నకోడా దేవాలయాన్నే పార్శ్వనాధ దేవాలయం అని కూడా పిలుస్తారు. జైనులు అతి పవిత్రంగా భావించే ఆలయాలలో ఇది ఒకటి. దేవాలయంపై జైన తీర్ధంకరుడు పార్శ్వ నాధుని చెక్కడం నల్లటి రాతిలో ఉంటుంది. జోధ్ పూర్, బార్మర్ రోడ్డులో సుమారు 1500 అడుగుల ఎత్తులో కల ఈ దేవాలయం 3వ శతాబ్దంలో నకోర్సన్ మరియు వీర్ సేన్ అనే ఇరువురు సోదరులచే నిర్మించబడింది. దీనిలోని విగ్రహాన్ని జైన ఆచార్యులు స్తూలి భద్రసూరి ప్రతిష్టించారు. అయితే, క్రీ.శ. 1224 సంవత్సరంలో ఆలంషా దండయాత్రతో జైన సంఘం ఈ విగ్రహాన్ని కాళీ ధారలో దాచి వుంచి తర్వాత మరల 1373 లో ప్రతిష్టించారు. ఇది పార్శ్వనాధుడి గుడి అయినప్పటికి ఒకప్పుడు అక్కడ మహావీరుడి విగ్రహం ఉండేదని చెపుతారు. రిషభ దేవ, శాంతినాధ జైన దేవాలయాలు కూడా ఇక్కడ కలవు.



Click it and Unblock the Notifications