కొర్లై కోటను మారో లేదా కేసల్ కర్లూ అని కూడా అంటారు. దీనిని పోర్చుగీసు వారు కొర్లై పట్టణంలో మారో డిచౌల్ ద్వీపంపై నిర్మించారు. అంటే సుమారు 500 సంవత్సరాల క్రిందట గల చౌల్ గ్రామంలో వారు దీనిని నిర్మించారు. ఈ కోటను పోర్చుగీసు పాలకులు వారి పాలన రక్షణ కొరకు వినియోగించారు. రేవదండే ఓడరేవు మార్గాన్ని రక్షించేందుకు దీని నిర్మాణం జరిగింది. ఈ కోట నిర్మాణం ప్రపంచంలోని పటిష్టమైన కోటలలో ఒకటిగా ఖ్యాతి చెందింది. ఒకప్పుడు దీనిలో సుమారుగా 7000 గుర్రాలు, అదే సంఖ్యలో మనుషులు వసతి పొందేవారు.



Click it and Unblock the Notifications