నాగమందిర్ ఆఫ్ బెరినాగ్,బెరినాగ్ గ్రామంలో ఉన్న చాలా ప్రసిద్ధి చెందిన ఆలయం. ఇది చెట్లు మరియు కొండకనుమలు సరిహద్దులుగా ఉన్న ఒక పాము దేవాలయం. 14వ శతాబ్దంలో మహారాష్ట్ర యొక్క పంత్స్ ఈ ప్రదేశంలో నివసించడానికి వొచ్చారు మరియు వారు ఇక్కడ పెద్ద సంఖ్యలో అనేక రకాల పాములను చూశారు. ఈ కారణంగా ఇక్కడ 'నాగమందిర్' కట్టబడిందని ఒక నమ్మకం. యమునా నదిలో ఉన్న కాలినాగ్ ను ఓడించిన తరువాత, శ్రీ కృష్ణుడు దానిని యమునా నదిని వదిలి వెళ్ళమని చెప్పాడని, అప్పుడు కాలినాగ్ తన అనుచరులతో ఈ ప్రదేశానికి వొచ్చి ఉంటుందని ఒక నమ్మకం.



Click it and Unblock the Notifications