భారతదేశంలో రైలు ప్రయాణాలు చేసేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఇక, ఇటీవలే కాలంలో ఆధునాతన టెక్నాలజీ కూడిన ట్రైన్స్ ప్రయాణికులకు అందుబాటులో వస్తున్నాయి. అందులో ముఖ్యంగా తక్కువ సమయంలోనే ప్రయాణికుల గమ్యస్థానాలను వందేభారత్ లాంటివి. సెమీ వందేభారత్, స్లీపర్ వందేభారత్ ఎక్సప్రెస్, బుల్లెట్ ట్రైన్ ఇలాంటివెన్నో ఉన్నాయి. ఇప్పడు కొత్తగా ఎయిర్ ట్రైన్ సర్వీసు తర్వలోనే పట్టాలపై పరుగులుపెట్టేందుకు సిద్ధమవుతోంది. దేశంలోనే మొట్టమొదటి ఎయిర్ ట్రైన్ సర్వీస్ త్వరలో ప్రారంభం కానుంది. ఇక, ఈ ట్రైన్ ప్రత్యేకతలేంటేంటే.. డ్రైవర్ లేకుండానే ఈ ట్రైన్ ప్రయాణిస్తోంది. అంతేకాదండోయ్.. ఈ ట్రైన్‌లో ప్రయాణించాలాంటే డబ్బులు చెల్లించక్కర్లేదు. ఉచితంగానే ప్రయాణం చేయొచ్చు.
2027 నాటికి...
ఈ ఎయిర్ ట్రైన్ గానీ ప్రయాణికులకు అందుబాటులోకి వస్తే మాత్రం వారి ప్రయాణాలు మరింత సులభంగా సాగుతాయి. ఈ ఎయిర్ ట్రైన్ సర్వీసు ఎప్పుడు ప్రారంభిస్తారో వంటి విషయాలు తెలుసుకుందాం పదండి. ఈ ఎయిర్ ట్రైన్‌ను దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లో ఏర్పాటు చేయనున్నారు. 2027 నాటికి ఈ ఎయిర్ ట్రైన్‌ను వినియోగంలోకి తీసుకువచ్చేందుకు అధికారులు సన్నాహాలు చేపడుతున్నారు. ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ మన దేశంలోనే అత్యంత రద్దీ అయిన విమానాశ్రయం. ఈ ఎయిర్‌పోర్టులో ప్రతి సంవత్సరం సుమారు 7కోట్లకు పైగా ప్రయాణికులు తమ రాకపోకలు చేస్తుంటారు. ఎక్కువశాతం ఈ విమానాశ్రయంలోని టెర్మినల్ 1, టెర్మినల్ 2, టెర్మినల్ 3 మధ్య ప్రయాణిస్తుంటారు.

రూ.2 వేల కోట్లతో...
ఈ విమానాశ్రయంలో విమానం దిగిన ప్రయాణికులు బయటికి వచ్చేందుకు బస్సు సర్వీసులను ఉపయోగించాలి. అయితే, ప్రయాణికులు ఒక టెర్మినల్ నుంచి మరో టెర్మినల్‌కు వెళ్లేందుకు చాలా సమయం పడుతోంది. ఈ క్రమంలోనే విమానశ్రయంలోని 3 టెర్మినల్స్ మధ్య మొత్తం 7.7 కిలోమీటర్ల పొడవున ఈ ఎయిర్ ట్రైన్ సిస్టమ్‌ను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ విమానాశ్రయంలోని 3 టెర్మినళ్ల మధ్య ప్రయాణికుల ప్రయాణం సులభతరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మొత్తం రూ.2 వేల కోట్లతో ఈ ఎయిర్ ట్రైన్‌ను ప్రయాణికుల కోసం అందుబాటులోకి తీసుకరానున్నారు. ఈ ఎయిర్ ట్రైన్‌ను ఆటోమేటెడ్ పీపుల్ మూవర్ అని కూడా అంటారు.
ఎయిర్ ట్రైన్ ప్రత్యేకతలు..
ఈ ఎయిర్ ట్రైన్ పరిమిత సంఖ్యలో కంపార్ట్‌మెంట్‌లను కలిగి ఉంటుంది. ఎయిర్ ట్రైన్ చూసేందుక మెట్రో ట్రైన్ మాదిరిగానే ఉంటుంది. కానీ ఈ ట్రైన్ డ్రైవర్ అవసరం లేకుండానే ప్రయాణం చేస్తుంది. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి సులువుగా, వేగంగా ప్రయాణం చేసేందుకు ఈ ఎయిర్ ట్రైన్ ఉపయోగపడుతుంది. ఢిల్లీ విమానశ్రయంలోని ఇతర టెర్మినళ్లు, పార్కింగ్, క్యాబ్ పికప్ పాయింట్లు, హోటళ్లు వంటి వాటిని చేరుకునేందుకు ఈ ఎయిర్ ట్రైన్‌ను నడపనున్నారు. ఇందులో ఫ్రీగానే ప్రయాణించొచ్చు.



Click it and Unblock the Notifications













