లాల్ బాగ్, బెంగళూరు

బెంగళూరులోని దక్షిణ ప్రాంతంలో ఉన్న ప్రసిద్ధ బొటానికల్ గార్డెన్ లాల్ బాగ్. లాల్ బాగ్ అంటే ఆంగ్లంలో రెడ్ గార్డెన్ అని అర్ధం. ఈ తోట నిర్మాణం సుల్తాన్ హైదర్ ఆలి ప్రారంభిస్తే, అతని కుమారుడు టిప్పు సుల్తాన్ పూర్తి చేసాడు. 240 ఎకరాల విస్తీర్ణంలో 1000 కి పైగా జాతులతో వున్న లాల్ బాగ్ లో చాలా రకాల ఉష్ణమండల వృక్ష జాతులు వున్నాయి.

ఈ తోటలో నీటిపారుదల వ్యవస్థ బాగుంటుంది, కలువ కొలనులతో, పచ్చిక బయళ్ళ తో, పూల పాన్పులతో  అందంగా తీర్చి దిద్దారు.ప్రజలకు వృక్ష సంపద సంరక్షణ పై అవగాహన కల్పించేందుకు ప్రతి ఏటా ఇక్కడ పూల ప్రదర్శనలు నిర్వహిస్తారు. లాల్ బాగ్ ప్రతిరోజూ ఉదయం 6 గంటల నించి సాయంత్రం 7 గంటల వరకు తెరిచే ఉంటుంది. ఈ లాల్ బాగ్ కు రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాల ను౦చి ప్రభుత్వ బస్సులు, టూరిస్ట్ బస్సుల విరివిగా నడుస్తాయి.లాల్ బాగ్ కు 1856లో ప్రభుత్వ బొటానికల్ గార్డెన్ గా గుర్తింపు మంజూరు అయ్యాక దానికి ఉద్యానవన శాఖ సహకారం అందిస్తోంది. ఈ తోటలో లండన్ లోని క్రిస్టల్ పాలస్ ప్రేరణతో ఒక గాజు భవనం ఏర్పాటుచేశారు – ఇక్కడే ప్రతి ఏటా పుష్ప ప్రదర్శన జరుగుతుంది. 3000 సంవత్సరాల నాటి ఈ భూమండలం లోని అతి పురాతన రాతి కట్టడాలలో ఒకటి ఈ లాల్ బాగ్. ఇందుకు స్మారకంగా HMT వారు ఒక అద్భుతమైన పూల గడియారము ఈ తోట మధ్యలో ఏర్పాటుచేశారు. పచ్చదనంతో నిండిన నేలపై విహరిస్తూ, ప్రకృతి ఆత్మను తిలకిస్తుంటే నేను మనిషి కంటే ఎక్కువ ప్రకృతిని ఇష్టపడుతున్నాను అని చేప్పే క్షణాలు ఎదురవుతాయి.

Please Wait while comments are loading...