Search
  • Follow NativePlanet
Share

వార్ధ - పత్తి వాణిజ్య కేంద్రం

13

మహారాష్ట్ర లో ని వార్ధ జిల్లా ను 1866 లో స్థాపి౦చారు. ఈ జిల్లా లోని వార్ధ నగరంలో అదే పేరు గల నది ప్రవహించడం వలన నగరానికి కూడా అదే పేరు వచ్చింది. ఈ ప్రదేశం 6310 కిలోమీటర్ల విస్తీర్ణములో వ్యాపించి ఉంది.

చరిత్రలో గాంధీగారి శకం లో విశిష్టత పొందిన వార్ధ ప్రస్తుతం ఒక ప్రముఖ పత్తి వాణిజ్య కేంద్రంగా ప్రసిద్ధి చెందింది .

వార్ధ చరిత్ర

చాళుక్యులు, మౌర్యులు, రాజపుత్రులు, శాతవాహనులు వంటి గొప్ప రాజులు పాలించిన రాజ్యాలలో భాగమై వార్ధ విస్తారమైన చరిత్ర ను కల్గిఉంది.

వార్ధ మొదటగా 1351 లో బహమనీ రాజుల పాలన లో ఉంది. బహమనీ రాజ్యం విచ్చిన్నం కాగా 1518 లో ఇమాద్ షాహీ పాలకుల చేతికి వచ్చింది. ముఘల్ వంశస్థుల దాడుల అనంతరం వార్ధ చివరకు బ్రిటీషు పాలన క్రింద చేరింది. గాంధీజీ ఆశ్రమం గల ప్రాంతం గా వార్ధ భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ఒక ముఖ్య పాత్రను పోషించింది.

వార్ధ లోని పర్యాటక ఆకర్షణలు

గీతా మందిరం, లక్ష్మీనారాయణ మందిరం, మహాకాళి మందిరం, కేల్జేర్ మందిరం తో బాటుగా అనేక దేవాలయాలతో వార్ధ ప్రసిద్ధి పొందింది .

చారిత్రిక పౌనార్ గ్రామంలో గల విశ్వ శాంతి స్తూపం, పరంధామ ఆశ్రమం, గాంధీజీ ఆశ్రమం, బాపు కుటీరం, వార్ధ లోని సంగ్రహాలయ మ్యూజియం వంటి ఆకర్షణీయ ప్రదేశాల వల్ల ఈ ప్రాంతం యాత్రా విశేషంగా మారింది.

వార్ధలో దాదాపు అన్ని కాలాల్లోను అనుకూల వాతావరణం ఉంటుంది. వేసవి భరించలేని వేడిని కల్గి ఉన్నప్పటికీ చల్లగాలులతో శీతాకాలం ఆహ్లాదాన్ని కల్గిస్తుంది. వర్షా కాలం తర్వాత, శీతాకాలం అంతటా ఇక్కడి పర్యటనకు అనువుగా ఉంటుంది

విమానంలో వార్ధ రావాలంటే నాగపూర్ లోని డా. బాబాసాహెబ్ అంబేద్కర్ అంతర్జాతీయ విమానాశ్రయం దగ్గర మార్గం. అన్ని నగరాలు, పట్టణాల నుండి వార్ధ కు రైలుసౌకర్యం ఉంది. బస్సులు, ఇతర వాహన సదుపాయంతో రోడ్డు ప్రయాణం కూడా అనువుగానే ఉంటుంది .

వార్ధ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

వార్ధ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం వార్ధ

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? వార్ధ

  • రోడ్డు ప్రయాణం
    రైలు ద్వారా కొంకణ్ రైల్వే లైన్ లో వార్ధ ఒక ముఖ్యమైన, ప్రసిద్ధ రైల్వే స్టేషన్. ముంబై, పూనే, నాగపూర్ వంటి ప్రముఖ నగరాల నుండి అనేక రైళ్ళు ఉన్నాయి. ప్రయాణం సౌకర్యవంతంగా ఉండి, టికెట్ ధరలు అందుబాటులో ఉంటాయి. రైల్వే స్టేషన్ నుండి వార్ధ నగర కేంద్రానికి రిక్షాలు అందుబాటులో ఉంటాయి. రోడ్డు ద్వారా వార్ధ నుండి నాగపూర్, పూనే, ముంబై వంటి నగరాలకు అనేక ప్రభుత్వ, ప్రైవేట్ వాహనాలు ఉంటాయి. డీలక్స్, సెమీ-డీలక్స్, స్లీపర్, నాన్-స్లీపర్, ఏ/సి, నాన్ ఏ/సి వంటి బస్సులను బట్టి ధర ఉంటుంది. పూనే నుండి వార్ధకు చార్జీ షుమారు రూపాయలు 500 ఉంటుంది.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ద్వారా కొంకణ్ రైల్వే లైన్ లో వార్ధ ఒక ముఖ్యమైన, ప్రసిద్ధ రైల్వే స్టేషన్. ముంబై, పూనే, నాగపూర్ వంటి ప్రముఖ నగరాల నుండి అనేక రైళ్ళు ఉన్నాయి. ప్రయాణం సౌకర్యవంతంగా ఉండి, టికెట్ ధరలు అందుబాటులో ఉంటాయి. రైల్వే స్టేషన్ నుండి వార్ధ నగర కేంద్రానికి రిక్షాలు అందుబాటులో ఉంటాయి. రోడ్డు ద్వారా వార్ధ నుండి నాగపూర్, పూనే, ముంబై వంటి నగరాలకు అనేక ప్రభుత్వ, ప్రైవేట్ వాహనాలు ఉంటాయి. డీలక్స్, సెమీ-డీలక్స్, స్లీపర్, నాన్-స్లీపర్, ఏ/సి, నాన్ ఏ/సి వంటి బస్సులను బట్టి ధర ఉంటుంది. పూనే నుండి వార్ధకు చార్జీ షుమారు రూపాయలు 500 ఉంటుంది.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    వాయుమార్గం ద్వారా వార్ధా కు 74 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాగపూర్ లోని డాక్టర్. బాబాసాహెబ్ అంబేత్కర్ విమానాశ్రయం సమీప అంతర్జాతీయ విమానాశ్రయం. విమానం ద్వారా వార్ధ వచ్చే వారికి ఇది ఉత్తమమైన ఎంపిక. ఈ విమానాశ్రయం నించి ముంబైకి రోజూ అనేక విమానాలు ఉన్నాయి. విమానాశ్రయం నుండి వార్ధ చేరుకోవడానికి అద్దెకు టాక్సీలు దొరుకుతాయి. ఏ/సి టాక్సీ కాకపోతే ధర షుమారు కిలోమీటర్ కి 7 రూపాయలు ఉంటుంది. ముంబై లోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం, హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, నాందేడు విమానాశ్రయం ఎంచుకోదగిన ఇతర వాయుమర్గాలు.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
30 Mar,Mon
Check Out
31 Mar,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue

Near by City