Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» భాంధవ్ ఘర్

భాంధవ్ ఘర్ - పులుల నిలయం !

16

తెల్ల పులులకి అసలైన స్థావరంగా భాంధవ్ ఘర్ ని భావిస్తారు. చరిత్ర రికార్డుల ప్రకారం, రేవా మహారాజా యొక్క వేట ప్రాంతం ఈ బాంధవ్గర్. పురాతన కోట దీనికి ఆధారం. ఆశ్చర్యకరంగా, ఈ కోటలు ఇంకా అడవిని డామినేట్ చేస్తున్నాయి. నేషనల్ పార్క్ గా ఈ ప్రాంతం మారక ముందు కూడా బాంధవ్గర్ అనేది ప్రపంచవ్యాప్తంగా వేటగాళ్లకు ప్రఖ్యాతి చెందిన ప్రాంతం. ప్రభుత్వం పులుల సంరక్షణ కోసం చర్యలు చేపట్టడం వల్ల వేట అనేది ఒకప్పటి రాచరికపు ఆనందంగా మిగిలిపోయింది. పులుల జనాభా క్రమంగా పెరగడం ప్రారంభించింది.

ప్రకృతి ఒడిలో

విస్తృత జీవ వైవిధ్యం కారణంగా బాంధవ్గర్ నేషనల్ పార్క్ గా 1968 లో ప్రపంచానికి పరిచయం అయింది. భారత దేశం లో ని పులులకు నిలయం గా ప్రసిద్ది చెందిన ఈ ప్రాంతం దేశం లోనే అత్యధిక పులులకు స్థావరం కలిపించినందుకు గర్వంగా భావిస్తుంది. పులులతో పాటు ఇందులో అత్యధిక శాతం చిరుతలు ఇంకా వివధ రకాలైన జింకలు కనిపిస్తాయి. ఇంకా వివిధ రకాల అరుదైన ఇతర జంతువులను కూడా ఇక్కడ గమనించవచ్చు. దాదాపు 257 జాతుల పక్షులు, 37 రకాల క్షీరదాలు, దాదాపు 80 రకాల సీతాకోక చిలుకలు ఇంకా ఎన్నో రకాల సరీసృపాలుఈ బాంధవ్గర్ నేషనల్ పార్క్ లో ఉన్నాయి. ఈ పార్క్ లో వివిధ రకాలైన వృక్ష జాలం ఉంది. సాల్, దోబిన్, సాలై, సాజా ఇంకా మరికొన్ని వీటిలో చెప్పుకోదగినవి. బాంధవ్గర్ పర్యాటకం యొక్క ప్రసిద్ది కి ముఖ్య కారణం ఈ ప్రాంతం లో ఉన్న వృక్ష మరియు జంతు జాలం లు. ఇక్కడ తిరిగే పెద్ద అడవి పిల్లుల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రకృతి ని దగ్గరగా ఆస్వాదించాలనుకుంటే మీరు బాంధవ్గర్ లో కనీసం మూడు రోజులు గడపాలి.

లోయలు ఇంకా అవతల - బాంధవ్గర్ లో ఇంకా చుట్టు పక్కల పర్యాటక ప్రాంతాలు

వింధ్యా లోయ అందాలు ఇంకా బాంధవ్గర్ కోట ని తప్పక చూసి తీరాలి. ఈ శ్రేణి మొత్తం ఒక దానితో ఒకటి పొందుపరచబడి ఉన్న లోయలతో ఉండగా ఇవన్నీ 'బోహేరా' అనబడే పచ్చికబయలులో ముగుస్తాయి. ఈ పార్క్ లో ని అతి లోతైన ప్రదేశాన్ని తలా గా పిలుస్తారు. మధ్యప్రదేశ్ లో ని ముఖ్యమైన పర్యాటక ఆకర్షణ బాంధవ్గర్ నేషనల్ పార్క్. ఈ టూరిజం యొక్క ముఖ్య ఆకర్షణ ఇది. 9 నేషనల్ పార్కులు ఇంకా 25 సాంచురీలు కలిగి ఉండటం మధ్యప్రదేశ్ కి సగర్వ కారణం. టైగర్ స్టేట్ ఆఫ్ ఇండియా అని ఈ ప్రాంతం పిలువబడడం ఆశ్చర్యం ఏమీ కాదు. ఎందుకంటే, భారత దేశం లో నే అత్యధిక పులుల జనాభా కలిగిన ప్రాంతం ఇది. బాంధవ్గర్ హిల్, బాంధవ్గర్ పురాతన గుహలు, శేష్ శైయా మరియు ఘోరదేమోన్ వాటర్ ఫాల్స్ ఈ ప్రాంతం లో ఉన్న మరికొన్ని ఆకర్షణలు. బఘెల్ మ్యూజియంలో ప్రదర్శితమైన వస్తువులు మధ్యయుగం గురించి చెబుతాయి.

ప్రసిద్ది చెందిన బాంధవ్గర్ వంటకాలు

పెర్షియన్ మరియు హిందుస్తానీ సంస్కృతి ల సమ్మేళనంగా గా మధ్యప్రదేశ్ కి చరిత్ర ఉంది. ఇక్కడ లభించే వంటకాలలో ఇది స్పష్టమవుతుంది. భుట్టీ కి కీస్, మావా - బతి కేబబ్స్ మరియు ఖోప్రపాక్ వంటి వంటకాలను ఇక్కడ రుచిచూడక పొతే మధ్యప్రదేశ్ పర్యటన అసంపూర్ణంగా మిగులుతుంది.

బాంధవ్గర్ సందర్శన

వాయు, రైలు మరియు రోడ్డు మార్గం ద్వారా బాంధవ్గర్ కి చేరుకోవచ్చు. జబల్పూర్ లో ఉన్న విమానాశ్రయం ఇంకా రైల్వే స్టేషన్ ఇక్కడికి సమీపంలో ఉన్నవి. బాంధవ్గర్ ని అక్టోబర్ నుండి మార్చ్ వరకు సందర్శించేందుకు ఉత్తమ సమయం.

భాంధవ్ ఘర్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

భాంధవ్ ఘర్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం భాంధవ్ ఘర్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? భాంధవ్ ఘర్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు మార్గం రోడ్డు మార్గం ద్వారా బాంధవ్ గర్ కి సులభంగా చేరుకోవచ్చు. ప్రైవేటు మరియు రాష్ట్ర ప్రభుత్వ బస్సులు రెగ్యులర్ ఇంటర్వల్స్ లో మధ్యప్రదేశ్ లో ని ప్రధాన నగరాల నుండి అందుబాటులో ఉంటాయి. జీపులు మరియు SUV లు కూడా సమీప నగరాల నుండి ఈ ప్రాంతానికి చేరుకునేందుకు అందుబాటులో ఉంటాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు మార్గం కత్ని లో ఉన్న రైల్వే స్టేషన్ బాంధవ్ గర్ కి సమీపం లో ఉంది. ఇది కేవలం 97 కిలో మీటర్ల దూరం లో ఉంది. ఢిల్లీ, వడోదరా, ముంబై, హౌరా, బెంగుళూరు మరియు చెన్నై లతో పాటు దేశం లో ని ఇతర ప్రధాన నగరాలకు కత్ని జంక్షన్ అనుసంధానమై ఉంది. ఈ రైల్వే స్టేషన్ నుండి బాంధవ్గర్ కి చేరుకునేందుకు ప్రైవేటు మరియు ప్రభుత్వ బస్సులు సదుపాయం కలదు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    వాయు మార్గం బాంధవ్గర్ కి సమీపం లో ఉన్న విమానాశ్రయం జబల్పూర్ లో ఉంది. ముంబై, ఇండోర్ మరియు న్యూ ఢిల్లీ నుండి రెగ్యులర్ ఫ్లైట్స్ కలవు. బాంధవ్ గర్ నుండి 169 కిలో మీటర్ల దూరం లో జబల్పూర్ ఉంది. ఈ విమానాశ్రయం నుండి బాంధవ్గర్ చేరుకోవడానికి బస్సులు ఇంకా టాక్సీ సేవలు అందుబాటులో ఉంటాయి. ఉమరియా లో ని ప్రైవేటు చార్టర్ల ద్వారా కూడా ఈ నేషనల్ పార్క్ కి చేరుకోవచ్చు.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
12 Jun,Fri
Return On
13 Jun,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
12 Jun,Fri
Check Out
13 Jun,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
12 Jun,Fri
Return On
13 Jun,Sat