జుమ్మా మసీద్ కు ఎంతో చారిత్రక ప్రాధాన్యతకలదు. తప్పక చూడవలసిన ప్రదేశం. ఇది బీజపూర్ లోని మతపర ప్రదేశాలలో ఒకటి. దీనిని అదిల్ షా డైనాస్టీ కి చెందిన అలి అదిల్ షా (1557-1580) తాళికోట యుద్ధంలో తన విజయానికి చిహ్నంగా దీనిని నిర్మాణం చేశారు. ఈ ప్రాంతంలో ఇది ఎంతో పెద్ద మసీదు. షుమారు 10,810 చ. మీటర్ల విస్తీర్ణం కలిగి ఉంటుంది. మసీదుకు ఒక అందమైన గోపురం, పెద్ద చావడి మరియు ఆకర్షణీయమైన ఆర్చీలు ఉంటాయి. ప్రార్ధనలు చేసేందుకు సుమారు 2,250 నల్లని చదరాలు నేలపై కట్టారు. ఈమసీదులో బంగారంలో వ్రాసిన పవిత్ర ఖురాన్ గ్రంధం ఒక కాపీ కూడా ఉంది. హాలు పక్కలకు వాలిన ఉల్లిపాయ ఆకారంలో ఒక డోమ్ కూడా ఉంటుంది. దీనిని 45 బీమ్ లుగా విభజించారు. దీని చుట్టూ 33 డోమ్ లు ఉంటాయి. ఈ మసీదు మధ్య భాగంలో ఒక ఫౌంటెన్, ఒక హాలు మరియు ఒక గోపురం ఉంటాయి. మొగలాయి చక్రవర్తి ఔరంగజేబుచే నిర్మించబడిన 12 ఆర్చీలు వాటికి కలిపిన మరో 12 ఆర్చీలు ఒక ప్రవేశ ద్వారం కూడా ఉంటాయి.



Click it and Unblock the Notifications