బిఆర్ హిల్స్ లో ప్రధాన ఆకర్షణ బిఆర్ టి వన్య ప్రాణి సంరక్షణాలయం.దీనిని తప్పక చూడాలిఇది కర్నాటక దక్షిణ భాగంలో తుంగభద్ర, కావేరి నదుల మధ్య ఉంది. దీనికి మరోపేరు బిలిగిరి రంగస్వా మి దేవాలయ వన్యప్రాణి సంరక్షణాలయంగా చెపుతారు. ఇది 540 చ. కి.మీ.ల విస్తీర్ణం కలిగి సముద్ర మట్టానికి షుమారు 5091 అడుగుల ఎత్తులో ఉంది. ఈ వన్యప్రాణి సంరక్షణాలయం వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 క్రింద రక్షిత ప్రాంతంగా గుర్తించారు.దీనిని దర్శించిన వారికి వివిధ రకాల, జంతువులు, మొక్కలను చూసే అవకాశం ఉంటుంది. ఈ శాంక్చువరి లో ఏనుగులు, సాంబార్, రక్షిత పులులు, జింకలు వంటివి ఎన్నో ఉంటాయి. 116 రకాల సీతాకోక చిలుకలు, 22 జాతుల పాములు ఉన్నాయి. 225 జాతుల పక్షులు కూడా ఉన్నాయి. మైనాలు, చిలుకలు, వంటి అరుదైన పక్షులు ఎన్నోకనపడతాయి. ఇక్కడి మొక్కలు పరిశీలిస్తే, వీటిలో పచ్చటి మొక్కలు, పొదలు, పచ్చని గడ్డి, ఆకురాలు చెట్లు ఉంటాయి. వీటిని సందర్శకులు జీప్ లేదా ఏనుగుల సవారీ ద్వారా చూడవచ్చు. ఈ రకమైన సందర్శనే కాక పర్యాటకులు ఎన్నో సాహస క్రీడలు అంటే బోటింగ్, ఫిషింగ్ వంటివి చేయవచ్చు. ఈ ప్రాంత సందర్శనకు అక్టోబర్ నుండి మే వరకు అనుకూలం