Search
  • Follow NativePlanet
Share
» »ఈసారి వీకెండ్‌కు భార‌త్‌లోని ఈ ప్ర‌దేశాల‌కు వెళ్లండి...

ఈసారి వీకెండ్‌కు భార‌త్‌లోని ఈ ప్ర‌దేశాల‌కు వెళ్లండి...

ఈసారి వీకెండ్‌కు భార‌త్‌లోని ఈ ప్ర‌దేశాల‌కు వెళ్లండి...

ఈ సారి వీకెండ్‌లో ఎక్కడికైనా వెళ్లాలి అని ప్లాన్ చేస్తుంటే మాత్రం భార‌త‌దేశంలో ఎన్నో అనువైన ప్ర‌దేశాలు ఉన్నాయి. ఇంట్లో ఉండి ఉండి బోర్‌గా ఫీలవుతున్నారా? రోజంతా ఆఫీసు ప‌ని చేసి చేసి కాస్త విరామం పొందాల‌నుకుంటున్నారా? అయితే, మ‌రెందుకు ఆల‌స్యం.. ఈ వీకెండ్‌లో భార‌త్‌లోని ఈ ప్ర‌దేశాల‌ను సంద‌ర్శించండి. మీలో స‌రికొత్త ఉత్తేజాన్ని పెంపొందించుకోండి. ఈ ప్ర‌దేశాల‌కు కుటుంబస‌భ్యుల‌తో లేదా స్నేహితుల‌తో కూడా వెళ్లొచ్చు. వారాంతం రాబోతోంది.

శనివారం-ఆదివారం ఆఫ్‌లో ఉంటే, సోమవారం జాతీయ సెలవుదినం, అంటే మూడు రోజుల సెలవులు క‌లిసివ‌స్తున్నాయి. ప్ర‌యాణం చేసేందుకు ఇదే స‌రైన స‌మ‌యం. ఇక‌, ఒత్తిడిని త‌రిమికొట్టేందుకు సిద్ధంకండి. ఈ మూడురోజులు ప్ర‌శాంత‌మైన వాతావ‌రణంలో, ప్ర‌కృతి అందాల న‌డుమ సేద‌తీరుతూ ఒత్తిడిని దూరం చేసుకోండి. మ‌రెందుకాల‌స్యం ఈ వీకెండ్‌లో భార‌త్‌లోని ఈ ప్ర‌దేశాల‌కు వెళ్దామా..

1

ఓర్చా, మధ్యప్రదేశ్

ఓర్చా ఫోర్ట్‌ బేత్వా నది మధ్యలో ఉన్న దీవిలో ఉంటుంది. ఈ ఫోర్ట్‌ మొత్తం ఒకసారి చూస్తే ఎప్పటికీ మర్చిపోలేని సుందర చారిత్రక కట్టడం రాజ మహల్‌. ఓర్చా కట్టడాన్ని బుందేల్‌ ఛీఫ్తాన్‌ రుద్రప్రతాప్‌ నిర్మించారు. గుప్తుల కాలానికి చెందిన ఈ కట్టడం పురాతత్వ ప్రాముఖ్యతను సంతరించుకుంది. చరిత్రతోపాటు ప్రకృతిని ప్రేమించే వాళ్లకు ఆసక్తికరమైన ప్రదేశం ఓర్చా. ఓర్చా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఈ ప్ర‌దేశం ఎంతో చారిత్రాత్మకమైంది. ఓర్చా వైభవమంతా ఇక్క‌డ ఉండే కోటలోనే ఉంది. ఇక్క‌డ అనేక రాజ భవనాలు, ఆలయాలు, తోటలు స్మ్రుతి చిహ్నాలు ఉన్నాయి. బుందేల స్కూల్ ఆఫ్ పెయింటింగ్ ఎంతో ప్రసిద్ధమైనది. పుష్పాలలంకరణ కు ప్రసిద్ధి. మొగల్ చక్రవర్తి సందర్శన సందర్భంగా బీర్ సింగ్ రాజు స్మారక మందిరం నిర్మించాడు.

2

గోకర్ణ, కర్ణాటక

గోకర్ణ శివాలయానికి ప్రసిద్ధి చెందినది. ఈ ప్ర‌దేశం కర్ణాటక రాష్ట్రంలోని ఉత్తర కన్నడ జిల్లాలో కలదు. ఇది బెంగళూరు మహానగరానికి 550 కిలోమీట‌ర్ల దూరంలో, హుబ్లీకి అతి ద‌గ్గ‌ర‌లో ఉంటుంది. ఈ ప్రాంతం భూ కైలాస క్షేత్రంగా కూడా ప్ర‌సిద్ధి చెందింది. ఇదొక యాత్రా స్థలమే కాదు అందమైన సముద్ర తీర పట్టణం కూడా. ఇక్క‌డ ప్ర‌సిద్ధి చెందిన అనేక దేవాల‌యాలు ఉన్నాయి. ఈ ప్రదేశం జనసమూహానికి దూరంగా ఉండ‌ట‌మే కాకుండా, ఎంతో అందంగా కూడా ఉంటుంది. ఈ వీకెండ్‌లో విశ్రాంతి తీసుకోవాల‌నుకుంటే మాత్రం త‌ప్ప‌కుండా ఈ ప్ర‌దేశాన్ని సంద‌ర్శించాల్సిందే. ఇక్క‌డి బీచ్‌లో స‌ర‌దాగా కూడా గ‌డ‌పొచ్చు.

2

ముక్తేశ్వర్, ఉత్తరాఖండ్

ముక్తేశ్వర్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని నైనిటాల్ జిల్లాలో సముద్ర మట్టానికి 2,285 మీటర్ల ఎత్తులో ఉన్న ఒక ఆహ్లాదకరమైన ప్రదేశం. ముక్తేశ్వర్ అనే పేరు 350 సంవత్సరాల పురాతన ఆలయం ముక్తేశ్వర్ ధామ్ నుండి వచ్చింది. దీని నివాస దైవం శివుడు. ఈ ప్ర‌దేశం ప‌క్షి ప్రేమికుల‌కు, ఫోటోగ్రాఫ‌ర్ల‌కు ఎంతో అనువైన‌ది. ఎందుకంటే, ఈ ప్ర‌దేశంలో ఎన్నో ప‌క్షులు త‌మ నివాసాల‌ను ఏర్ప‌రుచుకున్నాయి. ప‌క్షుల కిల‌కిల‌రావాల‌తో ఈ ప్రాంగ‌ణ‌మంతా ఎంతో ఆహ్ల‌ద‌భ‌రితంగా ఉంటుంది. సూర్య‌కిర‌ణాలు శిఖ‌రాల‌ను ముద్దాడే అద్బుత‌మైన దృశ్యాల‌ను మీ కెమెరాల్లో బంధించొచ్చు. మంచుతో కప్పబడిన పర్వతాలు, స్పష్టమైన నీలి ఆకాశం మీ వీకెండ్‌ను మ‌రింత అందంగా మారుస్తాయి.

ఊటీ, తమిళనాడు

ఊటీ అనేది తమిళనాడులోని చాలా అందమైన, ప్రసిద్ధ హిల్ స్టేషన్. ఈ ప్ర‌దేశం అద్భుతమైన కొండ వీక్షణలకు ప్రసిద్ధి చెందింది. తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల కూడలిలో ఉన్న ఈ నీలగిరి శ్రేణి దేశం నలుమూలల నుండి వచ్చే పర్యాటకులకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక్క‌డ అనేక ఊటీ రిసార్ట్‌లు ఉన్నాయి. ఇవి హనీమూన్‌లకు ప్రసిద్ధి చెందాయి. ఎటుచూసిన ప‌చ్చ‌ద‌న‌పు అందాలు, మేఘాలు దోబుచాలాట‌లు ఇక్క‌డికి వ‌చ్చే ప‌ర్యాట‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్ట‌కుంటాయి. సాహ‌స‌ప్రియుల‌కు కూడా ఈ ప్రాంతం ఎంతో అనువైన‌ది. ఎందుకంటే, ఇక్క‌డ ట్రెక్కింగ్ వంటివి చేయొచ్చు.

More News

    Read more about: madhya pradesh
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+