Search
  • Follow NativePlanet
Share
» »బొగ‌త జల‌పాతం చూడాల‌ని ఉందా? ఈ వ‌న్ డే టూర్ ప్యాకేజీ మీకోస‌మే!

బొగ‌త జల‌పాతం చూడాల‌ని ఉందా? ఈ వ‌న్ డే టూర్ ప్యాకేజీ మీకోస‌మే!

రాష్ట్రంలో విస్తారంగా వ‌ర్షాలు కురుస్తుండ‌డంతో బొగత మళ్లీ జలకళను సంతరించుకుంది. సరికొత్త అందాలతో ఈ తెలంగాణ నయాగారా చూపరులకు కనువిందు చేస్తూ ప‌ర‌వ‌ళ్లు తొక్కుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో జలపాతానికి జీవం వ‌చ్చింది. ఈ స‌మ‌యంలో ఇక్క‌డి ప్రకృతి అందాల చూడాల‌ని, జ‌ల‌పాతపు నీటి స‌వ్వ‌డులు వినాల‌ని ఎవ‌రికి ఉండ‌దు చెప్పండి. అలాంటి ఔత్సాహిక ప‌ర్యాట‌కుల కోసం తెలంగాణ టూరిజం శాఖ వ‌న్ డే టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. ఈ టూర్ హైద‌రాబాద్ నుంచి ప్రారంభం అవుతుంది. బొగ‌త జ‌ల‌పాత‌పు విశేషాల‌తోపాటు ఈ వ‌న్ డే టూర్‌ ప్యాకేజీ వివ‌రాల‌ను తెలుసుకుందాం!

తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లి గ్రామ సమీపంలోని బొగత జలపాతం ఉంది. వ‌ర్షాకాలం వ‌చ్చింద‌టే చాలు పరవళ్లు తొక్కుతూ సంద‌డి చేసే ఈ జ‌పాత‌పు అందాలు చూప‌రుల‌ను క‌నువిందు చేస్తాయి. ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలో ఇటీవల కురిసిన వర్షానికి జలకళతో సందడి వాతావ‌ర‌ణం క‌నిపిస్తోంది. 50 అడుగుల ఎత్తు నుంచి పాలనురగలా దిగువకు ప్రవహిస్తున్న నీళ్లను చూసేందుకు పర్యాటకులు క్యూ క‌డుతున్నారు. ఇక్క‌డి ప‌చ్చ‌ని ప్రకృతి రమణీయత ఎవ్వ‌రినైనా ఇట్టే ఆకర్షిస్తోంది అన‌డంలో ఆశ్చ‌ర్యం లేదు. దట్టమైన అడవి మార్గం గుండా ప్రవహించే జలపాతం అందాలను చూస్తూ ఇక్క‌డికి వ‌చ్చే ప‌ర‌ర్యాట‌కులు మురిసిపోతున్నారంటే న‌మ్మండి.

bogathafalls

వీకెండ్స్‌లో మాత్ర‌మే టూర్‌ ప్యాకేజీ

ఈ సహజసిద్ధ జలపాతాన్ని చూసేందుకు వ‌ర్షాకాలంలో రాష్ట్రం నలుమూలల నుంచి పర్యాటకులు ప‌ర్యాట‌కులు రావ‌డం ఆన‌వాయితీగా మారిపోయింది. దీంతో సంద‌ర్శ‌కుల సౌక‌ర్యార్థం ఇప్ప‌టికే అట‌వీశాఖ అధికారులు జ‌ల‌పాతం ద‌గ్గ‌ర స్నాన ఘట్టాలతోపాటు ప్ర‌మాద‌పు హెచ్చ‌రిక బోర్డులు ఏర్పాటు చేశారు. దీంతో స్నానాలు చేస్తూ పర్యాటకులు జలపాతాన్ని చూస్తూ ఉబ్బిత‌బ్బింపైపోతున్నారు. బొగ‌త జ‌ల‌పాతం అందాల‌ను వీక్షించేందుకు అనువుగా తెలంగాణ టూరిజం శాఖ‌ వన్ డే టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది.

హైదరాబాద్ నుంచి నాన్ ఏసీ కోచ్‌లో ఈ ప్యాకేజీ జర్నీ మొద‌ల‌వుతుంది. వీకెండ్స్‌లో ఈ ప్యాకేజీని అందుబాటులో ఉంచింది. ఇందుకోసం తెలంగాణ టూరిజం అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి ప్యాకేజీ వివరాలను చూడొచ్చు.

bogathafalls1

అందుబాటు ధ‌ర‌ల్లో టికెట్లు

ఈ టూర్ ప్యాకేజీని BOGATHA WATERFALLS - Telangana Tourism పేరుతో తెలంగాణ టూరిజం శాఖ ప‌రిచ‌యం చేసింది. ప్రతి శని, ఆదివారాల్లో మాత్రమే ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటోద‌ని మ‌ర్చిపోవ‌ద్దు. ఒక్క రోజులోనే నాన్ ఏసీ కోచ్ బస్సులో హైదరాబాద్ నుంచి బొగతకు వెళ్లి రావ‌చ్చు. ఈ ప్యాకేజీ షెడ్యూల్ ప్ర‌కారం ఉదయం 6 గంటలకు హైదరాబాద్‌లో మొద‌లై అదే రోజు రాత్రి 11.30 గంటలకు తిరిగి హైదరాబాద్‌కు చేరుకోవ‌డంతో టూర్ ముగుస్తుంది. ఇందుకోసం పెద్ద‌ల‌కు రూ.

1600, పిల్ల‌ల‌కు రూ.1280గా ధ‌ర‌లు నిర్ణ‌యించారు. ఈ ప్యాకేజీని బుకింగ్ కోసం https://tourism.telangana.gov.in/package/bogathawaterfalls లింక్‌ను క్లిక్ చేస్తే స‌రిపోతుంది. పూర్తి వివ‌రాలు అందుబాటులో ఉండ‌డంతోపాటు బుకింగ్ కూడా ఉంటుంది. మ‌రెందుకు ఆల‌స్యం ఈ వ‌ర్షాకాలంలో బొగ‌త జ‌ల‌పాత‌పు అందాల‌ను త‌నివితీరా ఆస్వాదించేందుకు వెంట‌నే టికెట్ బుక్ చేసుకోండి!

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+