బెంగళూరు చుట్టూ కలియ తిరగటం పూర్తయితే, ఇక షాపింగ్ చేసే సమయం. వాణిజ్య వీధి బారులు తీరిన విద్ద్యుద్దీపాల కాంతితో మెరుస్తుంటుంది. బ్రిగేడ్ రోడ్డు నుంచి, కామరాజు రోడ్డు నుంచి ఇక్కడకు చేరుకోవచ్చు. పెద్ద పెద్ద బ్రాండ్ల దుకాణాలతోపాటు కళాకృతులు, బూట్లు, ఇతర సామగ్రి విక్రయించే దుకాణాలు కూడా ఇక్కడ వుంటాయి. రంగుల దుస్తులకు, అందునా మహిళల దుస్తులకు వాణిజ్య వీధి ప్రసిద్ది. ఇక్కడ దుకాణాలు ఉదయం 10:30 కి తెరుస్తారు.వాణిజ్య వీధిలో క్రెడిట్, డెబిట్ కార్డుల లాంటి ప్లాస్టిక్ డబ్బు పనిచేయదు, మీరు తప్పనిసరిగా నగదును తీసుకు వెళ్ళాల్సిందే. బాగా బేరం ఆడగలిగితే మీరు ఇక్కడ షాపింగ్ బాగానే చేయవచ్చు. ఇక్కడ దుకాణాలు చాలా వరకు మహిళలకు సంబంధించినవి, ఐనప్పటికీ పురుషులకు సంతోషం కలిగించేందుకు స్థానిక టీ స్టాళ్లు మొదలుకొని రోడ్డు పక్కన ఉండే రెస్టారెంట్ల దాకా అందుబాటులో వుంటాయి. ఆరోగ్యంపై ప్రత్యెక శ్రద్ధ చూపించే వారికీ, కే ఎఫ్ సి, పిజ్జా హట్ లాంటి దుకాణాలు కూడా ఈవీధిలో అందుబాటులో ఉన్నాయి. ఒక రోజులో షాపింగ్ చేయడం, బేరమాడటం, చిరు టిల్లు తినడం వల్ల మీరు నీరసించి పోతారు, ఎందుకంటే ఇక్కడి ఆకర్షణలు మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ వచ్చేలా చేస్తాయి.