అన్జెంగో కోటను పోర్చుగీసు వారు 1695 లో నిర్మించారు. ఇది అన్జెంగో అనే ప్రదేశంలో కలదు. ఈ ప్రదేశం సముద్రానికి , బాక్ వాటర్స్ కి మధ్యన కలదు. ఇది వర్కాలకు 15 కి.మీ. దూరంలో ఉంటుంది. ఈ కోటకు చారిత్రక ప్రాధాన్యత కలదు. మొదట్లో ఇందులో సరకులు ఉంచేవారు. తర్వాత, బ్రిటిష్ వారు దీనిని స్వాధీనం చేసుకొని, తమ మిలిటరీ అవసరాలకు వినియోగించారు. ఈ కోటలో కొన్ని సమాధులు కూడా కలవు. ప్రాచీన సమాధి 1704 నాటిది. కోట ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం అయిదు గంటల వరకు తెరచి ఉంటుంది. ఆదివారాలు మరియు పబ్లిక్ సెలవులకు తప్ప మిగతా దినములలో తెరచి ఉంటుంది. కోట చుట్టూ ముతలిపుజ్జ సరస్సు ప్రవహిస్తూ పర్యాటకులకు చక్కటి ప్రశాంతమైన ధ్యానానికి అనుకూలంగా వుంటుంది.



Click it and Unblock the Notifications