Search
  • Follow NativePlanet
Share
» »వ‌ర్షాకాలంలో క‌ర్ణాట‌క‌లోని జోగ్ జ‌ల‌పాత‌పు అందాల‌ను చూడాల్సిందే..!

వ‌ర్షాకాలంలో క‌ర్ణాట‌క‌లోని జోగ్ జ‌ల‌పాత‌పు అందాల‌ను చూడాల్సిందే..!

చాలామంది ప‌ర్యాట‌కులు వ‌ర్షాకాలంలో అంద‌మైన జ‌ల‌పాతాల‌ను వీక్షించేందుకు విదేశీ ప‌ర్య‌ట‌న చేస్తుంటారు. కానీ, భార‌త్‌లో కూడా అటువంటి అంద‌మైన ప్ర‌దేశాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా దక్షిణాది రాష్టాలలో అంద‌మైన జ‌ల‌పాతాలు ప‌ర్యాట‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటాయి. అందులో ఒక‌టే క‌ర్ణాట‌క‌లోని జోగ్ జ‌ల‌పాతం. ఈ జ‌ల‌పాత‌పు అందాలు వ‌ర్షాకాలంలో మ‌రింత రెట్టిప‌వుతాయి. ఇక్కడి ప్ర‌కృతి అందాలు విదేశాల‌ను త‌ల‌పిస్తుంటాయి. జోగ్ జలపాతం ప్రత్యేకతలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం ప‌దండి..

ప‌చ్చ‌ని అందాలు..

జోగ్ జలపాతం కర్ణాటకలోని షిమోగా జిల్లాలో ఉన్న ప్రసిద్ధ పర్యాటక ప్రాంతంగా పేరొందింది. ఈ జలపాతం నుంచి పడే నీరు చాలా ప‌ర్యాట‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. ఈ జలపాతం స్థానిక షరావతి నదిలో కలుస్తుంది. ఈ జలపాతం త‌న ప్ర‌కృతి అందాల‌తో పర్యాటకులకు సాద‌ర ఆహ్వానం ప‌లుకుతోంది. దీని అందాల‌ను ప్ర‌త్యక్షంగా వీక్షించేందుకు పక్క రాష్ట్రాల నుంచి కూడా ప్ర‌జ‌లు భారీ ఎత్తున త‌ర‌లి వ‌స్తుంటారు. కుటుంబ‌స‌భ్యులు, కొత్త జంట‌లు, స్నేహితులు అధిక సంఖ్యలో ఇక్క‌డికి వ‌స్తుంటారు. జోగ్ వాటర్ ఫాల్స్ అందాల‌ను త‌మ త‌మ కెమెరాల్లో బందిస్తుంటారు. అంతేకాదు, సెల్పీ పాయింట్ ద‌గ్గ‌ర తెగ ఫోజులు ఇచ్చేస్తుంటారు. వర్షకాలంలో ఇక్కడికి వచ్చే ప‌ర్యాట‌కుల సంఖ్య కాస్త పెరుగుతుంది. ఇక్క‌డ జోగ్ వాట‌ర్‌ఫాల్స్ చాలా ఎత్తు నుంచి నీరు కిందకు పడుతుంది. పైకి నీటి తుంపర్లుగా లేచి తగులుతుంది. ఈ వాట‌ర్‌లో ప‌ర్యాట‌కులు స్నానాలు ఆచ‌రిస్తుంటారు.

jog falls monsoon

అనేక ప‌ర్యాట‌క ప్ర‌దేశాలు..

ఇక్క‌డ కేవ‌లం వాట‌ర్ ఫాల్ మాత్ర‌మ కాకుండా ఇక్క‌డి పర్వతాలు పచ్చదనంతో నిత్యం కళకళలాడుతుంటాయి. ఈ పచ్చదనం జలపాతానికి మ‌రింత అందాన్ని చేకూరుస్తుంది. వర్షాకాలంలో ఈ జలపాతం సహజ సౌందర్యం మరింత పెరగడానికి ఇక్క‌డి పచ్చదనమే ప్రధాన కారణం.. ఇక్క‌డ కేవ‌లం జోగ్ జలపాతం మాత్ర‌మే కాకుండా చుట్టు ఉన్న ఇత‌ర ప‌ర్యాట‌క ప్ర‌దేశాల‌ను కూడా చూసి ఆనందివ‌చ్చు. ఇక్కడ అనేక ఇతర పర్యాటక ప్రదేశాలు కూడా ప‌ర్యాట‌కులను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటున్నాయి. జోగ్ జలపాతానికే సమీపంలోనే డబ్బే జలపాతం, లింగన్మక్కి ఆనకట్ట, తుంగ ఆనికట్ డ్యామ్ వంటివెన్నో ఉన్నాయి. వీటితో పాటు జలపాతం చుట్టూ వెజ్, నాన్‌వెజ్ ఫుడ్‌ని అందించే అనేక హోట‌ల్స్ రెస్టారెంట్లు కూడా ప‌ర్యాట‌కుల‌కు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి కుటుంబంతో కలిసి పర్యటించేందుకు ఈ వాట‌ర్ ఫాల్ ఎంతో అనువైన‌ద‌ని చెప్పుకోవ‌చ్చు.

వర్షకాలంలో ఈ జలపాతానికి నీరు అధికంగా ఉంటుంది. గ‌త కొన్నిరోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు లింగనమక్కి జలాశయం నుంచి నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో జోగ్ జలపాతం అందం మ‌రింత రెట్టింప‌య్యింది.

jog falls at full glory

రెండు తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌లు..

ఈ జ‌ల‌పాత‌పు అందాల‌ను వీక్షించేందుకు ఒక్క క‌ర్ణాట‌క రాష్ట్రం నుంచే కాకుండా రెండు తెలుగురాష్ట్రాల ప్ర‌జ‌లు కూడా త‌ర‌లి వెళ్తున్నారు. ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా జోగ్ జ‌ల‌పాతం అందాల‌ను చూసేందుకు ఎక్కువ ఆసక్తి క‌న‌బ‌రుస్తున్నారు.

వృద్ధుల నుంచి పిల్లల వరకు ఇక్క‌డి అందాల‌ను వీక్షించేందుకు తపిస్తున్నారు. నీరు పై నుంచి కిందకు పడుతున్న క్షణాలను చూడటం ఎంతో ఆనందాన్ని కలిగించే దృశ్యాల‌ను చూసేందుకు త‌ర‌లివెళ్తున్నారు. చాలా మంది కొత్త జంటలు కూడా జోగ్ జలపాతం అందాలు చూసేందుకు ఎంతో ఇష్టంగా వస్తుంటారు. మీ ప్రేమ‌సి, కాబోయే వారితో అంద‌మైన ప్ర‌దేశంలో కాసేపు స‌ర‌దాగా గ‌డ‌పాల‌నుకుంటే మాత్రం త‌ప్ప‌కుండా ఇక్క‌డ‌కు రావాల్సిందే..!

More News

    Read more about: monsoon tour jog falls karnataka
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+