శివ బారి దేవాలయాన్ని 19 వ శతాబ్ద౦లో దుంగర్ సింగ్ నిర్మించాడు. ఈ దేవాలయ౦ చుట్టూ శత్రువుల దాడులనుండి రక్షించే ఒక దుర్భేద్యమైన గోడ ఉంది. ఈ దేవాలయంలో శివుని చతుర్ముఖ నల్లపాలరాయి విగ్రహంతో బాటుగా శివలింగానికి ఎదురుగా నంది కాంస్య విగ్రహం ఉంది. ఇక్కడ,పర్యటకులు బావరిలు అనే రెండు పెద్ద నీటి జలాశయాలను చూడవచ్చు.బికనేర్ కు 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దేవాలయం సున్నితమైన కుడ్య చిత్రాలకు ప్రసిద్ది. ఈ ఎరుపు ఇసుక రాయి దేవాలయం దేశం నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో పర్యాటకులను ఆకర్షిస్తుంది.



Click it and Unblock the Notifications