కర్నాటక టూరిజం రాష్ట్ర సంస్కృతి, వారసత్వ చరిత్ర, వంటివి సంరక్షించటం లో ఎంతో ముందంజ వేసింది. అన్ని రకాల టూరిజం వలెనె వైల్డ్ లైఫ్ టూరిజం కూడా ఇక్కడ దిన దిన అభివృద్ధి పొందుతూ, టూరిస్ట్ లను ప్రపంచ వ్యాప్తంగా కర్నాటకకు ఆకర్షిస్తోంది. కర్నాటక రాష్ట్రంలో ఇండియా లోని బెస్ట్ వైల్డ్ లైఫ్ సాన్క్చురీలు, అనేక అరుదైన జంతువులను సంరక్షించే నేషనల్ పార్క్ లు కలవు. ఆడవులలో అడుగుపెట్టి, వన్య జంతువుల జీవినం పరిశీలించాలంటే, మీకు కర్ణాటకలో ఎన్నో ఎంపికలు కలవు. మరి ఈ వన్య జంతువులను సమీపంగా కర్ణాటకలోని ఏ ఏ సాన్క్చురీలలో చూడవచ్చో పరిశీలిద్దాం.

బండిపూర్ నేషనల్ పార్క్ / టైగర్ రిజర్వు
ఇండియా లో బండి పూర్ నేషనల్ పార్క్ ఉత్తమ నిర్వహణ కలిగినది. పడమటి కనుమల సుందర దృశ్యాల నేపధ్యంతో కల ఈ పార్క్ సుమారు 874 కి. మీ. ల విస్తీర్ణం కలిగి వుంది. దీనిలో కనుమరుగవుతున్న జంతువులు సాంబార్, బార్కింగ్ జింక, మచ్చల జింక, ఇంకా అనేక పక్షులు, మొసళ్ళు, పాములు కూడా కలవు.

బండిపూర్ రిజర్వు ప్రాంతం
బండి పూర్ ఇండియా లోని సెంట్రల్ గవర్నమెంట్ స్థాపించిన 9 టైగర్ రిజర్వు లలో ఒకటి. ఈ నేషనల్ పార్క్ నీలగిరి సంరక్షిత ప్రాంతంలో భాగంగా కలదు. నీలగిరి రిజర్వు ప్రాంతాలలో, కేరళ లోని వయనాడ్ వైల్డ్ లైఫ్ సాన్క్చురి, నాగార్హోలె నేషనల్ పార్క్ మరియు తమిళ్ నాడు లోని ముడుమలై వైల్డ్ లైఫ్ సాన్క్చురి లు కలవు.

ఆంశి నేషనల్ పార్క్
ఆంశి నేషనల్ పార్క్, కర్నాటక లోని ఉత్తర కన్నడ జిల్లాలో కలదు. ఈ నేషనల్ పార్క్ దండెలి వైల్డ్ లైఫ్ సాన్క్చురి సమీపంలో వుంటుంది. గతంలో ఇది నేషనల్ పార్క్ లో భాగంగా వుండేది.
Photo Courtesy: Ms.Mulish

అమ్సి నేషనల్ పార్క్
అమ్సి నేషనల్ పార్క్ సుమారు 340 చ. కి. మీ. ల విస్తీర్ణంలో కలదు. ఈ పార్క్ లో మలబార్ సివెట్, ఇండియన్ బైసన్, స్లాత్ బేర్ వంటి జంతువులు కలవు. ఈ పార్క్ లో వివిధ రకాల సరీనృపాలు, మరియు 200 రకాలకు పైగా పక్షులు కూడా కలవు.
Photo Courtesy: L. Shyamal

బన్నెర ఘట్ట నేషనల్ పార్క్
బన్నెర ఘట్ట నేషనల్ పార్క్ బెంగుళూరు నగరానికి సుమారు 22 కి. మీ. ల దూరంలో కలదు. నగరం నుండి తరచుగా స్థానిక టాక్సీలు, ప్రభుత్వ బస్సులు నడుస్తాయి.

బన్నెర ఘట్ట నేషనల్ పార్క్
బన్నెర ఘట్ట నేషనల్ పార్క్ విశాలమైనది. దీని విస్తీర్ణం సుమారు 104 చ. కి. మీ. లు వుంటుంది. పార్క్ లో వృక్ష సంపద అతి దట్టంగా వుంటుంది. అనేక రకాల జంతువులు కూడా కలవు. వైల్డ్ బోర్, పాంథర్స్, బైసన్, చిరుత, సింహం వంటి జంతువులు చూడవచ్చు. దట్టమైన ప్రదేశాలు తిరిగి జంతువులను చూసేందుకు పార్క్ లోపల ఒక సఫారి కూడా కలదు.

కుద్రేముఖ్ నేషనల్ పార్క్
కుద్రేముఖ్ నేషనల్ పార్క్ సుమారు 600 చ. కి. మీ. ల విస్తీర్ణంలో కలదు. ఈ నేషనల్ పార్క్ లో ఎల్లప్పుడూ పచ్చగా వుండే దట్టమైన అడవులు కలవు.

కుద్రేముఖ్ నేషనల్ పార్క్
కుద్రేముఖ్ నేషనల్ పార్క్ లో సింహపు తోక కల కోతి, గోల్డెన్ జాకాల్, బెంగాల్ టైగర్, ఇండియన్ జైంట్ స్క్విర్రాల్, మలబార్ విజిలింగ్ పక్షి వంటివి చూడవచ్చు. ఇక్కడ ట్రావెలర్ లు వసతి పొందేందుకు సౌకర్యాలు కూడా కలవు.

దండెలి వైల్డ్ లైఫ్ సాన్క్చురి
దండెలి వైల్డ్ లైఫ్ సాన్క్చురి కర్ణాటక లో రెండవ అతి పెద్ద వైల్డ్ లైఫ్ సాన్క్చురి. వన్య జంతువులకు ఇది ఒక సహజ ప్రదేశం.
Photo Courtesy: Sumeet Moghe

దండెలి వైల్డ్ లైఫ్ సాన్క్చురి
దండెలి వైల్డ్ లైఫ్ సాన్క్చురి లో బ్లాకు పాంథర్స్, గౌర్, క్రోకోడైల్స్ ఇతర జంతువులు , పక్షులు అయిన హార్న్ బిల్, మ్లలబార్ పై హార్న్ బిల్ వైట్ బ్రెస్ట్ కింగ్ ఫిషర్ క్రేస్తేడ్ సర్పెంట్ ఈగిల్ వంటివి చూడవచ్చు.
ఫోటో క్రెడిట్ : Shyamal

నాగర్ హోల్ నేషనల్ పార్క్
నాగర్ హోల్ నేషనల్ పార్క్ ను రాజీవ్ గాంధి నేషనల్ పాక్ అని కూడా అంటారు. ఈ పార్క్ కొడగు జిల్లాలో కలదు. నీలగిరి రక్షిత అడవులలో ఒక భాగంగా కలదు.

నాగర్ హోల్ నేషనల్ పార్క్
నాగర్ హోల్ నేషనల్ పార్క్ లో అనేక వృక్షాలు, జంతువులు మాత్రమే కాక మీరు అనేక చిన్న చిన్న నీటి ప్రవాహాలు, జలపాతాలు, లోయలు, కొండలు కూడా చూడవచ్చు. దీనిలో పులులు అధిక సంఖ్యలో వుంటాయి. ఏనుగులు, ఇండియన్ బైసన్ లు కూడా చూడవచ్చు. ఈ నేషనల్ పార్క్ సుమారు 643 చ. కి. మీ. ల విస్తీర్ణంలో వ్యాపించి వుంది.

కావేరి వైల్డ్ లైఫ్ సాన్క్చురి
ఈ రక్షిత ప్రదేశం చామరాజనగర్, మండ్య మరియు రామనగరం జిల్లాల్లో విస్తరించి వుంది. విశాలమైన ఈ వైల్డ్ లైఫ్ సాన్క్చురి చూసేందుకు అధిక సమయం పడుతుంది.
Photo Courtesy: Chinmayisk

కావేరి వైల్డ్ లైఫ్ సాన్క్చురి
ఈ అభయారణ్యంలో వృక్ష జాతులు, జంతువులు పుష్కలంగా కలవు. వన్య జంతువులు లంగూర్, బానేట్ మకావు, బార్కింగ్ డీర్, వైల్డ్ బొర్ జైంట్ ఉడుత మొదలైనవి చూడవచ్చు.
Photo Courtesy: Chinmayisk

మ్యాప్
కర్ణాటకలోని వైల్డ్ లైఫ్ రిజర్వుల ప్రదేశాలను చూపుతూ ఒక మ్యాప్ ఇస్తున్నాం, పరిశీలించండి.



Click it and Unblock the Notifications














