రాండ్‌ల స్టోర్‌లు, ఫుడ్ కోర్టులు, అంతర్గత రెస్టారెంట్‌లు ఉన్నాయి. దీంతో పాటు ఈ మాల్‌లో పిల్లల కోసం స్మాష్ కూడా ఉంది. అంతే కాదు, కుటుంబ సభ్యులతో కలిసి వెళ్ళేందుకు మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం కూడా ఉంది.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+