Search
 • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» పుట్టపర్తి

పుట్టపర్తి - సత్య సాయి బాబా నివాసం

26

పుట్టపర్తి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము లో అనంతపురం అనే జిల్లాలో ఉన్న చిన్న పట్టణం. ఆధ్యాత్మిక గురువు సత్య సాయి బాబా యొక్క పవిత్ర నివాసం ఇక్కడ ఉండటం వల్ల ఒక ప్రసిద్ధ యాత్రా కేంద్రంగా మారింది. పట్టణం చిత్రావతి నది ఒడ్డున ఉంది.మరియు సముద్ర మట్టానికి 475 మీటర్ల ఎత్తులో ఉంది. పుట్టపర్తి యొక్క చరిత్ర శ్రీ సత్య సాయి బాబా యొక్క పుట్టుక మరియు జీవితం చుట్టూ తిరుగుతుంది. గతంలో పుట్టపర్తిని గొల్లపల్లి అని పిలిచే ఒక చిన్న వ్యవసాయ గ్రామం మరియు అక్కడ ఇళ్ళల్లో ఆవులను పెంచేవారు. సత్య సాయీ గా పిలువబడే సత్యనారాయణ రాజు నవంబర్ 23 1926 వ సంవత్సంలో శ్రీ పెద్ద వెంకప్ప మరియు శ్రీమతి ఈశ్వరమ్మ దంపతుల ఇంట జన్మించారు. తన అద్భుతమైన శక్తులు వలన ప్రజలు అతనిని షిర్డీ యొక్క సాయి బాబా అవతారముగా భావించేవారు. మరియు అతనిని సత్య సాయి బాబా అని పిలిచేవారు. అనేక సంఘటనలు కారణంగా ప్రజలు అతనిని అనుసరించడం ప్రారంభించారు, మరియు అతను ఒక ఆధ్యాత్మిక నాయకుడు అనే నమ్మకం వారికి కలిగింది. అతని బోధనలు ప్రపంచవ్యాప్తంగా జయ జయ ధ్వానాలు అందుకున్నాయి. ఆయన బోధనలు శాంతి, సత్యం, ప్రేమ, నిజాయితీ మరియు అహింస సూత్రాల పై ఆధారపడి ఉంటాయి. ఈ చిన్న గ్రామం ప్రపంచ స్థాయి పట్టణంగా మారింది.

1950 లో, ప్రశాంతి నిలయం స్థాపించబడింది, మరియు ఈ ఆశ్రమం ఏర్పాటు చేయటం వలన ఈ గ్రామం ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందింది. అక్కడ విమానాశ్రయం, రైల్వే స్టేషన్ వంటి సౌకర్యాలు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మరియు విద్యా సంస్థలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి.

దగ్గరలో ఉన్న అట్రాక్షన్స్

సత్య సాయి బాబా యొక్క తాత, లేట్ కొండమ రాజుచే ఆ గ్రామంలో మసీదు, హనుమాన్ ఆలయం, మరియు సత్యభామ ఆలయం నిర్మించబడ్డాయి. మరో సత్యభామ ఆలయంను ఇటీవల సత్య సాయి బాబా యొక్క అన్నయ్య శేషమా రాజు, బెంగుళూర్ వెళ్లే మార్గంలో నిర్మించారు. సత్య సాయి బాబా జన్మించిన ప్రదేశంలో శివాలయం నిర్మించబడింది. చిత్రావతి నది ఒడ్డున ఉన్న వృక్షం మరియు విశ్వవిద్యాలయం వైపు ఉన్న కొండ మీద ఉన్న ధ్యానం చెట్టు కూడా ప్రాముఖ్యత పొందింది. ఇటీవల కాలంలో విద్య మరియు సాంస్కృతిక సంస్థలను ముఖ్యమైన ప్రదేశాలలో నిర్మించి ఉద్యోగాలు ఇవ్వటం మరియు చిన్న పట్టణం చుట్టూ ఉన్న గ్రామాలు యాత్రా స్థలములుగా మారినాయి.

కనెక్టివిటీ మరియు వాతావరణం

పుట్టపర్తి పట్టణం, కేవలం 4 కి.మీ.ల దూరంలో, ఆశ్రమం నుంచి శ్రీ సత్య సాయి విమానాశ్రయం అనే దేశీయ విమానాశ్రయం ఉంది. ఈ విమానాశ్రయం చెన్నై మరియు ముంబై వంటి ప్రధాన నగరాలతో చక్కగా అనుసంధానించబడి ఉంది. బెంగుళూర్ ఇంటర్నేషనల్ విమానాశ్రయం పుట్టపర్తి నుంచి 131 కి.మీ. దూరంలో ఉంది. పుట్టపర్తి ని సందర్శించడానికి సంవత్సరంలో ఉత్తమ సమయం సెప్టెంబర్ నుండి ఫిబ్రవరి వరకు ఉంటుంది. మార్చి నుంచి జూన్ వరకు వేసవి చాలా వేడిగా మరియు అసౌకర్యంగా ఉంటుంది.ఇక్కడ అంతర్గత శాంతి కొరకు ప్రయత్నిస్తారు మరియు ఆధ్యాత్మికత మరియు మతంతో సంబంధాన్ని కావాలనుకునే ప్రజలకు ఇదే ఒక పరిపూర్ణ మైన గమ్యం.

పుట్టపర్తి ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

పుట్టపర్తి వాతావరణం

పుట్టపర్తి
33oC / 92oF
 • Partly cloudy
 • Wind: SSW 10 km/h

సందర్శించేందుకు ఉత్తమ సమయం పుట్టపర్తి

 • Jan
 • Feb
 • Mar
 • Apr
 • May
 • Jun
 • July
 • Aug
 • Sep
 • Oct
 • Nov
 • Dec

ఎలా చేరాలి? పుట్టపర్తి

 • రోడ్డు ప్రయాణం
  బస్సు మార్గం ప్రభుత్వ బస్సులు నిరంతరం ఆంధ్రప్రదేశ్ లో అన్ని ప్రధాన నగరాల నుండి పుట్టపర్తికి అందుబాటులో ఉన్నాయి. సూపర్ డీలక్స్ బస్సులు బెంగుళూర్, హైదరాబాద్ మరియు చెన్నై నుండి పుట్టపర్తి కు తరచుగా ప్రయాణం చేస్తాయి.
  మార్గాలను శోధించండి
 • రైలు ప్రయాణం
  రైలు మార్గం శ్రీ సత్య సాయి ప్రశాంతి నిలయం రైల్వే స్టేషన్ పుట్టపర్తి కు ముఖ్య రైల్వేస్టేషన్. ఇది ఆశ్రమం నుంచి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్నది మరియు ముంబై, బెంగుళూర్, వైజాగ్, హైదరాబాద్,భువనేశ్వర్ మరియు న్యూ ఢిల్లీ వంటి ప్రధాన నగరాలకు అనుసంధానం కలిగి ఉంది. ధర్మవరం పుట్టపర్తి సమీపంలో ఉన్న ప్రధాన రైల్వేస్టేషన్.
  మార్గాలను శోధించండి
 • విమాన ప్రయాణం
  విమాన మార్గం పుట్టపర్తి పట్టణం కేవలం 4 కి.మీ. దూరంలో ఆశ్రమం నుంచి శ్రీ సత్య సాయి విమానాశ్రయం అనే దేశీయ విమానాశ్రయం ఉంది. ఈ విమానాశ్రయం చెన్నై మరియు ముంబై వంటి ప్రధాన నగరాలతో చక్కగా అనుసంధానించబడి ఉంది. బెంగుళూర్ ఇంటర్నేషనల్ విమానాశ్రయం పుట్టపర్తి నుంచి 131 కి.మీ. దూరంలో ఉంది.
  మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Aug,Mon
Return On
20 Aug,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

 • Adults(12+ YEARS)
  1
 • Childrens(2-12 YEARS)
  0
 • Infants(0-2 YEARS)
  0
Cabin Class
Economy

Choose a class

 • Economy
 • Business Class
 • Premium Economy
Check In
19 Aug,Mon
Check Out
20 Aug,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
 • Guests
  2
Pickup Location
Drop Location
Depart On
19 Aug,Mon
Return On
20 Aug,Tue
 • Today
  Puttaparthi
  33 OC
  92 OF
  UV Index: 8
  Partly cloudy
 • Tomorrow
  Puttaparthi
  26 OC
  79 OF
  UV Index: 8
  Sunny
 • Day After
  Puttaparthi
  29 OC
  84 OF
  UV Index: 8
  Partly cloudy