శ్రీపురం స్వర్ణ దేవాలయం వెల్లూర్ లో మలైకోడి ప్రదేశంలో నిర్మించారు మరియు ఒక ప్రసిద్ధ ఆధ్యాత్మిక ప్రదేశంలో ఉంది. శ్రీనారాయణి అమ్మ ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయం లోపల,బయట రెండు వైపులా బంగారం పూత తో మహాలక్ష్మి గుడి ఉంది. శ్రీపురం స్వర్ణ దేవాలయంలో చేతితో తయారు చేసిన బంగారు షీట్ లు 9-15 పొరలు ఉన్నాయి,మరియు చేతితో రాసిన శాసనాలు ఎంతో ఘనంగా అలంకరించబడ్డాయి.ఈ ఆలయంలో శాసనాలు, కళ వేదాలు ప్రాధాన్యతను కలిగి ఉన్నాయి. సందర్శకులు తప్పనిసరిగా దుస్తుల కోడ్ ను పాటించాలి.
శ్రీపురం స్వర్ణ దేవాలయం సందర్శనార్ధం వచ్చే పర్యాటకులు చిన్న ప్యాంట్లు, మిడ్డి లు మరియు కేప్రిలు వేసుకొని రాకూడదు. అలాగే మొబైల్ ఫోన్లు, కెమెరాలు మరియు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు, పొగాకు, మద్యం మరియు మండే వస్తువులను వంటివి ఖచ్చితంగా నిషేధించబడ్డాయి. భక్తులు సంవత్సరంలో 365 రోజులు ఉదయం 8 నుండి సాయంత్రం 8 వరకు శ్రీపురం స్వర్ణ దేవాలయంను సందర్శించవచ్చు. ఆలయం వద్ద అభిషేకం ఉదయం 4 గంటల నుండి 8 గంటల వరకు,ఆరతి సేవ సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల వరకు నిర్వహిస్తారు.



Click it and Unblock the Notifications