ఆలీబాగ్ నందు కల అక్షి బీచ్ మరొక ఆకర్షణ. ఇది ఆలీబాగ్ కు 5 కి.మీ.ల దూరంలో ఉంది. ఈ బీచ్ లో పూర్తి వెండి తెలుపు ఇసుక ఉంటుంది. ఈ బీచ్ లో అనేక ప్రకటనలు మరియు సినిమాలు షూటింగ్ చేస్తారు. పిల్లలకు నీటి ఆటలకు ఈ బీచ్ పూర్తి ఆనందం కలిగిస్తుంది. ఇక్కడ అనేక ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. మీ ప్రేయసి లేదా ప్రియుడితో కలసి బీచ్ నది ఒడ్డున నడుస్తూంటే, సూర్యాస్తమయ ఆనందం అమోఘంగా ఉంటుంది. అక్షి గ్రామం చిన్నదైనప్పటికి సందర్శన సంతోషం కలిగిస్తుంది. స్ధానిక మత్స్యకార్లు స్నేహపూరితంగా ఉంటారు. జనం అధికంగా ఉండని చిన్న ప్రదేశం ఇది.



Click it and Unblock the Notifications