Search
  • Follow NativePlanet
Share
» »షిర్డీ ద‌ర్శనం చేసుకోవాల‌నుకుంటున్నారా? అయితే, ఈ ప్యాకేజీ మీకోస‌మే..!

షిర్డీ ద‌ర్శనం చేసుకోవాల‌నుకుంటున్నారా? అయితే, ఈ ప్యాకేజీ మీకోస‌మే..!

షిర్డీ సాయిబాబా ద‌ర్శ‌నం చేసుకోవాల‌నుకునే భ‌క్తుల‌కు తెలంగాణ టూరిజం వారు ఓ స‌రికొత్త టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా షిరిడి ఆల‌యంతో పాటు పండరీపురం, తుల్జాపూర్ వంటి ప్ర‌దేశాల‌ను కూడా చూడొచ్చు! షిర్డీ సాయి బాబా దర్శనం చేసుకోవాల‌నుకునే హైద‌రాబాద్ వాసుల‌కు తెలంగాణ టూరిజం అందిస్తోన్న స‌రికొత్త టూర్ ప్యాకేజీ ఇది. ఈ ట్రిప్‌లో భాగంగా షిర్డీతో పాటు పండరీపూర్ కూడా చుట్టేసి రావొచ్చు. హైదరాబాద్ నుంచి బస్సు జర్నీ ద్వారా ఈ ప్ర‌యాణం మొద‌ల‌వుతుంది. ఇక‌, ఈ టూర్ ప్యాకేజీ ప్రస్తుతం సెప్టెంబ‌ర్ 14వ తేదీన ప‌ర్యాట‌కుల‌కు అందుబాటులో ఉంది. ఈ ప్యాకేజీ పూర్తి వివరాలు ఇప్ప‌డు చూసేద్దాం..

తెలంగాణ టూరిజం ప‌ర్యాట‌కుల కోసం పలు అధ్యాత్మిక ప్రాంతాలను చూసేందుకు ప్యాకేజీలను ఆపరేట్ చేస్తూ వ‌స్తూనే ఉంది. ఇందులో భాగంగానే షిర్డీ సాయి బాబా దర్శనం కోసం మరో ప్యాకేజీని ప‌ర్యాట‌కుల కోసం ఆపరేట్ చేస్తోంది. ఈ ప్యాకేజీ 'SHIRDI PANDHARPUR TOUR' అనే పేరుతో ప్రారంభ‌మ‌వుతుంది. హైదరాబాద్ నుంచి ఈ ప్ర‌యాణం మొద‌లవుతుంది. మొత్తం నాలుగు రోజులపాటు ఈ ప్ర‌యాణం ఉంటుంది.

బస్సు జ‌ర్నీ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ టూర్ ప్యాకేజీ ఈనెల 14 వ‌తేదిన‌ తేదీన టూరిస్టుల‌కు అందుబాటులో ఉంటుంది. ఒక‌వేళ ఈ తేదీ మిస్ అయితే మరో తేదీని తెలంగాణ టూరిజం ప్ర‌క‌టిస్తుంది. అందుకు అనుగుణంగానే ప‌ర్యాట‌కులు ఈప్యాకేజీని బుకింగ్ చేసుకుని వెళ్లొచ్చు. ఈ ప్యాకేజీలో భాగంగా షిర్డీలోని సాయిబాబా మందిరంతోపాటు పాండరీపురం, తుల్జాపూర్, శనిశిగ్నాపూర్ వంటి ప్ర‌దేశాల‌ను వీక్షించొచ్చు.

shirdi package

నాలుగురోజులు టూర్ షెడ్యూల్ ఇదే..

మొద‌టిరోజు హైదరాబాద్ నుంచి ఈ ప్ర‌యాణం ప్రారంభ‌మ‌వుతుంది. దిల్ సుఖ్ నగర్, బషీర్ బాగ్, సికింద్రాబాద్, బేగంపేట్, కేపీహెచ్ బీ, చందానగర్ ప‌ర్యాట‌కుల కోసం పిక‌ప్ పాయింట్స్ అందుబాటులో ఉంటాయి. మ‌రుస‌టి రోజు ఉదయం శనిశిగ్నాపూర్ చేరుకుంటారు. అక్క‌డ 11.30 గంటల స‌మ‌యానికి హోటల్ లోకి చెకిన్ అవుతారు. అనంత‌రం షిర్డీ సాయి బాబా దర్శనం చేసుకుంటారు.

ఆ రోజు రాత్రంతా అక్క‌డే ఉండాల్సి ఉంటుంది. మూడో రోజు ఉదయం 05. 30 గంటలకు షిర్డీ నుంచి పాండరీపురానికి ప్ర‌యాణం ఉంటుంది. అక్క‌డ శ్రీ విట్టల్ రుక్మిణి ఆలయ సంద‌ర్శ‌న ఉంటుంది. అక్కడ్నుంచి తుల్జాపూర్ కు ప్ర‌యాణం ఉంటుంది. ఆ త‌ర్వాత హైదరాబాద్ కు తిరుగు ప్రయాణమవుతారు. ఆ మ‌రుస‌టి రోజు అంటే నాల్గోరోజు ఉదయం 6 గంటలకు హైదరాబాద్ కు చేరుకోవటంతో ఈ ప్యాకేజీ ముగుస్తుంది.

Want to visit Shirdi

ప్యాకేజీ ధ‌ర‌లివే..

తెలంగాణ టూరిజం అందిస్తోన్న ఈ ఆధ్యాత్మిక ప్ర‌ద‌ర్శ‌న‌లో భాగంగా టికెట్ ధరలు చూస్తే పెద్దలకు రూ. 3100 చెల్లించాల్సి ఉంటుంది. అదే పిల్లలకయితే రూ. 2530గా నిర్ణయించారు. నాన్ ఏసీ బస్సులో ప్ర‌యాణం చేయాల్సి ఉంటుంది. ఈ ప్యాకేజీని బుక్ చేసుకోవాల‌నుకునే ప‌ర్యాట‌కులు తెలంగాణ టూరిజం అధికారిక వెబ్‌సైట్‌ను సంప్ర‌దించ‌గ‌ల‌రు. ప్యాకేజీ బుకింగ్‌తో పాటు షిర్డీ సాయిబాబా దర్శన టికెట్లను బుకింగ్ చేసుకోవాలని అధికారులు సూచించారు.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+