Search
  • Follow NativePlanet
Share
» »Year Ender 2023: ఈ ఏడాది గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ చేసిన ప్రాంతాలు...

Year Ender 2023: ఈ ఏడాది గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ చేసిన ప్రాంతాలు...

Year Ender 2023: మ‌రికొద్ది రోజుల్లో ఈ ఏడాది ముగుస్తుంది. 2023 సంవత్సరానికి వీడ్కోలు చెబుతూ, కొత్త ఏడాదిలోకి అడుగుపెడ‌తాం. కొత్త ఉత్సాహంతో, కొత్త తీర్మానాలతో కొత్త సంవత్సరాన్ని స్వాగతించేందుకు ప్రజలు పూర్తి స్థాయిలో సిద్ధమయ్యారు. ఇప్పుడు ఈ ఏడాది ముగియకముందే, ప్రతి ఒక్కరూ ఈ సంవత్సరాన్ని మరోసారి గుర్తు చేసుకోవాల‌నుకుంటున్నారు. ఏడాది చివ‌రి ప్ర‌యాణం చేసేందుకు ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. కానీ, ప్రయాణించే ముందు, ఉత్తమ గమ్యస్థానాలు తరచుగా ఇంటర్నెట్‌లో వెతుకుతుంటారు. ఈ క్రమంలో 2023లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన ప్రదేశాల జాబితాను గూగుల్ విడుదల చేసింది. ఈ సంవత్సరం శోధించిన టాప్-గమ్యస్థానాలేంటో చూసేద్దాం..ఇ

ఈ ఏడాది భారత్‌లో అత్యధికంగా సెర్చ్ చేసిన ట్రావెల్ గమ్యస్థానాల జాబితా కూడా వెల్లడైంది. ఈ జాబితాలో వియత్నాం, ప్రజల

మొదటి ఎంపికగా నిలుస్తోంది. అత్యధికంగా శోధించబడిన టాప్ గమ్యస్థానాలు, వాటి ప్ర‌త్యేక‌త‌ల గురించి తెలుసుకుందాం.

vietnam

వియత్నాం

2023 సంవత్సరంలో అత్యధికంగా శోధించిన ప్రదేశాల జాబితాలో వియత్నాం మొదటి స్థానంలో ఉంది. విదేశాలకు వెళ్లేందుకు ఇష్టపడే వ్యక్తులకు ఇది సరైన గమ్యస్థానమ‌నే చెప్పుకోవాలి. ప్రతి సంవత్సరం ఇక్క‌డికి ప్ర‌జ‌లు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. విశేషమేమిటంటే భారతీయులకు ఇక్కడ వీసా రహిత ప్రవేశం లభిస్తుంది. దీని కారణంగా ఇక్కడికి వెళ్లడం వారికి సులభమ‌వుతుంది. వియత్నాం వీధి ఆహారాలకు ఎంతో ప్ర‌సిద్ధిచెందిది. అంతేకాకుండా ఇక్క‌డి సంస్కృతి, ప్రకృతి సౌందర్యానికి ఈ ప్ర‌దేశం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది.

గోవా

భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం గోవా. ఈ ఏడాది గూగుల్ విడుద‌ల చేసిన జాబితాలో ఈ ప్ర‌దేశం రెండవ స్థానంలో నిలిచింది. ఈ ప్ర‌దేశానికి ఎక్కువ‌గా స్నేహితులు సంద‌ర్శిస్తుంటారు. ఇక్కడ అందమైన బీచ్‌లు ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యలో పర్యాటకులను ఆకర్షిస్తాయి. ప్రతి సంవత్సరం మాదిరిగానే, ఈ సంవత్సరం కూడా భారతదేశాన్ని సందర్శించడానికి ప్రజల మొదటి ఎంపిక ఇదే.

bali

బాలి

ప్రకృతి అందాలకు ఎంత‌గానో ప్ర‌సిద్ధిచెందింది బాలి. విదేశాలలో సందర్శించడానికి మరొక ప్రసిద్ధ ప్రదేశం ఇది. ఈ ప్ర‌దేశాన్ని దేవతల భూమిగా కూడా పరిగణిస్తారు. ఇక్కడి ప్రకృతి అందాలు సుదూర ప్రాంతాల ప్రజలను ఆకర్షిస్తాయి. ఇది 2023 సంవత్సరంలో గూగుల్‌లో అత్యధికంగా శోధించబడిన గ‌మ్య‌స్థానాల‌ల మూడ‌వ స్థానంలో నిలిచింది.

శ్రీలంక

శ్రీలంక ను 1972కు పూర్వం సిలోను అని పిలిచేవారు. భారతదేశ దక్షిణ తీరప్రాంతానికి 31 కిలోమీట‌ర్ల‌ దూరంలో ఉన్న ఈ దేశం దక్షిణ ఆసియాలో ఒక చిన్న ద్వీపం. హిందూ మహాసముద్రంలో ఆణిముత్యంగా ప్రసిద్ధి చెందింది. ఇక్క‌డి జనాభా సుమారుగా 2 కోట్లు. ఈ ప్ర‌దేశం ప‌ర్యాట‌కంగా ఎంతో ప్ర‌సిద్ధిచెందింది. పొరుగు దేశమైన‌ శ్రీలంక కూడా ఈ ఏడాది టాప్-4 సెర్చ్డ్ డెస్టినేషన్స్‌లో నిలిచి ప్ర‌సిద్ధిచెందిది. శ్రీ‌లంక కూడా దాని సహజ అందాలకు ప్రసిద్ధి చెందింది. ప్రతి సంవత్సరం ఇక్కడ సందర్శించడానికి చాలా మంది వస్తుంటారు.

thailand

థాయిలాండ్

అందమైన పచ్చటి అడవులు, బీచ్‌లు, షాపింగ్, ఆహారానికి ప్రసిద్ధి చెందిన థాయ్‌లాండ్ ఈ సంవత్సరం గూగుల్‌లో అత్యధికంగా శోధించిన జాబితాలో ఐదో స్థానంలో నిలిచింది. దీని అందం కారణంగా, ఈ ప్రదేశం ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యలో పర్యాటకులను ఆకర్షిస్తుంది. థాయిలాండ్‌లో సందర్శించడానికి చాలా ప్రదేశాలు ఉన్నాయి, వాటిలో ఫుకెట్, కో ఫై ఫై, కరావి వంటి ప్రదేశాలు చాలా ప్రసిద్ధి చెందాయి.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+