1969 లో శ్రీ విశ్వనాధ్ దాస్ జీ, అప్పటి యు ఫై గవర్నర్, రామాయణాన్ని రచించిన భక్తుడు, కవి అయిన గోస్వామి తులసీ దాస్ గారికి నివాలిగా ఈ తులసి స్మారాక్ భవన్ ని నిర్మించారు. రాజ్గంగ్ క్రాసింగ్ యొక్క జాతీయ రహదారికి తూర్పు వైపున 300 అడుగుల దూరం లో ఈ భవనం ఉంది. ఇక్కడే తులసి దాసు రామాయణాన్ని రచించారని నమ్ముతారు.
అయోధ్య శోద్ సంస్థాన్ అనబడే రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇక్కడ ఉంది. ఇక్కడ ఉన్న గ్రంధాలయం చారిత్రకులకు మరియు పండితులకు అత్యంత విలువైనది. రామ్ కథ సంగ్రహాలయ అనబడే మ్యుజియం ఇక్కడ 1988 లో జత చేసారు. శ్రీ రాముడి చరిత్రతో ముడిపడిన విశేషాలను ఇక్కడ సేకరించి, పొందుపరచి మరియు ప్రదర్శిస్తారు.
20 తారిఖు మే 2004 నుండి ఇక్కడ సాయంత్రం 6 నుండి రాత్రి 9 వరకు ప్రతి రోజు రామ లీల ని ప్రదర్శిస్తున్నారు. అనేక సంస్కృతిక కార్యక్రమాలు ఇక్కడ నిర్వహిస్తారు. తులసి జయంతి ఇక్కడ శ్రావణ మాసం లో ఏడవ రోజున జరుపబడే పెద్ద పండుగ.



Click it and Unblock the Notifications