చందేరి లో ఉన్న పతాని దర్వాజా సగర్వంగా నిలబడే గొప్ప ప్రవేశ మార్గం. పురాతన కాలం యొక్క అద్భుతమైన రోజులకు సాక్ష్యంగా ఈ గేటు వే నిలుస్తుంది. శంఖం ఆకారం లో ఉన్న టరేట్స్ ఈ నగరం లో ఆకర్షించే విధం గా ఉన్న నిర్మాణ శైలిని వివరిస్తాయి. ఈ నిర్మాణాలలో ఉన్న కళాత్మకమైన పానెల్లు ఈ కట్టడాల యొక్క నిర్మాణ శైలి గొప్పదనాన్ని చాటి చెప్తాయి.
30 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో పతాని దర్వాజా ఉంది. రాతి తెరలచే ఈ టరేట్స్ కలుస్తాయి. ఈ కట్టడం యొక్క అందం చందేరి కి మాత్రమే చెందినా విభిన్నమైన నిర్మాణ శైలిలో కనబడుతాయి. ప్రస్తుతం ఈ పతాని దర్వాజా అందమైన ఆకృతి లో ఉండనప్పటికి సరైన నిర్వహణ ద్వారా తిరిగి ఘనమైన వైభవాన్ని పొందుతుంది. చక్కటి నిర్మాణ శైలి వల్ల ఈ వారసత్వ భవనం పర్యాటకులని ఆకట్టుకుంటుంది. చందేరి కి బయట అందంగా చెక్కబడిన ఇటువంటి కట్టడాన్ని చూడడం అరుదు.



Click it and Unblock the Notifications