ఫిబ్రవరి నెల ప్రేమికులకు ప్రత్యేకమైన నెల అని చెబుతుంటారు. ఎందుకంటే, ఈ నెలలోనే ప్రేమికుల దినోత్సవం జరుపుకుంటారు. ఫిబ్రవరి 14న వాలెంటైన్ డే నిర్వహించుకుంటారు. ఈ రోజున ప్రతి ఒక్కరూ తమ భాగస్వామితో సంతోషమైన సమయాన్ని గడపాలని కోరుకుంటారు. అందుకోసం విహారయాత్రకు వెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధంచేస్తుంటుంటారు. కొత్తగా పెళ్లయిన జంటలు, త్వరలో ఒక్కటవ్వబోతున్నావారు ఈ వాలెంటైన్ డే సందర్భంగా సరదాగా గడిపేందుకు అలాగే మీ భాగస్వామితో కలిసి రుచికరమైన విందును ఆస్వాదించాలనుకుంటే మాత్రం తప్పకుండా ఢిల్లీలోని ఈ ప్రదేశాలను సందర్శించొచ్చు.
చాందినీ చౌక్
స్ట్రీట్ ఫుడ్స్‌ని ఇష్టపడని వారుండరు. ఇక, ఢిల్లీలోని స్ట్రీట్ ఫుడ్స్ పేరు చెప్పగానే ముందుగా అందరికి గుర్తుకొచ్చేది చాందినీ చౌక్. స్ట్రీట్ ఫుడ్స్ విషయంలో చాందినీ చౌక్ ఎప్పుడూ మొదటి స్థానంలో ఉంటుంది. ఇందులో పరాటా, చాట్, కుల్ఫీ, రబ్రీ, జలేబీ వంటి వివిధ రకాల వంటకాలను ఆస్వాదించవచ్చు. అల్పాహారం నుండి రాత్రి భోజనం వరకు ఇక్కడి వీధుల్లో అనేక రకాల వంటకాలు లభిస్తాయి. ఇక, ఈ ప్రదేశానికి మెట్రో ద్వారా సులభంగా చేరుకోవచ్చు. ఈ వాలెంటైన్ సందర్భంగా తప్పకుండా మీ భాగస్వామితో కలిసి చాందినీ చౌక్ వంటకాలను ఆస్వాదించాల్సిందే..

డిల్లీ హాట్ (INA)
డిల్లీ హాట్‌కి అందం నుండి ఆహారం మరియు పానీయాల వరకు ఎలాంటి పోటీ ఉండదు. INA సమీపంలో ఉన్న ఈ ప్రదేశంలో, దేశంలోని వివిధ రాష్ట్రాల రుచులను ఆస్వాదించొచ్చు. ఇక్కడ ఉత్తరం నుండి దక్షిణం వరకు మరియు తూర్పు నుండి పడమర వరకు అనేక రాష్ట్రాల ఆహారం అందుబాటులో ఉంటుంది. ఇక, ఫిబ్రవరి 14 సందర్భంగా తప్పకుండా మీ భాగస్వామితో కలిసి ఇక్కడి వంటకాల రుచులను చూడాల్సిందే.
నోయిడా
నోయిడాలో కూడా చాలా రెస్టారెంట్లు ఉన్నాయి. సెక్టార్-18 నుండి 46 వరకు, ఇక్కడ వివిధ రకాల వంటకాలు, పానియాలు అందుబాటులో ఉంటాయి. సౌత్ నుంచి నార్త్ వరకు అన్ని రకాల రుచులను ఇక్కడ ఆస్వాదించొచ్చు. ఈ వాలెంటైన్ డే సందర్బంగా ఇక్కడ హోటల్స్‌లో మంచి ఫుడ్‌ను ఎంజాయ్ చేయొచ్చు. అలాగే, ఇక్కడ ఎంజాయ్ చేసేందుకు అనేక క్లబ్‌లు కూడా ఉన్నాయి.

కమల మార్కెట్
ఢిల్లీలోని కమల మార్కెట్ కూడా ఫుడ్ ప్రేమికులకు ఎంతో ఉత్తమమైన గమ్యస్థానమని చెప్పుకోవాలి. ఫిబ్రవరి 14 సందర్భంగా మీ భాగస్వామితో కలిసి విభిన్నమైన రుచులను ఆస్వాదించాలంటే తప్పకుండా ఢిల్లీలోని కమల మార్కెట్‌ను సందర్శించాల్సిందే. ఇక్కడ తీపి, పుల్లని చాట్, స్ట్రీట్ ఫుడ్ లభిస్తుంది. కమలా నగర్ మార్కెట్‌లో ఫుడ్‌తో పాటు షాపింగ్ చేసేందుకు వివిధ రకాల వస్త్ర దుకాణాలు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ లభించే రుచికరమైన వంటకాలు పర్యాటకులకు ఎంతగానో నచ్చుతాయి. ఇక్కడి మార్కెట్‌లో చోలే-భతురా, టిక్కీ-చాట్, భేల్ పూరి మరియు ఫలూదా ఇక్కడ చాలా ప్రసిద్ధి చెందాయి. కాబట్టి, ప్రేమికుల రోజున తప్పకుండా ఇక్కడికి వచ్చి ఈ రుచులను ఆస్వాదించాల్సిందే.
మజ్ను కా తిలా
ఢిల్లీలో ఉంటూ విదేశీ రుచులను రుచి చూడాలంటే మజ్ను కా తిలా సరైన ప్రదేశమనే చెప్పుకోవాలి. ఇక్కడ అందమైన రెస్టారెంట్లలో కొరియన్, చైనీస్, టిబెటన్, ఇటాలియన్ మరియు థాయ్ వంటి అన్ని రకాల ఆహారాలను రుచి చూడొచ్చు. ఇంకా ఇక్కడ అనేక రకాల వంటకాలను రుచి చూడొచ్చు. ఈ ప్రదేశానికి మెట్రో ద్వారా సులభంగా చేరుకోవచ్చు.



Click it and Unblock the Notifications












