బాదామి ఫోర్ట్ ప్రధాన ఆకర్షణ. ఇది ఒక కొండపై నేరుగా బాదామి గుహలకు ఎదురుగా ఉంటుంది. ఈ కోట భూతనాధ దేవాలయానికి తూర్పు వైపు ప్రధాన పట్టణం నుండి రెండు కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. ఇది ఒకప్పుడు చాళుక్య సామ్రాజ్యంలో రాజుల నివాసంగా ఉండేది. కాలినడకన మాత్రమే దీనిని చేరగలరు. ఈ కోటలో రెండు శివాలయ సముదాయాలుంటాయి. ఇవి శివభక్తుడైన రాజు పులకేశి II చే 5వ శతాబ్దంలో నిర్మించబడ్డాయి. శివాలయ పై భాగం శివుడి విగ్రహం కలిగి క్రింది భాగం గణేశ విగ్రహం ఉంటుంది. శివాలయ గోడల వెలుపలి భాగాలపై ఏనుగు, సింహం మరియు కొన్ని ఇతిహాసాల గాధలు చెక్క బడ్డాయి. టిపు సుల్తాన్ కు చెందిన 16వ శతాబ్దపు ఫిరంగి ఒకటి శివాలయాలకు ఉత్తర భాగంలో ఉంచబడింది. 14వ శతాబ్దపు వాచ్ టవర్ కూడా ఒకటి ఉంటుంది. ఈ కోటలు, ధాన్యాగారాలు, ప్రయివేట్ హాల్, రహస్యపు గదులు వంటివి కూడా ఉన్నాయి.



Click it and Unblock the Notifications