పర్యాటకులు ఇక్కడి కోట ప్రహరీ గోడను తప్పక చూడాలి. అద్బుత శిల్ఫకళా నైపుణ్యం దీనిలో కనపడుతుంది. దీనినే అర్కిల్లా అని అంటారు. దీనిని 1566 లో యూసఫ్ అదిల్ షా నిర్మించారు. దీని చుట్టూ 100 అడుగుల వెడల్పు గొయ్యు కలదు. గతంలో ఇది నీరు అందించేది. కోట లోపల హెందూ దేవాలయ శిధిలాలు ఇస్లాం ముందు కాలంనాటివి ఎన్నో కలవు. ఈ సిటడెల్ గోడలు 30 నుండి 50 అడుగుల ఎత్తు కలిగి అనేక బురుజులతో వివిధ డిజైన్లలో కలవు.
సిటడెల్ కు ఒక్కొక్కటి 25 అడుగుల వెడల్పు కల 10 గేట్లు కలవు. ఈ భవనాన్ని బీజపూర్ రాజులు వినియోగించేవారు. ఇది ఒక చారిత్రక చిహ్నం. కర్నాటకలో ప్రధాన పర్యాటక ఆకర్షణ. పర్యాటకులు అనేక మంది వస్తారు. గగన్ మహల్, రాయల్ ప్యాలెస్, సత్ మంజిల్, బారా కమాన్, జాలా మంజిల్ భవనాలు సిటడెల్ సమీపంలో కలవు.



Click it and Unblock the Notifications