Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» యమునోత్రి

యమునోత్రి - యమునా నది పుట్టిన స్థలం !

20

యమునోత్రి అనే ప్రదేశం పవిత్ర యమునా నది పుట్టిన స్థలం. ఈ ప్రదేశం సముద్ర మట్టానికి 3293 మీ.ల ఎత్తులో బందర్ పూంచ్ పర్వతం పై కలదు. భౌగోళికంగా యమునా నది చంపసర్ గ్లేసియర్ నుండి పుడుతుంది. ఈ గ్లేసియర్ సముద్ర మట్టానికి 4421 మీ. ల ఎత్తున కలదు. ఈ గ్లేసియర్ యమునోత్రి నుండి ఒక కి. మీ.దూరంలో కలదు. ఇక్కడకు చేరటం చాలా కష్టతరం. ఈ ప్రదేశం ఇండియా -చైనా సరిహద్దు లో కలదు. యమునోత్రి వరకు ట్రెక్కింగ్ చేయాలంటే ఒక రోజు పడుతుంది. మార్గం అంతా అడవుల తో నిండిఎత్తు పల్లాలు గా వుంటుంది. ఈ పవిత్ర క్షేత్రాన్ని చేరేందుకు భక్తులు గుర్రాలు, కంచర గాడిదలు ఉపయోగిస్తారు.

ఈ ప్రాంతం ఉత్తరాఖండ్ లోని గర్హ్వాల్ డివిజన్ పాలన కిందకు వస్తుంది. హిందువులకు పవిత్రంగా చార్ ధాం గా చెప్పబడే నాలుగు పుణ్య క్షేత్రాలలో యమునోత్రి ఒకటి. ఇక్కడి ప్రధాన ఆకర్షణ యమునోత్రి టెంపుల్. ఈ టెంపుల్ లో మాత యమునోత్రి పూజించ బడుతుంది. జానకి చట్టి వద్ద కల వేడి నీటి బుగ్గలు కూడా ఈ ప్రాంతపు ప్రధాన ఆకర్షణలలో ఒకటి. వాటి లో సూర్య కుండ్ వేడి నీటి బుగ్గ ఒకటి. ఇక్కడ ప్రసాదం తయారు చేసేందుకు అవసరమైన రైస్ మరియు పొటాటో లు ఒక తెల్లటి గుడ్డలో పెట్టి ఈ వేడి నీటి బుగ్గ నుండి వచ్చే వేడి నీటి లో ఉడికిస్తారు.

యమునోత్రి సమీపంలో ఖర్సాలి అనేఒక చిన్న గ్రామం కలదు. ఇక్కడ అనేక జలపాతాలు,సహజ నీటి బుగ్గలు, ఒక పురాతన శివాలయం కలవు. ఇక్కడ ఒక పవిత్ర ఫలకం దివ్య శీల పేరుతో యమునోత్రి టెంపుల్ కు సమీంలో కలదు. భక్తులు ఈ యమునోత్రి టెంపుల్ కు వెళ్ళే ముందు ఈ దివ్య శిలను పూజిస్తారు. యమునోత్రి వెళ్ళే భక్తులు చాలామంది ధరసు నుండి 40 కి. మీ. ల దూరంలో కల బద్కోట్ వద్ద విశ్రాంతి తీసుకుంటారు. అందమైన ఆపిల్ తోటలతో పాటు, ఈ ప్రదేశంలో అనేక పురాతన టెంపుల్స్ కూడా కలవు. యమునోత్రి లో హనుమాన్ చట్టి మరొక ఆకర్షణ. ఇది ఒక ట్రెక్కింగ్ సైట్ కూడాను. యమునోత్రి విమానం పై వెళ్ళాలంటే టికెట్ లను డెహ్రాడూన్ లోని జాలీ గ్రాంట్ ఎయిర్ పోర్ట్ లో బుక్

చేసుకోవాలి. ఈ ప్రదేశానికి సమీప రైలు స్టేషన్ లు రిషికేష్ మరియు డెహ్రాడూన్. సమీప నగరాల నుండి యమునోత్రి కి బస్సు సర్వీస్ లు కూడా కలవు. హనుమాన్ చట్టి వరకు చేరటానికి టాక్సీ సర్వీస్ లు కలవు. అక్కడ నుండి యమునోత్రి కి ట్రెక్కింగ్ చేయాలి. యమునోత్రి లో వర్షాలు చాలా తక్కువ. వేసవులు ఏప్రిల్ నుండి జూలై వరకూ వుంటాయి. శీతాకాలం లో ఈ ప్రాంతం లో అధిక హిమపాతం వుంటుంది. ఉష్ణోగ్రతలు జీరో కంటే కూడా తక్కువగా పడి పోతాయి. యమునోత్రి సందర్శనకు మే - జూన్ మరియు సెప్టెంబర్ - నవంబర్ నెలలు అనుకూలమైనవి గా వుంటాయి.

యమునోత్రి ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

యమునోత్రి వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం యమునోత్రి

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? యమునోత్రి

  • రోడ్డు ప్రయాణం
    రోడ్ ప్రయాణం యాత్రికులు యమునోత్రి చేరేందుకు సమీప ప్రదేశాలైన హనుమాన్ చట్టి వంటి వాటి నుండి బస్సు సర్వీసులు పొందవాచ్చు. హనుమాన్ చట్టి వరకు మాత్రమే ప్రధాన నగరాలు అంటే డెహ్రాడూన్, తెహ్రి, ఉత్తర కాశి లేదా రిషికేశ్ ల నుండి టాక్సీ సర్వీసులు కలవు. పర్యాటకులు బస్సు లను న్యూ ఢిల్లీ లోని కాశ్మీరి గేటు నుండి రిషి కేష్ వరకు పొందవచ్చు.అక్కడ నుండి బస్సు లలో హనుమాన్ చట్టి చేరవచ్చు. ఇక్కడ నుండి గల 14 కి.మీ.లదూరం ట్రెక్కింగ్ చేసి యమునోత్రి చేరాలి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ప్రయాణం యమునోత్రికి రిషికేశ్ మరియు డెహ్రాడూన్ రైలు స్టేషన్ లు సమీపం. ఇవి వరుసగా 200 మరియు 175 కి.మీ.ల దూరం లోకలవు. ఈ రెండు రైలు స్టేషన్ లు ఇండియా లోని అన్ని ప్రధాన రైలు స్టేషన్ లకు కలుపబడి వున్నాయి. రైల్వే స్టేషన్ నుండి యమునోత్రి చేరేందుకు టాక్సీ లు దొరుకుతాయి.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    యమునోత్రి కి వాయు, రైలు, రోడ్డు మార్గాలలో ప్రయాణించవచ్చు. విమాన ప్రయాణం 210 కి.మీ.లదూరం లోకాల జాలీ గ్రాంట్ ఎయిర్పోర్ట్ యమునోత్రికి సమీప ఎయిర్ పోర్ట్ ఇది రెగ్యులర్ విమాన సర్వీస్ లతో న్యూ ఢిల్లీ లోని ఇందిరా గాంధీ ఎయిర్ పోర్ట్ కు కలుపబడి వుంది. పర్యాటకులు ఎయిర్ పోర్ట్ నుండి హనుమాన్ చట్టి చేరేందుకు టాక్సీలు కలవు.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Mar,Tue
Check Out
11 Mar,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed