Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» యావత్మల్

యావత్మల్ - చారిత్రక ప్రాధాన్యం

9

మహారాష్ట్ర లోని యావత్మల్ జిల్లాలో ఈశాన్యం వైపు ఉండే చిన్న గ్రామం యావత్మల్. సముద్ర మట్టానికి 1460 అడుగుల ఎత్తున విదర్భ ప్రాంతంలో ఉండే ఈ గ్రామం చుట్టూ చంద్రపూర్, పర్భని, అకోలా, అమరావతి జిల్లాలు ఉన్నాయి.

మరాఠీ లో యావత్ అంటే పర్వతం, మాల్ అంటే వరుస. ఈ రెండు పదాల కలయికతో యావత్మల్ అనే పేరు వచ్చింది.

చారిత్రక ప్రాధాన్యం

చరిత్ర పుటల్లో ప్రసిద్దికెక్కిన అన్ని రాజ వంశాలు యావత్మల్ ని పరిపాలించి దాని అభివృద్ధిని, సంస్కృతిని తమదైన రీతిలో ప్రభావితం చేసారు.

యావత్మల్ గా పేరుపడక ముందు, ఈ ప్రాంతాన్ని యవతేచా మహల్ అని, యోత్-లోహార్ అని పిలిచేవారు. ఆ రోజుల్లో బేరార్ దక్కన్ సుల్తనత్ లో యావత్మల్ ప్రధాన పట్టణం. అహ్మద్ నగర రాజుల నించి ముఘలాయిలు ఈ పట్టణాన్ని చేజిక్కించుకోగా చివరి ముఘల్ చక్రవర్తి మరణం తరువాత మరాఠా రాజులూ యావత్మల్ ను కైవసం చేసుకున్నారు. చివరగా బ్రిటీష్ వారు దీనిని తమ రాజ్యంలో కలుపుకున్నారు. మొదట్లో మధ్య భారతంలోని ప్రధాన నగరంగా గుర్తించబడిన ఈ పట్టణం అనంతరం మహారాష్ట్ర లో చేరింది.

ఇక్కడ ఉన్నపుడు ఏమి చూడాలి

యావత్మల్ పాత దేవాలయాలకు, అందమైన విహార కేంద్రాలకు ప్రసిద్ది. నృసింహాలయం, దత్త మందిరం, కలంబ్, ఖతేశ్వర్ మహారాజ్ దేవాలయం ఇక్కడి యాత్రా స్థలాలకు ఉదాహరణలు. యావత్మల్ లో జగత్ మందిరం, ఖోజోచి మసీదు కూడా వున్నాయి.

యావత్మల్ దగ్గరలోని కలంబ్ అనే గ్రామం పురాతన భూగర్భ చింతామణి వినాయకుడి విగ్రహానికి ప్రసిద్ది. దగ్గరలోనే గణేశ కుండం అనే పవిత్ర జలాశయం వుంది.

పైనగంగా అభయారణ్యం, తిపేశ్వర్ అభయారణ్యం ప్రకృతి, వన్యప్రాణి ప్రేమికులకు ఆహ్లాదం కలిగిస్తాయి.

యావత్మల్ సందర్శించడానికి శీతాకాలం సరైన సమయం కాగా, ఇక్కడికి వాయు, రైలు, రోడ్డు మార్గాల ద్వారా చేరుకోవచ్చు.

యావత్మల్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

యావత్మల్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం యావత్మల్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? యావత్మల్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు ద్వారా యావత్మల్ ని రోడ్డు ద్వారా చేరుకోవడం చాలా తేలిక. నాగపూర్ నించి హైదరాబాద్ కి జాతీయ రహదారి 7 ని ఎన్నుకోండి. అమరావతి నుండి చంద్రపూర్ రాష్ట్ర రహదారి కూడా యావత్ మహల్ వెళుతుంది. మహారాష్ట్ర, యావత్ మహల్ లోని వివిధ పట్టణాలు, నగరాల ప్రయాణానికి వీలుగా అనేక రాష్ట్ర రవాణా బస్సులు, ప్రైవేట్ టూర్ ఆపరేటర్లు నడిపే బస్సులు అందుబాటులో ఉన్నాయి. మీరు ఎన్నుకునే బస్సు పై ఆధారపడి ధర ఉంటుంది.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ద్వారా నగరం లోని యావత్మల్ స్టేషన్ పూనే, ముంబై, నాగపూర్, అహ్మద్ నగర్ వంటి మహారాష్ట్ర లో ఉన్న ప్రధాన నగరాలకు బాగా అనుసంధానించబడి ఉంది. రైలు ప్రయాణం సౌకర్యవంత మైనదే కాకుండా, ఖర్చు కూడా తక్కువ ఉంటుంది. మీరు నాగపూర్ నించి యావత్మల్ వెళ్ళే రైలు ఎక్కితే, రెండవ తరగతి టికెట్ ఖరీదు షుమారు 100 రూపాయలు ఉంటుంది.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    వాయుమార్గం ద్వారా 140 కిలోమీటర్ల దూరంలో ఉన్ననాగపూర్ లోని డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ అంతర్జాతీయ విమానాశ్రయం, యావత్మాల్ కి సమీప విమానాశ్రయం. నాగపూర్ విమానాశ్రయంనించి దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు, పట్టణాలకు నిత్యం విమాన సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. యావత్మల్ చేరుకోవడానికి విమానాశ్రయం నించి అనేక కాబ్ సర్వీస్ లు అందుబాటులో ఉన్నాయి. ధర కిలోమీటర్ కి 7 రూపాయలు ఉంటుంది. 469కిలోమీటర్ల దూరంలో ఉన్న హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం మరొక సరైన ఎంపిక.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Mar,Tue
Check Out
11 Mar,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed