Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » బెంగళూరు » ఆకర్షణలు » యు బి సిటీ

యు బి సిటీ, బెంగళూరు

2

16 లక్షల చదరపు అడుగుల్లో విస్తరించి వున్న యు బి సిటీ బెంగళూరు లోని అతి పెద్ద వాణిజ్య సముదాయం. రాష్ట్రం లోకెల్లా పొడవైన భవనం గా దీనికి ఖ్యాతి వుంది. ఈ ఆకాశ హర్మ్యం బ్రిగేడ్ రోడ్డు – ఎం జీ రోడ్డు కూడలి నుంచి ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో విట్టల్ మాల్యా వీధి లో వుంది.యు బి సిటీ లో యు బి టవర్, కామెట్, కాన్బెర్రా, కాన్కర్డ్ అనే పేర్లున్న నాలుగు భవనాలున్నాయి. కర్ణాటక లోని మొదటి విలాసవంతమైన సముదాయం ఇది. విలాసవంతమైన రిటైల్, వాణిజ్య – సర్వీస్ద్ అపార్ట్మెంట్ల కలగూరగంప అయిన ఈ సముదాయం లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వాడారు, అన్ని ప్రధాన బ్రాండ్ లు ఒకే వేదిక లో దొరుకుతాయి.యు బి టవర్ లో కార్యాలయాలు, కామెట్ లో సర్వీస్డ్ అపార్ట్మెంట్లు, కాన్బెర్రా, కాన్కార్డ్ ల లో క్రింది అంతస్తుల్లో చిల్లర దుకాణాలు, పై అంతస్తుల్లో కార్యాలయాలు వుండేలా రూపొందించారు. అంతర్జాతీయ ఖ్యాతి గడించిన ఓక్ వుడ్ ఇళ్ళు ఈ యు బి సిటీ లో చెప్పుకోదగిన ప్రత్యేకత. ఇటాలియన్ నుంచి చైనీస్ దాకా అన్ని రకాల రుచులూ ఇక్కడ దొరుకుతాయి.800 సీట్లుండే ఆమ్ఫి థియేటర్ తో పాటు 1100 కార్లు పట్టే పార్కింగ్ స్థలం కూడా వుంది. భవనం పై కప్పు మీద ఏర్పాటైన హేలీపాడ్ వల్ల ఇక్కడికి విమానాశ్రయం నుంచి వాయు మార్గంలో అయిదు నిమిషాల్లో చేరుకోవచ్చు. విస్తారంగా వుండి ఆకట్టుకునే ఈ భవన సముదాయం మిమ్మల్ని మొదటి చూపు లోనే ఆకర్షిస్తుంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
24 Apr,Fri
Return On
25 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
24 Apr,Fri
Check Out
25 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
24 Apr,Fri
Return On
25 Apr,Sat