Search
  • Follow NativePlanet
Share
» »యాదగిరి దర్శనం - వారాంతపు విహారం !

యాదగిరి దర్శనం - వారాంతపు విహారం !

శ్రీ లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ లేదా యాదగిరిగుట్ట లేదా భోన గిరి అనే పేర్లు కల ఈ దేవాలయం ప్రధాన దేవుడు విష్ణు మూర్తి అవతారం అయిన నరసింహ స్వామి.

ద్రావిడ శిల్ప శైలి నిర్మాణం కల ఈ దేవాలయం తెలంగాణా రాష్ట్రంలోని నల్గొండ జిల్లాలో ఒక చిన్న కొండపై కలదు. హైదరాబాద్ నగరానికి యాదగిరి గుట్ట 60 కి. మీ. ల దూరంలో కలదు. ఆదివారాలు ఇతర ప్రభుత్వ సెలవు దినాలలో భక్తులు అధిక సంఖ్యలో ఈ దేవాలయానికి వస్తారు.

ఇది కూడా చదవండి : రామోజీ ఫిలిం సిటీ

హైదరాబాద్ లో హోటల్ వసతులకు క్లిక్ చేయండి

యాదగిరి గుట్ట దేవాలయం

యాదగిరి గుట్ట దేవాలయం

పూజలు
ఈ దేవాలయంలో సంవత్సరం పొడవునా అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం మార్చ్ నెలలో ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.

ఫోటో కర్టిసీ: Arkrishna

యాదగిరి గుట్ట దేవాలయం

యాదగిరి గుట్ట దేవాలయం

జన్మదిన వేడుకలు
స్వామి నరసింహ జన్మ దిన వేడుకలను ప్రతి సంవత్సరంక్రమం తప్పకుండా నిర్వహిస్తారు. నరసింహ స్వామీ ని యాదగిరి అని కూడా పిలువడం తో ఈ కొండ కు యాదగిరి గుట్ట అనే పేరు వచ్చింది.

Photo courtesy: Arkrishna

యాదగిరి గుట్ట దేవాలయం

యాదగిరి గుట్ట దేవాలయం

గర్భ గుడి
ఈ గుడి యొక్క గర్భ గృహం ఒక గుహలో ఒక పెద్ద బండ రాతి కింద కలదు. ఇది స్వామీ నివాసాన్ని సగానికి పైగా కప్పి ఉంచుతుంది. త్రేతాయుగం లో యాదరిషి అనే ఒక మహా రిషి ఇక్కడ తపస్సు చేసాడని ఆయన తపస్సుకు మెచ్చిన శ్రీ మహా విష్ణువు నరసింహ అవతారంగా దర్శనం ఇచ్చాడని చెపుతారు.

Photo courtesy: Arkrishna

యాదగిరి గుట్ట దేవాలయం

యాదగిరి గుట్ట దేవాలయం

క్షేత్ర ప్రాధాన్యం
ఈ క్షేత్రం గురించి అష్టాదశ పురాణాలలో ఒకటైన స్కంద పురాణంలో కూడా పేర్కొనబడింది.

యాదగిరి గుట్ట దేవాలయం

యాదగిరి గుట్ట దేవాలయం

సుదర్శన చక్రం
దేవాలయ గర్భ గృహం పై భాగంలో విష్ణు మూర్తి యొక్క మూడు అడుగుల వ్యాసం కల బంగారు సుదర్శన చక్రం నిర్మించబడినది. ఈ చక్రాన్ని సుమారు ఆరు కి. మీ. ల దూరం నుండి కూడా చూడవచ్చు. పూర్వ కాలంలో ఈ సుదర్శన చక్రం భక్తులు వచ్చే వైపు తిరిగి వారికి మార్గం చూపేదని చెపుతారు.

Photo courtesy: Arkrishna

యాదగిరి గుట్ట దేవాలయం

యాదగిరి గుట్ట దేవాలయం

ఆరాధనా క్షేత్రం
శ్రీ నరసింహ స్వామి ని ఋషులు సైతం పూజించేవారని చెపుతారు. ఈ యాదగిరి గుట్ట ఋషుల యొక్క ఆరాధనా క్షేత్రం అని పేర్కొంటారు.

Photo Courtesy: Randhirreddy

యాదగిరి గుట్ట దేవాలయం - లడ్డు ప్రసాదం

యాదగిరి గుట్ట దేవాలయం - లడ్డు ప్రసాదం

వైద్య నరసింహుడు
దైవం నరసింహ స్వామి నమ్మిన వారికి అనేక వ్యాధులు నయం చేస్తాడని, తమను క్షుద్ర శక్తుల బారి నుండి కాపాడుతాడని ఇక్కడకు వచ్చే భక్తులు గట్టిగా నమ్ముతారు.

Photo courtesy: Randhirreddy

యాదగిరి గుట్ట దేవాలయం - దూర దృశ్యం

యాదగిరి గుట్ట దేవాలయం - దూర దృశ్యం

ఈ దేవాలయంలో భక్తులు తమ వ్యాధులు, బాధలు నయం చేసుకునేందుకు మండల ప్రదక్షిణాలు (40 రోజులు) ప్రధానంగా చేస్తారు. నరసింహస్వామి తన భక్తులకు కలలో కనపడి మంత్రోపదేశం కూడా చేస్తాడని చెపుతారు. ఈ దేవాలయ పూజలు పంచ రాత్ర ఆగమం మేరకు నిర్వహిస్తారు.

యాదగిరి గుట్ట దేవాలయం - దూర దృశ్యం

యాదగిరి గుట్ట దేవాలయం - దూర దృశ్యం

యాదగిరి గుట్ట ఎలా చేరాలి ?
యాదగిరి గుట్ట కు రైలు మరియు రోడ్డు మార్గాలు కలవు. హైదరాబాద్ , సికింద్రాబాద్ మరియు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలనుండి తరచుగా బస్సు లు నడుస్తాయి. సమీప రైలు స్టేషన్ ఇక్కడకు 3 కి. మీ. ల దూరంలో కల రాయ గిరి లో కలదు. రాయ గిరి నుండి ఆటో రిక్షా లలో లేదా టాక్సీ లలో ఇక్కడకు చేరవచ్చు. సమీప విమానాశ్రయం హైదరాబాద్ లో కలదు.

Photo courtesy: Reddy_Bhagyaraj

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+