Search
  • Follow NativePlanet
Share
» »మాన్‌సూన్‌లో అర‌కు వెళ్లాల‌నుకుంటున్నారా..? అయితే ఈ టూర్ ప్యాకేజీ మీకోస‌మే..!

మాన్‌సూన్‌లో అర‌కు వెళ్లాల‌నుకుంటున్నారా..? అయితే ఈ టూర్ ప్యాకేజీ మీకోస‌మే..!

వ‌ర్షాకాలంలో ఏపీలో సంద‌ర్శించేందుకు అనువైన ప్ర‌దేశాలు చాలానే ఉన్నాయి. ఈ సీజ‌న్‌లో అర‌కు సంద‌ర్శించాల‌నుకునే హైద‌రాబాద్ న‌గ‌ర‌వాసుల‌కు తెలంగాణ టూరిజం ఓ స‌రికొత్త టూర్ ప్యాకేజీనీ అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్యాకేజీలో భాగంగా హైద‌రాబాద్ టు అర‌కు ప్ర‌యాణం ఉంటుంది. ఇది బ‌స్సు జ‌ర్నీ. ఈ ప్యాకేజీనీ తెలంగాణ టూరిజం ఆప‌రేట్ చేస్తోంది. ఈ ప్యాకేజీలో భాగంగా ఒక్క అర‌కు మాత్ర‌మే కాదు.. వైజాగ్‌లోని ప్ర‌సిద్ధిచెందిన పుణ్య‌క్షేత్రాల‌ను కూడా చూసేయొచ్చు. వైజాగ్, ఆర్కే బీచ్, కైలాసగిరి, అన్నవరం, సింహాచలం, బొర్రా గుహలు, అనంతగిరి వంటి ప్రాంతాలన్నీ ఈ టూర్ ప్యాకేజీలో క‌వ‌ర్ అవుతాయి. ఈ ప్యాకేజీ పూర్తివివ‌రాల‌తో పాటు బుకింగ్ కోసం తెలంగాణ టూరిజం అధికారిక వెబ్‌సైట్‌ను https://tourism.telangana.gov.in/ స‌ంప్ర‌దించాల్సిందే..

వ‌ర్షాకాలంలో జాలీగా ఎంజాయ్‌చేయాల‌నుకునేవారు స‌ర‌దాగా ట్రిప్‌లు ప్లాన్ చేస్తుంటారు. అలాంటి వారికోసమే తెలంగాణ టూరిజం ఈ ప్యాకేజీనీ అందుబాటులోకి తీసుకొచ్చింది. అతి త‌క్కువ ధ‌ర‌లోనే హైద‌రాబాద్ టు అర‌కు ట్రిప్ ఉంది. ఈ ప్యాకేజీ ప్ర‌తి బుధ‌వార తేదీల్లోనే ప‌ర్యాట‌కుల‌కు అందుబాటులో ఉంటుంది. కేవ‌లం 6999 రూపాయ‌ల‌తో ఈ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ నెల 28వ తేదిన ఈ ప్యాకేజీ ప‌ర్యాట‌కుల కోసం అందుబాటులో ఉంది. అర‌కు టూర్ తెలంగాణ టూరిజం పేరుతో ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది.

araku valley

ఐదు రోజుల టూర్ షెడ్యూల్ ఇదే..

మొద‌టి రోజు హైదరాబాద్ న‌గ‌రంలోని పర్యాటక భవన్ నుంచి ప్ర‌యాణం ప్రారంభ‌మ‌వుతుంది. మ‌రుస‌టి రోజు ఉద‌యం ఆరుగంట‌ల‌కు విశాఖపట్నం చేరుకుంటారు. హోటల్ లోకి చెకిన్ అయిన అనంత‌రం స‌మీపంలోని సింహాచలం, కైలాసగిరి, రిషికొండ సంద‌ర్శ‌న ఉంటుంది. వీటితోపాటు సబ్ మైరైన్ మ్యూజియం ప‌ర్య‌ట‌న కూడా ఉంటుంది. అదే రోజు సాయంత్రం వైజాగ్ బీచ్ కూడా తీసుకెళ‌తారు. ఆ రోజు రాత్రంతా వైజాగ్ లోనే బ‌స ఉంటుంది. మ‌రుస‌టి రోజు ఉదయం ఆరు గంటలకు అరకు చేరుకుంటారు.

అర‌కు రోడ్ జ‌ర్నీ ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఆ త‌ర్వాత అర‌కులోని ట్రైబల్ మ్యూజియం, అనంతగిరి, కాఫీ ప్లానిటేషన్, బొర్రా గుహ‌లు, థింసా నృత్యాల‌ను ప్ర‌త్య‌క్షంగా వీక్షించొచ్చు. ఆ నైటంతా అరకులోనే ఉంటారు. నాలుగో రోజు అన్న‌వరం ఆల‌యం ద‌ర్శ‌నం ఉంటుంది. దర్శనం అనంత‌రం హైదరాబాద్‌కు తిరుగు ప్ర‌యాణ‌ముంటుంది. ఐదో రోజు ఉదయం ఏడు గంటలకు హైదరాబాద్ చేరుకోవటంతో ఈ టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.

arakufalls1

ప్యాకేజీ ధ‌ర‌లివే..

తెలంగాణ టూరిజం అందిస్తోన్న హైద‌రాబాద్ టు అర‌కు ప్యాకేజీ ధ‌ర‌లు ఓసారి పరిశీలిస్తే.. హైదరాబాద్​ నుంచి అరకు ట్రిప్​కు వెళ్లేందుకు పెద్దలకు ఒక్కొక్కిరికి రూ. 6,999గా నిర్ణ‌యించారు. అదే ఐదు నుంచి ప‌న్నెండేళ్ల చిన్నారులకు మాత్రం రూ. 5,599గా ప్యాకేజీ ధ‌ర‌ల‌ను నిర్ణ‌యించారు. ఇక, ఈ టూర్ ప్యాకేజీలో నాన్ ఏసీ బ‌స్సులో ప్ర‌యాణం ఉంటుంది. వీటితో పాటు నాన్ ఏసీ హోటల్‌లో వసతి ఉంటుంది.

arakuvalley1

తెలంగాణ టూరిజం అందిస్తోన్న ఈ టూర్ ప్యాకేజీలో వైజాగ్, అరకు సైట్ సీయింగ్, గైడ్ ఛార్జీలు మాత్ర‌మే కవర్ అవుతాయి. భోజ‌నం, ఎంట్రీ టికెట్స్, ఆల‌య దర్శనం టికెట్లు, బోటింగ్ ఛార్జీలు, లాండ్రీ ఛార్జీలు వంటివి ఈ ప్యాకేజీలో వ‌ర్తించ‌వు. ఆ ఖ‌ర్చుల‌న్నీ ప్ర‌యాణికులే భ‌రించాల్సి ఉంటుంది. ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించిన మరిన్ని వివరాల కోసం ప‌ర్యాట‌కులు తెలంగాణ టూరిజం అధికారిక వెబ్‌సైట్ https://tourism.telangana.gov.in/ పై క్లిక్ చేయ‌గ‌ల‌రు. మ‌రెందుకాల‌స్యం మీరు కూడా ఈ వ‌ర్షాకాలంలో అర‌కు ట్రిప్ ప్లాన్ చేసేయొండి మ‌రీ..

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+