Search
  • Follow NativePlanet
Share
» »మూడువేల రూపాయ‌ల‌కే షిరిడిని ద‌ర్శించొచ్చు..

మూడువేల రూపాయ‌ల‌కే షిరిడిని ద‌ర్శించొచ్చు..

మూడువేల రూపాయ‌ల‌కే షిరిడిని ద‌ర్శించొచ్చు..

ఎండ‌లు మండిపోతున్నాయి. చాలామంది ఈ వేస‌విలో చ‌ల్ల‌ని ప్రాంతాల‌కు వెళ్లాల‌నుకుంటారు. మ‌రికొంద‌రు హిల్‌స్టేష‌న్‌ల‌కు వెళ్లాల‌నుకుంటారు. కొంద‌రు ఆధ్యాత్మిక ప‌ర్య‌ట‌న‌కు వెళ్లాల‌ని అనుకుంటున్నారు. ఈ సెల‌వుల్లో చాలామంది పుణ్యక్షేత్రాల‌ను చూడాల‌నుకుంటున్నారు. భార‌త‌దేశంలో ఆధ్యాత్మిక ప్రాంతాల‌కు కొద‌వే లేదు. ఎక్క‌డ‌చూసినా మ‌న‌కు పుణ్య‌క్షేత్రాలు తార‌స‌ప‌డ‌తాయి.

వాటిని సంద‌ర్శించేందుకు భ‌క్తులు కూడా త‌ర‌లివ‌స్తుంటారు. అలాంటివారికోసం ర‌క‌ర‌కాల ప్యాకేజీలు కూడా అందుబాటులో ఉన్నాయి. అలాంటి ప్యాకేజీనే తెలంగాణ టూరిజం ప‌ర్యాట‌కుల‌కు అందిస్తుంది. షిరిడి, శ‌నిశింగ‌ణాపూర్ వంటి పుణ్యక్షేత్రాల‌ను చూసేందుకు ప‌ర్యాట‌కుల‌కు మ‌రో అవ‌కాశం ఇస్తుంది. Shirdi Ellora Tour పేరుతో టూర్‌ను ఆప‌రేట్ చేస్తోంది.

dilsukhnagar1

షిరిడీ ఎల్లోరా టూర్ పేరుతో తెలంగాణ‌ టూరిజం ఈ టూర్‌ ప్యాకేజీని అందిస్తోంది. ప్రతి బుధవారం, శుక్రవారం హైదరాబాద్ నుంచి ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. ఈ టూర్ ప్యాకేజీలో షిరిడీ ఆలయం, శని శింగణాపూర్ లాంటి అధ్యాత్మిక ప్రాంతాలతో పాటు ఎల్లోరా గుహలు ఘృష్ణేశ్వర్ (జ్యోతిర్లింగ), ఔరంగాబాద్ మినీ తాజ్ మహల్ ల‌ను సందర్శించవచ్చు. ఈ ప్యాకేజీ మూడు రాత్రులు, నాలుగు రోజులు కొనసాగుతుంది. బ‌స్సు మార్గంలో ఈ టూర్‌కు బ‌య‌లుదేరొచ్చు.

షిరిడీ ఎల్లోరా టూర్ ప్రయాణం ఇలా..

మొదటి రోజు హైద‌రాబాద్‌లో టూర్ దిల్‌సుఖ్‌న‌గ‌ర్ సాయిబాబా టెంపుల్ నుండి ప్రారంభం అవుతుంది. సాయిబాబా టెంపుల్ నుండి మధ్యాహ్నం మూడు గంటలకు బ‌స్సు బయలుదేరుతుంది. తిరిగి బషీర్‌బాగ్‌లో సాయంత్రం నాలుగు గంటలకు యాత్రి నివాస్, సర్దార్ పటేల్ రోడ్, ప్యారడైజ్ సర్కిల్ నుంచి మ‌ళ్లీ నాలుగు న‌ల‌భై ఐదుకు, పర్యాటక్ భవన్, బేగంపేట్ నుంచి సాయంత్రం ఐదు గంటలకు, కేపీహెచ్‌బీ విఆర్‌కె సిల్క్స్ నుంచి సాయంత్రం ఐదు న‌ల‌భైఐదు గంట‌ల‌కు, చందానగర్ నుంచి సాయంత్రం ఆరు గంట‌ల‌కు ఈ బ‌స్సు బయలుదేరుతుంది. రాత్రంతా జ‌ర్నీ ఉంటుంది. రెండో రోజు ఉదయం శ‌నిశింగ‌ణాపూర్ చేరుకుంటారు.

shirdi1

శ‌నిశింగ‌ణాపూర్‌లో శ‌ని దేవుని ద‌ర్శ‌నాంత‌రం షిరిడీకి బ‌య‌లుదేరుతారు. అక్క‌డినుండి తిరిగి మ‌ళ్లీ మీ బ‌స్సు జ‌ర్నీ మొద‌లుపెట్టండి. అనంతరం షిరిడీ ఆలయం దర్శనం ప‌ర్యాట‌కుల సొంత ఖ‌ర్చుల‌తోనే ఉంటుంది. భోజనం త‌ర్వాత రాత్రి షిరిడీలోనే బస ఉంటుంది. మూడో రోజు ఉదయం తెల్లవారుజామున మూడు గంటలకు షిరిడీ నుంచి ఎల్లోరా గుహలకు బయలుదేరుతారు. అనంత‌రం ఘృష్ణేశ్వర్ జ్యోతిర్లింగ, ఔరంగాబాద్ మినీ తాజ్ మహల్‌ను సందర్శిస్తారు. తిరుగు ప్రయాణంలో ఔరంగాబాద్ మీదుగా తిరిగి హైదరాబాద్‌కు ప్రయాణం అవుతారు. నాలుగోరోజు తెల్లవారుజామున ఉదయం ఆరు గంటలకు హైద‌రాబాద్‌ చేరుకుంటారు. దీంతో షిరిడి ప్ర‌యాణం ముగుస్తుంది.

హైదరాబాద్ టూ షిరిడీ ఎల్లోరా టూర్ ప్యాకేజీ ధ‌ర

ఎసి బస్ ప్యాకేజీ అయితే పెద్దలకు రూ.3550, ఐదు నుంచి ప‌న్నెండు సంవ‌త్స‌రాల పిల్ల‌ల‌క‌యితే రూ.2890 చెల్లించాల్సి ఉంటుంది. అదే నాన్ ఎసి బస్ అయితే పెద్దలకు రూ.3100, పిల్లలకు రూ.2530 చెల్లించాల్సి ఉంటుంది. ఇక టూర్ ప్యాకేజీలో బ‌స్సు టికెట్లు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్ని అందులోనే క‌లుస్తాయి. రవాణా, వసతి ఖ‌ర్చులు ప్యాకేజీలో చేర్చబడింది. ఆహారం, దర్శనం, ఇతర ఖర్చులు పర్యాటకులే భరించాల్సిందే.

More News

    Read more about: hyderabad dilsukhnagar
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+