పట్నాఘర్, బలంగీర్ జిల్లా ప్రధాన కేంద్రం నుండి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రాంతం కొన్ని మనోహరమైన పురాతన ఆలయాలకు నివాసం. పటమేశ్వరి ఆలయాన్ని చాళుక్యుల శైలిలో నిర్మించారు. 12 వ శతాబ్దానికి చెందిన పురాతన సోమేశ్వర శివాలయం కూడ ఒక ముఖ్య తీర్థయాత్రా ప్రాంతమే.
పట్నాఘర్ లో ప్రస్తుతం శిధిలాలలో ఉన్న అనేక పురాతన ఆలయాలను కూడా మనం చూడవచ్చు. పశ్చిమ ఒరిస్సాను పాలించిన చౌహానుల కాలంలో వీటిలోని చాలా ఆలయాలను నిర్మించారు.
పట్నాఘర్ ఖచ్చితంగా, బలంగీర్ చరిత్రను అన్వేషించి, తెల్సుకొనవలసిన పట్టణమే. ఈ ప్రాంతానికి గత కాలపు రాజరిక మనోజ్ఞత ఇప్పటికి ఉంది. ఈ ప్రాంతాన్ని ప్రతి ఏటా, అనేకమంది చరిత్ర పరిశోధకులు, పురావస్తు శాస్త్ర విద్యార్ధులు సందర్శిస్తారు.



Click it and Unblock the Notifications