కనౌజ్ రోడ్ లో గంగా నది ఒడ్డున బ్రహ్మవర్త్ ఘాట్ ఉంది. ఈ ప్రశాంతమైన ప్రదేశానికి ధార్మిక, చారిత్రిక ప్రాధాన్యత ఉంది. హిందూ ఇతిహాసాల ప్రకారం, బ్రహ్మ దేవుడు బితూర్ ను తన నివాసంగా ఎంచుకొని, మానవజాతిని మొదటగా ఇక్కడనే సృష్టించాడు. ఈ కార్యక్రమ౦ జరిగిన ప్రాంతమైనందున దీనిని బ్రహ్మావర్త లేదా బ్రహ్మ స్థలం అని అంటారు. తర్వాత బ్రహ్మదేవుడు ఇప్పటికి బ్రహ్మేశ్వర మహాదేవ పేరుతో పూజించబడే ఒక శివ లింగాన్ని కూడా స్థాపించాడు. ఇక్కడ పొందుపరచిన ఒక గుర్రపు మేకుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. దీనిని బ్రహ్మదేవుని గుర్రపు మేకుగా విశ్వసిస్తారు.



Click it and Unblock the Notifications