Search
  • Follow NativePlanet
Share
» »ఎన్నో ఆకర్షణల ఏలగిరి హిల్ స్టేషన్ !

ఎన్నో ఆకర్షణల ఏలగిరి హిల్ స్టేషన్ !

ఏలగిరి హిల్ స్టేషన్ గురించి చాలా మందికి తెలియదు. ఈ హిల్ స్టేషన్ ఊటీ లేదా కొడైకెనాల్ లకు ఏమంత తీసిపోదు. ఈ చిన్న హిల్ స్టేషన్ తమిళనాడు లోని వెల్లూరు జిల్లాలో కలదు. ఏలగిరి ఒక జమిందారు ప్రైవేటు ఆస్తి. అయినప్పటికీ భారత ప్రభుత్వం దీనిని 1950 లలో స్వాధీనం చేసుకొంది. అటవీ తెగలు నివసించే సుమారు 14 గ్రామాలు ఇక్కడ కలవు. ట్రెక్కింగ్ కు అద్భుత ప్రదేశం.

సంవత్సరం పొడవునా సందర్శకులు

సంవత్సరం పొడవునా సందర్శకులు

ఎలా చేరాలి ?
బెంగుళూరు నుండి ఏలగిరి 150 కి. మీ. ల దూరం మాత్రమే. చెన్నై నుండి 250 కి. మీ. లు. బెంగుళూరు - హోసూర్ - క్రిష్ణగిరి ల మీదుగా సుమారు మూడు గంటల రోడ్డు ప్రయాణంలో ఏలగిరి చేరుకోవచ్చు.
Photo Courtesy: Ashwin Kumar

సంవత్సరం పొడవునా సందర్శకులు

సంవత్సరం పొడవునా సందర్శకులు

హెయిర్ పిన్ బెండ్స్
ఏలగిరి చేరాలంటే ఒళ్ళు గగుర్పొడిచే అతి సన్నని 14 వంపులు మీ వాహనం తిరగాలి. వీటికి తమిళ్ కవులు పేర్లు పెట్టారు. మధ్యలో కార్ పార్కింగ్ కూడా కష్టంగా వుంటుంది. మార్గంలో కోతులు, ఎద్దులు, మేకలు వంటి జంతువులను చూడవచ్చు. ఈ ప్రయాణంలో మీరు తప్పక బైనాక్యులర్ లు ఉంచుకోండి. పూర్తిగా ఆనందించవచ్చు.

Photo Courtesy: Team958

సంవత్సరం పొడవునా సందర్శకులు

సంవత్సరం పొడవునా సందర్శకులు

గుర్తుంచుకోండి
మార్గంలో పెట్రోల్ బంక్ లు అధికంగా లేవు. కనుక వాహనంలో పెట్రోల్ పూర్తిగా వుంచండి. ఒక స్పేర్ తయరు, టూల్ కిట్ కూడా అవసరం. ఒక ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కూడా వుంచండి. ఎలగిరిలో ప్రభుత్వ హెల్త్ కేర్ సెంటర్ మరియు ప్రైవేటు క్లినిక్ కలవు.

Photo Courtesy: Rob Deutscher

సంవత్సరం పొడవునా సందర్శకులు

సంవత్సరం పొడవునా సందర్శకులు

స్వామీ మలై
స్వామీ మలై ఒక ఎత్తైన శిఖరం. దిగువన ఒక చిన్న గ్రామం కలదు. శిఖరం పైకి ఎక్కటం తేలికగానే వుంటుంది.

Photo Courtesy: Vijay

సంవత్సరం పొడవునా సందర్శకులు

సంవత్సరం పొడవునా సందర్శకులు

జలగంపరాయ్ వాటర్ ఫాల్స్
ఏలగిరి కొండ దిగువ భాగంలో సుమారు 5 కి. మీ. ల దూరంలో జలగంపరాయ్ జలపాతాలు కలవు. వెళ్ళటం కష్టం. అయినప్పటికీ వెళ్లి ఆనందించగల ప్రదేశం. ఈ జలపాతాలు వర్షాధార జలపాతాలు.

Photo Courtesy: cprogrammer

సంవత్సరం పొడవునా సందర్శకులు

సంవత్సరం పొడవునా సందర్శకులు

పున్గనూర్ లేక్
ఏలగిరి లో పున్గానూర్ లేక్ ఒక ప్రసిద్ధ ఆకర్షణ. ఇది ఒక కృత్రిమ సరస్సు. ఇందులో బోటు విహారం చేయవచ్చు. వివిధ పక్షులను చూడవచ్చు. ఇక్కడ పక్షులను చూసేందుకు ఒక చిన్న టవర్ కూడా నిర్మించారు.
Photo Courtesy: Sayowais

సంవత్సరం పొడవునా సందర్శకులు

సంవత్సరం పొడవునా సందర్శకులు

అబ్సర్వేటరీ
వయను బప్పు సోలార్ అబ్సర్వేటరీ సరిగ్గా 12 వ మలుపు లో కలదు. ఇది ఒక పెద్ద అబ్సర్వేటరీ. చూడాలంటే, ముందస్తు అనుమతులు కావాలి.
Photo Courtesy: Ashwin Kumar

సంవత్సరం పొడవునా సందర్శకులు

సంవత్సరం పొడవునా సందర్శకులు

షాపింగ్ మరియు ఈటింగ్
ఇక్కడ షాపింగ్ చేసేందుకు పెద్దగా ఏమీ లేదు. ఏలగిరి తేనె, పనసపండు లకు ప్రసిద్ధి. స్థానిక ఆహారాలు అందుబాటులో వుంటాయి.
Photo Courtesy: McKay Savage

ఏలగిరి మరిన్ని ఆకర్షణలు

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+