చిన్నది మరియు అందమైనది అయిన ఒక పట్టణం. ఆలీబాగ్ మహారాష్ట్ర పడమటి తీరంలో ఒక చిన్న పట్టణం. ఇది కొంకణ్ ప్రాంతంలోని రాయ్ గడ్ జిల్లాలో కలదు. ముంబై మెట్రో కు సమీపం. ఆలీబాగ్ ను అలీ గార్డెన్ పేరుపై నిర్మించారు. ఆలీ ఈ ప్రాంతంలో అనేక మామిడి మరియు కొబ్బరి చెట్లు నాటాడని చెపుతారు. ఈ ప్రదేశం సుమారుగా 17వ శతాబ్దానికి చెందినది. దీనిని మొదటిలో శివాజీ మహారాజు అభివృధ్ధి చేశాడు. 1852 లో దీనిని ఒక తాలూకాగా ప్రకటించారు. అలీ బాగ్ బెని ఇజ్రాయల్ యూదులకు స్వంత పట్టణంగా ఉంటుంది.
చరిత్ర ప్రాధాన్యం ఇక్కడ కల కొలబా కోట మరాఠాల అధికారానికి ప్రతీకగా నిలుస్తుంది. శిధిలావస్ధలో కల ఈ కోటను అలీబాగ్ బీచ్ నుండి చూడవచ్చు. ఇక్కడే కల మరో కోట కంధేరి కోట. ఇది సుమారు 3 శతాబ్దాల క్రిందటిది. దీనిని పేష్వా వంశీకులు నిర్మించారు. అయితే, తర్వాతి కాలంలో అది బ్రిటీష్ వారి వశం అయింది.
కణేశ్వర్ మరియు సోమేశ్వర దేవాలయాలు ఇక్కడ ప్రసిద్ధి చెందిన పుణ్య క్షేత్రాలు. ఈ రెంటిలోను శివ భగవానుడి అందమైన విగ్రహాలు కలవు. ఈ చిన్న పట్టణం నేడు ఎన్నో వ్యాపారాలకు కేంద్రంగా ఉంది. ఎన్నో కాటేజీలు, ఫారం హౌస్ లు కనపడతాయి.
మహారాష్ట్ర లోని గోవా ఈ ప్రదేశానికి మూడు వైపులా నీరు కలదు. అనేక బీచ్ లు కలవు. బీచ్ లలో అందమైన వరుసలలో కొబ్బరి, పోక చెట్లు ఉంటాయి. ఇంత అందమైన ప్రదేశమైన అలీ బాగ్ ను మహారాష్ట్రలోని గోవాగా అభివర్ణిస్తారు. కాలుష్యం లేని నీరు, తాజాగాలి, చక్కని ప్రదేశాలు పర్యాటకులకు స్వర్గాన్ని తలిపిస్తాయి.
అలీబాగ్ బీచ్ మీకు నల్లని ఇసుకతో కనపడితే, అక్కడి మరో ఖిమ్ బీచ్ మరియు నాగోవ్ బీచ్ లు పూర్తిగా తెల్లని ఇసుకతో మెరుస్తూంటాయి. ఇక్కడే కల మరో బీచ్ అక్షి బీచ్ ను కూడా తప్పక చూడాలి. అనేక ప్రకటనలు, టి.వి. సీరియల్స్ మరియు సినిమాలవంటివి ఈ బీచ్ లో షూటింగ్ చేస్తారు. ఈ ప్రాంతంలోనే అనేకమంది బాలీవుడ్ సెలిబ్రిటీలను వారి స్వంతమైన ఫారం హౌస్ లను, బంగళాలను కూడా చూడవచ్చు.
ఆలీబాగ్ ఒక బీచ్ టవున్ కావటం వలన, ఇక్కడి ఆహారాలు అన్ని స్ధానిక రుచుల ఆహారాలుగా ఉంటాయి. భిన్నంగా ఉండి మంచి రుచులు కలిగి ఉంటాయి. ఇక్కడి బీచ్ లు వారాంతపు సెలవుల వినోదాలకు అందుబాటులో ఉండి నగర జీవనంలో ఒత్తిడికల వారికి ఎంతో ఆనందాన్నిస్తాయి. బీచ్ విహారం, నీటి ఆటలు, సూర్యాస్తమయ సాయంత్రాలు ఎంతో ఆనందం కలిగిస్తాయి.
ఆలీబాగ్ ఎపుడు ? ఎలా? చేరాలి. ఆలీబాగ్ వాతావరణం ఆనందించేదిగానే ఉంటుంది. అధిక వేడి లేదా అధిక చలి వంటివి ఉండవు. వేసవి కూడా దేశంలోని ఇతర ప్రాంతాలలోవలే అధికంగా ఉండదు. గరిష్ట ఉష్ణోగ్రత 36 డిగ్రీ సెంటీగ్రేడ్ గా ఉంటుంది. వర్షాకాలలు ఆనందించేవిగానే ఉన్నప్పటికి పర్యటనలో కొంత సాధారణ అసౌకర్యం కలిగిస్తాయి. వర్షాలు అధికం. వర్షాకాలంలో సందర్శించేవారు కొంత రిస్కు తో ప్రదేశాన్ని చూడవచ్చు. లేదంటే, హోటల్ రూమ్ కు పరిమితం కావలసిందే. ఈ ప్రాంత పర్యటనకు శీతాకాలం అనువైనది. క్రిస్టమస్ మరియు కొత్త సంవత్సర పండుగల సమయం ఈ ప్రాంత సందర్శనకు అనువైనది.
అలీబాగ్ ముంబై నుండి 30 కి.మీ.ల దూరం ఉంటుంది. విమాన, రైలు, రోడ్డు ప్రయాణ సౌకర్యాలు కలవు. ముంబై లోని అంతర్జాతీయ విమానాశ్రయం సమీప విమానాశ్రయం. పెన్ రైల్వే స్టేషన్ రైలు ప్రయాణీకులకు అందుబాటులో కలదు. ఈ ప్రదేశానికి రావాలంటే, అనేక ప్రధాన నగరాలు, పట్టణాలనుండి ప్రభుత్వ మరియు ప్రయివేటు బస్ లు లభ్యంగా ఉంటాయి. ముంబై నుండి ఆలీబాగ్ కు జెట్టీ అంటే పడవ ప్రయాణం కూడా చేసి మరచిపోలేని అరేబియా సముద్ర అందాలను తనివిదీరా ఆస్వాదించవచ్చు. వారాంతపు సెలవుల ఈ విహార ప్రదేశాన్ని ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు.
బీచ్ ప్రదేశాలు, చారిత్రక కోటలు, పురాతన దేవాలయాలు కలిగిన ఈ చిన్న పట్టణం ఆలీబాగ్ ఇపుడిపుడే పర్యాటకులను అధిక సంఖ్యలో ఆకర్షిస్తూ అభివృధ్ధి చెందుతోంది. దీనిని మహారాష్ట్ర గోవా అని కూడా పిలుస్తారు. ఒక్కసారి ఈ చిన్ని మహారాష్ట్ర గోవాను సందర్శిస్తే, జీవితంలో మరువలేని అనుభూతులు కలుగుతాయనటంలో సందేహం లేదు.