రాచరికపు వంటగది గా కంటే ఒక దేవాలయం గానే సీతా కి రాసోయి ప్రసిద్ది. అయోధ్య లో ని రామకోట్ లో రామ జన్మస్థానానికి వాయువ్య దిశ లో ఉన్న ఈ ప్రదేశం రామ్ చబూత్ర టెర్రస్ కి సమీపాన ఉంది. ఈ దేవాలయం లో రామ లక్ష్మణ భారత శత్రుఘ్ను లు వారి వారి సతులైన సీతా, ఊర్మిళ, మాండవి మరియు శ్రుతికీర్తి సమేతంగా ఉన్న విగ్రహాలు ఉన్నాయి.
చపాతీ పీట, కర్ర వంటి వంట సామాగ్రి వంటివి ఈ వంటశాల లో మనకు కనిపిస్తాయి. అప్పటి కాలం లో వారి ఆచారం ప్రకారం కొత్తగా వచ్చిన కోడలు కుటుంబం మొత్తానికి వంట చేయాల్సి ఉంటుంది. పురాణం ప్రకారం, సీతమ్మ వారు అన్నపూర్ణా దేవి లాగా ఒక కుటుంబానికే కాకుండా పూర్తి మానవ జాతికే సరిపడే విధం గా ఆహారాన్ని వండారని చెప్తారు.
మరొక ఆసక్తికర విశేషం ఏమిటంటే ఈ ప్రదేశం లో ని బాబ్రీ మసీదు యొక్క ముఖ్య తోరణం పైన "జన్మస్తాన్ సీతా కి రసొయి" అని రాయబడి ఉండటాన్ని ప్రముఖ భారతీయ చరిత్రకారుడు మరియు తత్వవేత్త అయిన రామ్ చందర్ గాంధీ, గాంధీ యొక్క మునిమనవడు కనిపెట్టాడు.



Click it and Unblock the Notifications