మేఘనాద్ తో యుద్ధం లో గాయ పడిన లక్ష్మణుడిని రక్షించడానికి హనుమంతుడు సంజీవని మూలిక కలిగిన పర్వతాన్ని మొత్తం ఎత్తాడని రామాయణం లో పేర్కొనబడింది. ఈ పర్వతం లో కొంత యొక్క భాగం అయోధ్య లో పడిపోయిందని పురాణాలు చెబుతున్నాయి. ఆ పడిపోయిన పర్వత భాగం నే మని పర్వత్ గా పిలుస్తారు. సుగ్రీవ్ పర్వత్ కి సమీపం లో ఈ పర్వతం ఉంది.
మని పర్వతం ఎత్తు 65 అడుగులు. ఈ పర్వతం పై ఎన్నో మందిరాలు ఉన్నాయి. ఈ పర్వతం పైన నించుని అయోధ్య నగరం మరియు చుట్టు పక్కల ప్రాంతాల యొక్క అందాలను వీక్షించవచ్చు.
అయోధ్య లో ఆరేళ్ళ పాటు బుద్ధుడు నివసించాడని ధర్మం గురించి మని పర్వతం పైన ఎన్నో ప్రబోధాలు ఇచ్చారని అంటారు. అశోక చక్రవర్తి నిర్మించిన స్తూపాన్ని ఇక్కడ గమనించవచ్చు. పురాతనమైన బౌద్ధుల మొనాస్టరీ ఇక్కడికి సమీపం లో ఉంది. ముస్లిం ల స్మశాన వాటిక ఈ పర్వతం కింద ఉంది.



Click it and Unblock the Notifications