స్ప్రింగ్ అఫ్ సోలేస్ లేదా సుఖనాగ్ ని ఇంతకు పూర్వం సోఖనాగ్ గా పిలిచేవారు. బుద్గం జిల్లాలో ఉన్న తోసా మైదాన్ కి సమీపం లో ఈ అందమైన కొలను ఉంది. కంజ్ జుబ్జి అనబడే ప్రాంతం నుండి 20 అడుగుల ఎత్తున్న జలపాతం నుండి రూపు దాల్చిన ఈ కొలను కొన్ని చిన్న చిన్న కొలనులలో కలుస్తుంది. పెద్ద బండ రాళ్ల మధ్య లోంచి ప్రవహించే ఈ సుఖనాగ్ యొక్క ప్రధాన ఆధారం ఆహిజ్ కొలను.
సోన మీన్ కోల్, లార్ కోల్ మరియు మాలా కోల్ వంటి కొన్ని కొలనులుగా ఈ కొలను విడిపోతుంది. సేద్యం కోసం ఈ కొలను లో ని నీళ్ళు బీర్వా తెహసిల్ లో ని గ్రామాల లో ని ప్రజలు వాడతారు.