వోఖలో మీరు క్రైస్తవ మూలాలను చూడాలనుకొంటే వోఖ పట్టణం నుండి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న వంఖోసంగ్ ను మీరు సందర్శించ వలసి ఉంటుంది.
పౌరాణిక టియి పర్వత పాదం పైన వోఖ పట్టణానికి ఉత్తరాన ఈ ప్రాంతం ఉంది. ఇక్కడ మీరు ధార్మిక క్యోన్ బాప్టిస్టు ఎఖుమఖో సంర్యుత్సు (కే బి ఇ ఎస్) చూడవచ్చు. మొదటి అమెరికా బాప్టిస్టు మిషన్ కార్యకలాపాలు ఈ ప్రదేశంలోనే 1923 లో ప్రారంభమవడం వలన ఇది వోఖ క్రైస్తవులకు ఎంతో ముఖ్యమైనది.
క్యోన్ బాప్టిస్టు ఎఖుమఖో సంర్యుత్సు వంఖోసంగ్ లో ఆరోగ్య పరిరక్షణ, ఈ ప్రాంతంలోని ప్రజల కోసం నిర్మిస్తున్న కళాశాల వంటి పనులతో బాటుగా అనేక కార్యక్రమాలను చేపట్టింది. వంఖోసంగ్ పర్వత శిఖరాలతో, లోయలతో, చుట్టూ పచ్చదనంతో నిండిన అందమైన ప్రదేశం. ఈ ప్రాంత సందర్శన ఇక్కడి ప్రజలతో మాట్లాడటానికి వారి జీవితం, సంస్కృతి, విశ్వాసాలను గురించి తెల్సుకోవడానికి ఒక అవకాశాన్ని కల్గిస్తుంది.



Click it and Unblock the Notifications