Search
  • Follow NativePlanet
Share
» »ఈ సీజ‌న్‌లో ఊటీ టూర్ వెళ్తారా..? అయితే, ఐఆర్‌సిటిసి వారి ఈ ప్యాకేజీ మీకోస‌మే..!

ఈ సీజ‌న్‌లో ఊటీ టూర్ వెళ్తారా..? అయితే, ఐఆర్‌సిటిసి వారి ఈ ప్యాకేజీ మీకోస‌మే..!

ఎత్తయిన కొండలు, పచ్చని ప్రకృతి అందాల‌ను చూడాల‌నుకుంటే మాత్రం త‌ప్ప‌కుండా ఊటీకీ వెళ్లాల్సిందే. ఇక్క‌డి ప్ర‌కృతి అందాల అనుభూతిని మాటల్లో వ‌ర్ణించ‌డం చాలా క‌ష్టం. ఒక్క వేస‌విలోనే కాకుండా ఇక్క‌డికి అన్నీ సీజ‌న్ల‌లో సంద‌ర్శ‌కుడు వ‌స్తుంటారు. ఈ సీజ‌న్‌లో ఊటీ అందాల‌ను చూడాల‌నుకునేవారికి ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (IRCTC) ఓ స‌రికొత్త ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఒకవేళ మీరూ ఊటీ ట్రిప్‌కు ప్లాన్‌ చేస్తున్న‌ట్ల‌యితే మాత్రం ఈ ఆరు రోజుల పాటు సాగే ఈ ట్రైన్ టూర్‌ ప్యాకేజీ విశేషాల‌ను ఓ సారి చూసేయండి..

వానాకాలంలో ఊటీ అందాలను చూడాలని అనుకునేవారికి అతి తక్కువ ధరలోనే ఐఆర్సీటీసీ టూరిజం ప్యాకేజీని తీసుకొచ్చింది. ఇక‌, ఈ టూర్ ప్యాకేజీ హైదరాబాద్ నుంచి ULTIMATE OOTY EX HYDERABAD పేరుతో ఐఆర్సిసిటిసి ఆపరేట్ చేస్తోంది. ఈ ట్రిప్‌లో భాగంగా ఊటీతో పాటు కున్నూర్ వంటి టూరిజం ప్రాంతాలను సంద‌ర్శించేయొచ్చు. ఈ టూర్ ప్యాకేజీ ఈ నెల (జులై) 30వ తేదిన ప్ర‌యాణికుల‌కు అందుబాటులో ఉంటుంది. ప్రతి మంగళవారం తేదీల్లో ఈ ప్యాకేజీ ఉంటుంది. ఈ తేదీ మిస్ అయితే మరో తేదీలో కూడా ఈ టిక్క‌ట్లు బుక్ చేసుకునే అవ‌కాశం ఉంటుంది. మొత్తం ఐదు రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ ఉంటుంది. హైదరాబాద్ నుంచి ఈ ట్రైన్ జ‌ర్నీ ప్రారంభ‌మ‌వుతుంది.

ooty

ఆరు రోజుల షెడ్యూల్ ఇదే..

ఈ టూర్ లో భాగంగా మొద‌టిరోజు హైదరాబాద్‌లో ప్ర‌యాణం ప్రారంభమవుతుంది. 17230 అనే నెంబ‌ర్‌గ‌ల శబరి ఎక్స్‌ప్రెస్ ట్రైన్ మధ్యాహ్నం 12.20 గంటలకు బ‌యలుదేరుతుంది. రాత్రి అంతా జర్నీ చేయాల్సి ఉంటుంది. మ‌రుస‌టి రోజు ఉదయం ఎనిమిది గంట‌ల‌కు కొయంబత్తూర్ రైల్వే స్టేషన్ చేరుకుంటారు. అక్కడ నుంచి ఊటీకి బ‌యలుదేరుతారు. ఊటికీ వెళ్లాక హోటల్‌లో చెకిన్ అవ్వాలి. ఆ త‌ర్వాత అక్క‌డి ప్ర‌సిద్ధిచెందిన ప్ర‌దేశాల్లో బొటానికల్ గార్డెన్స్, ఊటీ లేక్ వంటివి సంద‌ర్శిస్తారు. అక్క‌డే నైట్ డిన్న‌ర్ చేసి స్టేయింగ్ కూడా చేస్తారు. ఇక‌, మూడోరోజు దొడబెట్ట పీక్, టీ మ్యూజియం, పైకారా ఫాల్స్ చూసేందుకు బ‌య‌లుదేరుతారు. రాత్రికి ఊటీలోనే బస చేయాల్సి ఉంటుంది.

నాలుగో రోజు కూనూర్ సైట్ సీయింగ్ సంద‌ర్శ‌న ఉంటుంది. ఇక‌, రాత్రికి ఊటీలోనే బస కార్య‌క్ర‌మం ఉంటుంది. ఐదోరోజు ఉదయం హోటల్ నుంచి చెక్ అవుట్ అయ్యాక‌, కొయంబత్తూర్ రైల్వే స్టేషన్‌కు వెళ్తారు. అక్క‌డ మధ్యాహ్నం 4.35 గంటలకు శబరి ఎక్స్‌ప్రెస్‌లో తిరుగు ప్ర‌యాణం ఉంటుంది. ఆ నైటంతా ట్రైన్‌లో జ‌ర్నీ చేయాల్సి ఉంటుంది. ఆరో రోజు మధ్యాహ్నం 12.20 గంటలకు సికింద్రాబాద్ చేరుకోవ‌డంతో ఈ టూర్ ముగుస్తోంది.

ooty travel guide

టూర్ ప్యాకేజీ ధరలు

ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా ధ‌ర‌లు ఇలా ఉన్నాయి.. కంఫర్డ్ క్లాస్(3A) లో సింగిల్ షేరింగ్ అయితే రూ. 28940 చెల్లించాలి. అదే డబుల్ షేరింగ్ అయితే రూ. 16430 ఉంటుంది. ట్రిపుల్ షేరింగ్ అయితే రూ. 13380 చెల్లించాల్సి ఉంటుంది. మార్చి, ఏప్రిల్, మే నెల‌ల‌తో పోల్చితే ఈ నెల‌ (జులై)లో రూ. 2వేల వరకు ధరలు తగ్గిన‌ట్లు క‌నిపిస్తోంది. అదే స్టాండర్డ్ క్లాస్ లో ట్రిపుల్ షేరింగ్ అయితే 10930 రూపాయ‌లు చెల్లించాలి. డబుల్ షేరింగ్ అయితే రూ. 13980 ఉంటుంది. సింగుల్ షేరింగ్ కు రూ.

26480గా నిర్ణ‌యించారు. ఇందులో కూడా గ‌త ధ‌ర‌లు ఇప్ప‌టికీ చాలా వ్య‌త్యాసం ఉంది. 5 -11 ఏళ్ల మధ్య ఉండే చిన్నారులకు వేర్వురు ధరలు అందుబాటులో ఉంటాయి. ఐఆర్‌సిటిసి అందిస్తోన్న ఈ టూర్ ప్యాకేజీలో టికెట్లు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్ని కవర్ అవుతాయి. ప్ర‌యాణికులు ఇత‌ర పూర్తి స‌మ‌చారం కోసం లేదా, టికెట్లు బుక్ చేసుకునేందుకు ఐఆర్‌సిటిసి అధికారిక వెబ్‌సైట్ https://www.irctctourism.com/ ను సంప్ర‌దించాల్సి ఉంటుంది.

More News

    Read more about: irctc tour package ooty
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+