Search
  • Follow NativePlanet
Share
» »తెలంగాణలోని ఈ జ‌ల‌పాతాల స‌వ్వ‌డులను వినాల్సిందే..!

తెలంగాణలోని ఈ జ‌ల‌పాతాల స‌వ్వ‌డులను వినాల్సిందే..!

లంగాణలోని ఈ జ‌ల‌పాతాల స‌వ్వ‌డులను వినాల్సిందే..!

వ‌ర్షాకాలం రాబోతుంది. కుటుంబ‌స‌మేతంగా ప్ర‌కృతి ఒడిలో సేద‌తీరేందుకు విహారయాత్ర ప్లాన్ చేస్తున్నారా? అందుకోసం సుదూర ప్రాంతాల‌కు వెళ్ల‌న‌వ‌స‌రం లేదు. తెలంగాణలో ఉన్న ఈ నాలుగు మనోహరమైన జలపాతాలను అన్వేషించడానికి ఇదే సరైన సమయం. ఈ జ‌లపాతాలు దాగిన ప్ర‌దేశంలో వాతావరణం దాదాపు ఎల్లప్పుడూ శేఖర్ కమ్ముల సినిమాలోని సన్నివేశంలా ఉంటుంది. తెలంగాణలోని ఈ నాలుగు మనోహరమైన జలపాతాలకు ప్రతి ఒక్కరూ ఒక్కరోజులో ప‌ర్య‌ట‌న‌ను ప్లాన్‌చేసుకుంటే చాలు.

kuntalafalls1

కుంటాల జలపాతాలు

ఈ జలపాతం ఆదిలాబాద్ జిల్లా నేరేడికొండ ప్రాంతంలో కడం నదిపై ఉంది. ఇది 150 మీటర్ల ఎత్తు నుండి వస్తుంది. ఇది రాష్ట్రంలోనే ఎత్తైనది. జలపాతాల చుట్టూ దట్టమైన అడవి ఉండటంతో, అడ్వెంచర్ ప్రేమికుల‌కు ఇది గొప్ప హైకింగ్ ప్రదేశంగా ప్ర‌సిద్ధి చెందింది. ముఖ్యంగా నది ఉప్పొంగుతున్నప్పుడు ఈ ప్రదేశంలోని అద్భుతమైన దృశ్యాన్ని చూసేందుకు ప‌ర్యాట‌కులు త‌ర‌లివ‌స్తుంటారు. హైదరాబాద్ నుండి, ఇది దాదాపు 271 కిలోమీటర్ల దూరంలో ఉంది మరియు రోడ్డు మార్గంలో దాదాపు ఐదున్నర గంటల సమయం పడుతుంది. హైద‌రాబాద్ నగరం నుండి ఎమ్‌జిబిఎస్ మ‌రియు జెబిఎస్ నుండి బస్సులు అందుబాటులో ఉంటాయి. అంతేకాకుండా ఆటోలు, క్యాబ్‌లు కూడా అందుబాటులో ఉంటాయి.

bogatawaterfalls

బోగత జలపాతాలు

ములుగు జిల్లాలో చీకుపల్లి వాగుపై ఉన్న ఈ జ‌ల‌పాతం అత్యంత అందమైన జలపాతాలలో ఒకటి గా పేరు చెంద‌డ‌మే కాకుండా రాష్ట్రంలో రెండవ అతిపెద్ద జ‌ల‌పాతంగా ప్ర‌ఖ్యాతిగాంచింది. దాని పాదాల వద్ద ఉన్న నది మధ్యాహ్న సమయంలో ఈత కొట్టడానికి ఉత్తమమైన ప్రదేశాలలో ఒకటి. ఈ జలపాతాన్ని సందర్శించేందుకు మరియు వాహనాల‌ను పార్కింగ్‌చేసేందుకు ఇక్క‌డ ఛార్జీలు వ‌సూలు చేస్తారు. ఈ ప్రాంతం వాచ్ టవర్లను కూడా కలిగి ఉంది. కుటుంబంతో, స్నేహితుల‌తో క‌లిసి వెళ్లేందుకు ఈ ప్రాంతం ఎంతో అనువైన‌ది. పిల్ల‌లు ఆడుకునేందుకు స‌ర‌దాగా గ‌డిపేందుకు ఇక్క‌డ ప్ర‌త్యేకంగా పిల్లల పార్కు కూడా అందుబాటులో ఉంది. ఇది హైదరాబాద్ నుండి 329 కిలోమీటర్ల దూరంలో ఉంది. రైలు మార్గం ద్వారా , బ‌స్సు మార్గం ద్వారా ఈ ప్రాంతాన్ని చేరుకోవ‌చ్చు.

mallelatheertha1

మల్లెల తీర్థం

నాగర్ కర్నూల్ జిల్లాలో దట్టమైన నల్లమల అడవిలో ఉన్నఈ ప్రాంతం హైదరాబాద్ నుండి కేవలం 185 కిలోమీటర్ల దూరంలో ఉంది. రోడ్డు మార్గంలో ఈ ప్రాంతాన్ని చేరుకోవాలంటే సుమారు నాలుగు గంటల సమయం పడుతుంది. ఇక్కడ ఉన్న అడవిలో కృష్ణా నది కూడా ప్రవహిస్తుంది కాబట్టి ఈ చుట్టుప‌క్క‌ల కొన్ని అందమైన ప్రదేశాలు కూడా ఉన్నాయి. ఈ ప్రాంతంలోని జలపాతాలను సంద‌ర్శించాల‌నుకుంటే మాత్రం కొన్ని మెట్లు ఎక్కవలసి ఉంటుంది. ఇది సాయంత్రం ఐదు గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటుంది.

ముత్యాల జలపాతం

ఈ జలపాతం ఇటీవలి కాలంలోనే ప్రసిద్ధి చెందింది. దీనిని ముత్యాల ధార మరియు వీరబద్రం జలపాతాలు అని కూడా పిలుస్తారు. ఇది జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉంది. అందమైన ఎత్తైన కొండపై నుండి ఈ జ‌ల‌పాతం వ‌స్తుంది. ఈ ప్రాంతంలో ఈదురు గాలుల కారణంగా, పొడవాటి జలపాతం కంటికి పొడవాటి పాములా ప‌ర్యాట‌కుల‌ను క‌నువిందు చేస్తుంది. ఇది బొగత జలపాతానికి చాలా సమీపంలో ఉంది.

More News

    Read more about: kuntala falls bogata falls
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+