Search
  • Follow NativePlanet
Share
» »షిర్డీ వెళ్లాల‌నుకుంటున్నారా... అయితే ఈ టూర్ ప్యాకేజీ మీకోసమే..!

షిర్డీ వెళ్లాల‌నుకుంటున్నారా... అయితే ఈ టూర్ ప్యాకేజీ మీకోసమే..!

దేశంలో ఒక్క ప్రాంతంలో ఒక్కో దేవుని ఆల‌యం ఎంత‌గానో ప్ర‌సిద్ధిచెందాయి. అలాగే, భార‌త్‌లో సాయిబాబా భ‌క్తులు చాలామంది ఉన్నారు. వారంతా సాయిబాబాకు ఎంతో ప్ర‌సిద్ధిచెందిన ఆల‌యం షిర్డీకి వెళ్లాల‌ని అనుకుంటుంటారు. అలాంటివారికోసం ఐఆర్‌సిటిసి ఓ స‌రికొత్త టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. ఇందులో భాగంగా విజ‌య‌వాడ నుంచి షిర్డీ కి ప్ర‌యాణం మొద‌లవుతుంది. ఒక్క షిర్డీ ద‌ర్శ‌నం మాత్ర‌మే కాకుండా స‌మీపంలోని ఆల‌యాల‌తో పాటు ఎంతో పేరుగాంచిన శ‌నిశిగ్నాపూర్‌ను కూడా ద‌ర్శించుకోవ‌చ్చు. రండి ఈప్యాకేజీ వివరాలేంటో చూసేద్దాం..

ఐఆర్‌సిటిసి అందిస్తోన్న విజ‌య‌వాడ టు షిర్డీ టూర్ ట్రిప్ జూన్ 18వ తేదీన ప‌ర్యాట‌కులకు అందుబాటులో ఉంటుంది. SAI SANNIDHI EX VIJAYAWADA" పేరుతో విజయవాడ నుంచి షిర్డీకి IRCTC టూరిజం ప్యాకేజీని ప్రకటించింది. ఇది మొత్తం నాలుగురోజులు టూర్ ప్యాకేజీ. ఇందులో భాగంగా రైలు ప్ర‌యాణం చేయాల్సి ఉంటుంది. ఈ ప్యాకేజీని ఐఆర్‌సిటిసి ప్ర‌తి మంగ‌ళ‌వారం తేదీల్లో ప‌ర్యాట‌కుల‌కు అందుబాటులో ఉంచుతుంది. ఈ జ‌ర్నీలో భాగంగా ప్ర‌యాణికులు కేవ‌లం విజ‌య‌వాడ‌లోనే కాకుండా ఏపీ, తెలంగాణ‌లోని ప‌లు స్టేష‌న్‌ల‌లో రైలు ఎక్కే అవ‌కాశం ఉంటుంది. విజ‌య‌వాడ‌, ఖ‌మ్మం, సికింద్రాబాద్‌, వరంగల్ రైల్వే స్టేషన్లల్లో కూడా ప‌ర్యాట‌కులు ఈ రైలు ఎక్కొచ్చు. ఇత‌ర పూర్తి వివ‌రాల‌కోసం ప‌ర్యాట‌కులు ఐఆర్‌సిటిసి అధికారిక వెబ్‌సైట్‌ను సంప్ర‌దించ‌వ‌చ్చు.

విజయవాడు టూ షిర్డీ.. నాలుగురోజుల టూర్ షెడ్యూల్‌..

ఈ టూర్‌లో భాగంగా మొదటి రోజు విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి మీ ప్ర‌యాణం ప్రారంభ‌మ‌వుతుంది. రాత్రి 10.15 గంటలకు 17208 అనే నెంబ‌ర్‌గ‌ల షిర్డీ ఎక్స్‌ప్రెస్ రైలు విజ‌య‌వాడ నుంచి బ‌య‌లుదేరుతుంది. ఈ ట్రైన్‌లో నైటంతా జ‌ర్నీఉంటుంది. మ‌రుస‌టి రోజు ఉద‌యం 06.15 గంటలకు నాగర్‌సోల్ చేరుకుంటారు. అనంత‌రం అక్క‌డికి నుంచి షిర్డీకి ప్ర‌యాణం ఉంటుంది.

Want to go to Shirdi but this tour package is for you

అక్క‌డ షిర్డీ సాయిబాబాను సంద‌ర్శించుకుంటారు. ఈవెనింగ్ షాపింగ్ చేసేందుకు కాస్త ఫ్రీ టైమ్ కూడా దొరుకుతుంది. ఆ స‌మ‌యంలో షిర్డీ వీధుల్లో షికార్లు కొట్టొచ్చు. ఆ నైటంగా షిర్డీలోనే బస చేస్తారు. మూడో రోజు ఉద‌యం శనిశిగ్నాపూర్ కు ప్ర‌యాణం ఉంటుంది. అక్కడ్నుంచి మళ్లీ షిర్డీ చేరుకోవాల్సి ఉంటుంది. అదే రోజు రాత్రి 7.30 గంటలకు నాగర్‌సోల్ స్టేషన్‌లో తిరుగు ప్రయాణం మొదలవుతుంది. తెల్లవారుజామున మూడు గంటలకు విజయవాడ రైల్వే స్టేషన్ చేరుకోవడంతో ఈ టూర్ ప్యాకేజీ ముగుస్తోంది.

ఈ టూర్ ధ‌ర‌లు..

ఈ ప్యాకేజీలో భాగంగా వీటి ధ‌ర‌ల‌ను ఓసారి ప‌రిశీలిస్తే.. కంఫర్ట్ క్లాస్ (3ఏసీ)లో సింగిల్ ఆక్యుపెన్సీకి రూ. 16,165గా చెల్లించాల్సి ఉంటుంది. డబుల్ ఆక్యుపెన్సీకి రూ.10045 చెల్లించాలి. ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ. 8440 చెల్లించాల్సి ఉంటుంది. ఐదు నుంచి ప‌ద‌కొండేళ్ల చిన్నారులకు ఈ ప్యాకేజీలో భాగంగా వేర్వురు ధరలు ఉన్నాయి. స్టాండర్డ్ క్లాస్ లో ట్రిపుల్ షేరింగ్ కు 5,985గా ధర నిర్ణ‌యించారు. సింగిల్ షేరింగ్ కు రూ. 13705 చెల్లించాలి. అదే డబుల్ షేరింగ్ అయితే,రూ. 7590గా ఉంటుంది. ప‌ర్యాట‌కులు పూర్తి వివ‌రాలు బుకింగ్ కోసం ఐఆర్‌సిటిసి అధికారికి వెబ్‌సైట్‌ను సంప్ర‌దించ‌గ‌ల‌రు. మ‌రెందుకాల‌స్యం మీ షిర్డీ ప్ర‌యాణానికి సిద్ధ‌మ‌వ్వండి మ‌రి..

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+