Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» గోకర్ణం

గోకర్ణం - దేవాలయాలు, తెల్లటి ఇసుక తిన్నెలు

34

గోకర్ణం కర్నాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో ఉంది. ఇది ఒక యాత్రా స్ధలం మరియు అందమైన బీచ్ లు ఉండటంచే పర్యాటక స్ధలం అని కూడా చెప్పవచ్చు. ఇది రెండు నదుల అంటే అగ్నాషిని మరియు గంగావతి అనే రెండు నదుల మధ్యలో ఉంది. నదులు రెండూ కలిసి ఒక గోవు చెవి ఆకారంలో ఏర్పడతాయి కనుక దీనిని గోకర్ణం అంటే ఆవు చెవి గా వర్ణిస్తారు. గోకర్ణంలోని మహాబలేశ్వర శివ దేవాలయం హిందువులకు ప్రత్యేకించి శైవులకు ఎంతో పవిత్రమైంది. తమిళ కవులు అప్పార్ మరియు సంబంధార్ లు దీని గురించి తమ కవిత్వంలో ఎంతో వర్ణించారు. భగవానుడు తుళు నాయుడిని తమ పద్యాలలో కీర్తించారు.

ఈ ప్రదేశం విజయనగర రాజులు కాదంబాల ఆధీనంలో ఉండేది. తర్వాతి కాలంలో దానిని పోర్చుగీసు పాలకులు గెలుచుకున్నారు.

గోకర్ణం చరిత్ర ఎలా? గోకర్ణం లోని మహాబలేశ్వర దేవాలయ శివలింగం ఇక్కడకు రావణుడు తెచ్చినదిగా చెప్పబడుతుంది. రావణుడు శివుడి నుండి ఆత్మ లింగాన్ని పొందుతాడు. దీని ద్వారా రావణుడికి ప్రత్యేక మహిమలు వచ్చేస్తాయని, అతడు తమను మరింత పీడిస్తాడని భావించిన దేవతలు గణేశుడి సహాయంతో ఉపాయంగా ఆత్మ లింగాన్ని అక్కడ ప్రతిష్టించారు.  ఇక్కడ మహాబలేశ్వర దేవాలయమే కాక, ఇతర దేవాలయాలు, అంటే మహా గణపతి, భద్రకాళి, వరదరాజ, వెంకట రమణ దేవాలయాలు కూడా ఉన్నాయి.  

బీచ్ లు గోకర్ణంలో అనేక అద్భుత అందాలు కల బీచ్ లు ఉన్నాయి. ఇవి గోవా బీచ్ అందాలను కూడా తలదన్నుతాయి. కుడ్లే బీచ్, గోకర్ణ బీచ్, హాఫ్ మూన్ బీచ్, పారడైజ్ బీచ్, ఓం బీచ్ అని అయిదు ప్రధాన ఆకర్షణలున్నాయి.   గోకర్ణ బీచ్ ప్రధానమైంది. కుడ్లే బీచ్ అన్నిటికంటే పెద్దది. ఇక్కడ స్విమ్మింగ్ చేయటం ఎంతో ప్రమాదం. ఓం బీచ్ కోస్తా తీరం వెంబడి అందంగా ఉండి హిందూ పవిత్ర సంకేతం ఓం ను గుర్తు చేస్తుంది. ఈతకు అనుకూలం. స్నానాలకు చక్కటి ప్రదేశం. ఎంతో సుక్షితమైంది.  

హాఫ్ మూన్ బీచ్ చేరాలంటే ఓం బీచ్ నుండి ఇరవై నిమిషాలు పడుతుంది. ఒక కొండ చుట్టి దీని వద్దకు రావాలి. ఈ బీచ్ సగం చంద్రుడివలే ఉంటుంది కనుక దీనికి అర్ధాచంద్రాకార బీచ్ అని పేరు వచ్చింది. ప్యారడైజ్ బీచ్ లో అన్నీ రాళ్ళు అధికం. కొద్దిపాటి దూరంగా అందమైన ప్రదేశంలో ఉంది. ఈతకు అనుకూలం కాదు. అలలు తీవ్రంగా లేచి ఇబ్బంది పెడతాయి.  

గోకర్ణానికి యాత్రికులు, పర్యాటకులు ఇరువురూ వస్తూంటారు. అందమైన దేవాలయాలు, మరింత ఆకర్షణ కల బీచ్ లు గోకర్ణాన్ని ఆకర్షిత పర్యాటక ప్రదేశంగా మార్చాయి.

గోకర్ణం ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

గోకర్ణం వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం గోకర్ణం

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? గోకర్ణం

  • రోడ్డు ప్రయాణం
    బస్ ప్రయాణం గోకర్ణం నుండి మడ్గోవా, డబోలిం, బెంగుళూరు, మంగుళూరు ప్రదేశాలకు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్ధ బస్ లను నడుపుతోంది. పర్యాటకులు ప్రతిరోజూ నిర్వహించే టూరిస్టు బస్ ల ద్వారా కూడా గోకర్ణం చేరవచ్చు.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ప్రయాణం - గోకర్ణంకు రైల్వే స్టేషన్ లేదు. అంకోలా రైల్వే స్టేషన్ సమీపంగా ఉంటుంది. సుమారు 20 కి.మీ. దూరంగా ఉంటుంది. ఈ రైలు స్టేషన్ దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు కలుపబడి ఉంది. ఈ రైలు స్టేషన్ నుండి స్ధానిక బస్ లేదా టాక్సీ లపై గోకర్ణం చేరవచ్చు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    గోకర్ణం ఎలా చేరాలి? విమాన ప్రయాణం గోవాలోని డబోలిమ్ విమానాశ్రయం గోకర్ణానికి సమీపంగా ఉంటుంది. ఇది 140 కి.మీ. దూరం. ఈ విమానాశ్రయం ఇండియాలోని అన్ని ప్రధాన నగరాలకు, ఐరోపా, ఆసియా, అమెరికా, మిడిల్ ఈస్ట్ దేశాలకు కలుపబడి ఉంది. ఛార్టర్ విమానాలు కూడా ఈ విమానాశ్రయం నుండి లభ్యంగా ఉంటాయి.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Apr,Sat
Check Out
21 Apr,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun